ఎగతాళి చేసే వ్యక్తులను ఎలా ఎదుర్కోవాలి | egathali chese varini yela yedurkovali
ఇవాళ్టి టాపిక్ లో egathali chese varini yela yedurkovali గురించి తెలుసుకుందాం.
ఎగతాళి చేసే వారిని ఎలా ఎదుర్కోవాలి
మన జీవితం ఎప్పుడూ సాఫీగా అయితే ఉండదండి ఎందుకంటే ఏదో ఒక సమయంలో చెప్పకుండా కష్టాలు వచ్చేస్తూనే ఉంటాయి వాటిని మనం ఎదుర్కొంటూనే ఉండాలి. కాకపోతే ఆ కష్టాల్లో మెయిన్ ముఖ్యమైన కష్టం ఏంటంటే మన జీవితంలో మనల్ని చిన్నచూపు చూస్తూ ఎప్పుడు వెగతాలి చేస్తూ తక్కువ చేసే మాట్లాడే వాళ్ళని తరచు మనం ఎదుర్కొంటూనే ఉంటాం. కాకపోతే కొందరైతే మన ఎదుగుదల చూసి వాడు ఎదగలేకపోతున్నాడు ఏంటి అని చెప్పేసి మనల్ని కూడా వాడి స్థాయికి తీసుకెళ్ళటానికి మనల్ని ఎగతాళి చేస్తూనే ఉంటాడు. అలాంటి ఎగతాళిని అలాంటి తక్కువ చేసి మాట్లాడే మాటల్ని మనం ఎలా తీసుకోవాలి అసలు ఎలా ఎదుర్కోవాలి అనేది ఈ రోజు మన టాపిక్.
ఇంకా డైరెక్ట్ గా పాయింట్ కి వెళ్తే ఫస్ట్ అఫ్ ఆల్ మనకి ఆత్మవిశ్వాసం ఉండాలండి. దేనికైనా సరే అది ఏ పనికైనా సరే ఆత్మవిశ్వాసం అనేది చాలా కీలకమైనది నీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు అనేది కాదు గాని నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావ్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక 10 మంది వచ్చేసి నీ గురించి ఒకే మాట చెప్పారనుకో అవును 10 మంది చెప్తున్నారు కదా అదే కరెక్ట్ అని చెప్పేసి నువ్వు అనుకుంటావ్. కాకపోతే అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావ్ అనేది చాలా ఇంపార్టెంట్ 10 మంది కాదు. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు నీ దగ్గరికి వచ్చి నువ్వు ఇది అని చెప్పినా కూడా నీ గురించి నీకు తెలిసిన ఒక పచ్చి నిజం ఒకటి ఉంటుంది ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని మాత్రం పక్కన పడేయండి.
ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే మీరు ఎవ్వరిని పట్టించుకోకుండా పోయినా కూడా వాళ్ళు మిమ్మల్ని వదలరు మీరు సమాధానం చెప్పేంత వరకు మిమ్మల్ని కించపరుస్తూ మాట్లాడుతూనే ఉంటారు మిమ్మల్ని ఎగతాళి చేస్తూనే ఉంటారు మీకు కోపం తెప్పించి వాడు తో డిస్కస్ చేసేలా చేస్తారు. కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎవరికైనా సమాధానం ఇవ్వడానికి మనం మన సమయాన్ని వృధా చేయాల్సిన అవసరం లేదండి. ఎవరైనా మిమ్మల్ని ఎగతలి చేస్తే వాడు ఫస్ట్ అఫ్ ఆల్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే వాడితో మనం డిస్కషన్ పెట్టాలని చెప్పేసి వాడి మెయిన్ టార్గెట్ అది. నేనేమంటానంటే ప్రతి ఒక్కళ్ళకి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అలా సమాధానం చెప్పడం మొదలు పెడితే వాడు మళ్ళీ ఇంకొక రూపంలో మనల్ని ఎగతాళి చేస్తూనే ఉంటాడు. కాకపోతే నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు వాడికి ఒకే ఒక్క విషయంలో మాత్రం సమాధానం చెప్పాలి అది కూడా మీ పనితీరుతో సమాధానం చెప్పాలి. మీరు ఏదైతే