# Snapdragon vs MediaTek
ఈ టాపిక్ లో మీకు చెప్పబోతున్నాను. Snapdragon vs MediaTek గురించి. మిమ్మల్ని టెక్నికల్ స్పెసిఫికేషన్తో కాన్ఫ్యూజ్ చేయకుండా సింపుల్ గా ఇన్ఫర్మేషన్ ని అందిస్తాను.
Processor అంటే ఏంటి
ముందుగా ప్రాసెసర్ అంటే ఏంటో చూద్దాం. ప్రాసెసర్ అంటే మనం అందించే ఇన్స్ట్రక్షన్స్ నీ ప్రాపర్ లాజిక్ తో మేనేజ్ చేయడం. దీన్నే CPU అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటారు. ఎందుకంటే ఇది మొత్తం డివైస్ కి హార్ట్ లాంటిది కాబట్టి. మన బాడీ లో హార్ట్ ఎలా అయితే బ్లడ్ ని ఆర్గాన్స్ కి డిస్ట్బ్యూట్ చేస్తుందో అలాగే ప్రాసెసర్ కూడా దేనికి అందించాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ని ఆ డివైస్ కి అందిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే కంప్యూటర్ లో ప్రాసెసర్ ఎలా అయితే పనిచేస్తుందో స్మార్ట్ ఫోన్ లో కూడా అలాగే పనిచేస్తుంది.
MediaTek Processor అంటే ఏంటి
ఇప్పుడు మనం MediaTek Processor గురించి చూద్దాం. ఇది ఒక Taiwanese semiconductor company Processor దీంట్లో ఎక్కువ కోర్స్ వుంటాయి. ఇందులో ఆక్ట కోర్, ఎక్సా కోర్ etc.
Octa Core ఆక్టా కోర్: అక్టా కోర్ అంటే ఒక ప్రాసెసర్ లో 8 ప్రోసెసింగ్ యూనిట్స్ ఉంటాయి. ఇవి ఎంత ఎక్కువగా ఉంటే ప్రాసెసర్ ఇన్స్టక్షన్స్ ప్రాసెస్ చేస్తుంది. ఫైనల్ గా డివైస్ అంటే స్మార్ట్ ఫోన్ ఫాస్ట్ గా ఉంటుంది. ఎప్పుడైతే కోర్స్ ఎక్కువ గా ఉంటాయో పెర్ఫార్మెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ RAM కూడా ప్రాసెసర్ కి సపోర్ట్ చేసినపుడు మాత్రమే. ఎక్కువ కోర్స్ ఉన్న ప్రాసెసర్ కి తక్కువ RAM ఉన్నట్లు అయితే ఫైనల్ గా device కూడా స్లోగా వుంటుంది. దీని వలన ఎక్కువ బ్యాటరీ సప్లై కావాల్సిఉంటుంది. అందువలన MediaTek ప్రాసెసర్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ త్వరగా బ్యాటరీ డ్రెయిన్ అవుతాయి మరియు హీట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ MediaTek ప్రాసెసర్ తో యూజ్ చేసేది Mali GPU. జనరల్ గా CPU మరియు GPU ప్రాసెసర్ మ్యాచ్ అయితే స్మార్ట్ ఫోన్స్ చాలా ఎఫిషియంట్ గా పనిచేస్తాయి. కానీ Mali GPU అనేది వేరే కంపెనీ. అందుకు ప్రాసెసర్ మరియు గ్రాఫిక్స్ కరెక్ట్ గా మ్యాచ్ అవ్వవు. దీని వలన మొత్తం chipset effect అవుతుంది. అందుకనే MediaTek ప్రాసెసర్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ ధర తక్కువగా ఉంటాయి.
Snapdragon Processor అంటే ఏంటి
Snapdragon Processor ఏంటో చూద్దాం. ఈ ప్రాసెసర్ Qualcomm అనే అమెరికన్ కంపెనీ తయారుచేస్తుంది. ఈ chipset lo ఒక ప్రాసెసర్ కాకుండా Adreno GPU, IMAGE Processor, Media Processor, WiFi Module, Gps Module అన్ని ఒకే chipset లో ఉంటాయి. అంటే Snapdragon Chipsets ని SoC అంటే సిస్టమ్ ఆన్ చిప్ అంటారు. ప్రతి ఒక్క పనికి ఒక మాడ్యుల్ సెపెర్టే గా ఉంటుంది కాబట్టి Snapdragon Chipsets ఉన్న స్మార్ట్ ఫోన్లు పెర్ఫార్మెన్స్ మరియు బ్యాటరీ లైఫ్ ఎక్కువగా వుంటుంది. MediaTek ప్రాసెసర్ తో compare చేస్తే హీట్ కూడా తక్కువే ఎప్పుడైతే CPU మరియు GPU అంటే Adreno గ్రాఫిక్స్ ఒకే కంపెనీ manufacture చేస్తుందో అప్పుడు రెండు యూనిట్స్ పెర్ఫార్మెన్స్ మ్యాచ్ అవ్వడానికి పాజిబిలిటీ వుంటుంది. మొత్తానికి స్మార్ట్ ఫోన్ పెర్ఫార్మెన్స్ మంచిగా ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్ గా ఉన్న Snapdragon Chipset వెర్షన్ Qualcomm Snapdragon 8 Gen 2. ఇన్ని అడ్వాంటేజస్ ఉన్నాయి కాబట్టి Snapdragon Chipsets ఉన్న స్మార్ట్ ఫోన్స్ ధర కొంచం ఎక్కువే. ఇదండీ MediaTek మరియు Snapdragon Processor మధ్య తేడా.