వర్క్ లో ఉన్నారో దాంట్లో విజయం సాధించి మీ గొప్పతనాన్ని వాడికి చూపించాలి. అంతే అంతకు మించి ఏం లేదు వాళ్ళతో అసలు మీరు డిస్కషన్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ప్రతి వ్యక్తి మనల్ని అర్థం చేసుకోవాలి అనే రూల్ అయితే లేదండి. అందరూ మన ప్రయాణాన్ని అర్థం చేసుకోరు ఎవరో ఒకరు నీ గురించి చెడు మాటలు అంటూ ఉంటారు అది వాళ్ళ అభిప్రాయం మాత్రమే కానీ అది నిజం కాదు కదా. అందుకనే ప్రతి ఒక్కరికి మీరు అర్థమయ్యేలా చెప్పి అరే బాబు నేను అది కాదురా ఇది అని చెప్పేసి వాళ్ళకి మీ గురించి మీరు చెప్పుకొని మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరేంటో మీకు తెలిసినప్పుడు ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్లి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది. కాబట్టి అవతలి వాళ్ళ అభిప్రాయాలు నిజమైతే కావండి అవి కేవలం అభిప్రాయాలు మాత్రమే.
ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మన మీద ఎగతాలు చేసే వారిలో చాలా మంది వాళ్ళ జీవితంలో ఉండే చాలా సమస్యల వల్ల అలా మాట్లాడుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే వాళ్ళ కష్టాలు వాళ్ళు తీర్చుకోవడమే చేత కాదు అలాంటోళ్ళు మన దగ్గరికి వచ్చి మనల్ని ఎగతాలు చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళని మీరు అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా కొంచెం డెప్త్ గా చెప్పాలంటే వాళ్ళు మనల్ని ఎగతాలు చేస్తున్నారనే గాని వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనతో అవసరం ఉంటుంది అలా అవసరం వచ్చినప్పుడు మాత్రం మనం వాళ్ళలాగా బిహేవ్ చేయకుండా వాళ్ళని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని ఎగతాళి చేసే వాళ్ళని మీరు తక్కువగా చూడొద్దు అలా అని చెప్పేసి వాళ్ళ మీద పగ పెంచేసుకోవాల్సిన అవసరం మనకు లేదు. మనకున్న లక్ష్యం ఏంటంటే మనం ఏదైతే జీవిత లక్ష్యంగా భావిస్తామో దాని మీద మాత్రమే కాన్సంట్రేట్ చేయాలి ఎందుకంటే నీకైనా నాకైనా ఎగతాలు చేసే వాడికైనా సరే ఉన్నది కేవలం కొంతకాలం మాత్రమే. ఆ కొంత సమయాన్ని ఎవడైతే కరెక్ట్ గా వాడుకుంటాడో వాడు జీవితంలో ఆనందంగా ఉంటాడు వాడు జీవితంలో అనుకున్నది సాధిస్తాడు వాడు క్వాలిటీ లైఫ్ ని అనుభవిస్తూ ఉంటాడు ఇది పచ్చి నిజం. కాబట్టి మనల్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే మనం వాళ్ళకి రియాక్ట్ అయ్యి అంత టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అంతేకాకుండా మనల్ని వాళ్ళు తక్కువ చేసినంత మాత్రాన మనం తక్కువ వాళ్ళం అయిపోము మనం ఏంటో మనకు తెలుసు. కాబట్టి మన పని మనం చేసుకుందాం.
ఈ టాపిక్ మీకు నచ్చితే షేర్ చేయండి అంతేకాకుండా ఇంకా మన వాట్సాప్, టెలిగ్రామ్ బ్లాగ్ లో ఎలాంటి టాపిక్ కావాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మన వాట్సాప్ టెలిగ్రామ్, ఛానల్ లో వచ్చే కంటెంట్ మీకు నచ్చితేనే ఫాలో చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.