మనసుకు నిరాశ ఆవహిస్తే ఇలా చేయండి | Self Improvement in Telugu
ఇవ్వాల్టి టాపిక్ లో Self Improvement in Telugu గురించి తెలుసుకుందాం అండి
ఒక్కొక్కసారి మనసుకు నిరాశ నిస్పృహలు కమ్మేస్తుంటాయి ధైర్యం ఉండదు మనోబలాన్ని కోల్పోతాం ఏదో తెలియని అసంతృప్తి వెలితి తీవ్రమైనటువంటి వేదన బాధ ఇవన్నీ మనల్ని వెంటాడుతుంటాయి. ఎటు చూసినా చీకటే కనిపిస్తుంటది అసలు మన మనసుకి నిరాశ నిస్పృహలు ఎందుకు అమ్ముకుంటాయి చెప్పండి మనం అనుకున్నవి అనుకున్నట్లుగా జరగకపోయినట్లయితే మొదట ఎదురయ్యేది నిరాశనే. మనం సక్సెస్ కావాలని మనం అనుకున్నటువంటి విషయంలో విజేతగా నిలబడాలి అని అది ఏదైనా కావచ్చు. ఒక పరీక్షలో మంచి మార్కులు సంపాదించడం కావచ్చు ఒక పోటీ పరీక్షలో ఉద్యోగం సాధించడం కావచ్చు లేదా ఒక బిజినెస్ లో సక్సెస్ కావడం కావచ్చు ఏదైనా సరే మనం సక్సెస్ కావడం కోసం మనం ఎంత కష్టపడ్డా కూడా మనకి వరుసగా ఓటమే ఎదురవుతుంది అనుకోండి. ఆటోమేటిక్ గా నిరాశ నిస్పృహల్లో కూరుకొని పోతారు. ఒక్కొక్కసారి ఎవరికి చెప్పుకోలేని బాధలు ఉండొచ్చు ఎవరో ఏదో అన్నారన్న బాధ ఉండొచ్చు. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు ఇవన్నీ కూడా మనకి మన మనసుకి నిరాశ నిస్పృహలను కలుగజేస్తాయి. ఇక నేను ఏం సాధించలేనేమో ఇక నా జీవితం అంతా కష్టాలేనేమో నా వల్ల కాదేమో ఇలా చాలా నెగిటివ్ ఆలోచనలు మనసును కమ్ముకున్నప్పుడు నిరాశ అనేది జనిస్తది. అలాంటి సమయంలో మనకు ఏమనిపిస్తది చెప్పండి ఎవరికైనా సరే నా జీవితంలో ఒక అద్భుతం జరిగితే బాగుండు నాకు భగవంతుడు ప్రత్యక్షమై నాకు వరాలు ఇస్తే బాగుండు అసలుకి ఈ క్షణంలో నా కష్టాలన్నీ మాయమైపోతే బాగుండు, అసలు తెల్లారకపోతే బాగుండు, నాకు ఇవన్నీ చెప్పుకోవడానికి ఒక ఓదార్పు ఉంటే బాగుండు, ఒక మంచి ఫ్రెండ్ ఉంటే బాగుండు, నన్ను ఎవరైనా ఓదారిస్తే బాగుండు ఇలా మన మనసు ఏం కోరుకుంటది మన మనసును నిరాశకు అమ్ముకున్నప్పుడు అంటే ఒక ఓదార్పును కోరుకుంటది. ఈ ఓదార్పు అనేది కొంతమందికి దక్కుతుండొచ్చు కొంతమందికి దక్కకపోవచ్చు కొంతమందికి ఫ్రెండ్స్ రూపంలో, పేరెంట్స్ రూపంలో, బ్రదర్ సిస్టర్స్ రూపంలో ఇలా కొంత కన్సర్నింగ్ అనేది తగ్గొచ్చు. కొంతమందికి అలా ఓదార్పుని ఇచ్చే వాళ్ళు కూడా ఉండకపోవచ్చు. అయితే మనం నిరంతరం ఈ ఓదార్పు కోసం లేదా మనల్ని నిరంతరం మోటివేట్ చేయడం కోసం ఒకరి మీద ఆధారపడటం కరెక్టేనా? ఎప్పుడు ఎవరో ఒకరు మన వెంట ఉంటారా ఉండరు మన వెంట నిరంతరం ఉండేది ఏంటో తెలుసా మన మనస్సు. కాబట్టి మన మనసుని నే ఒక మోటివేషన్ సెంటర్ గా మార్చుకోవాలి. జీవితంలో ఎన్నో సార్లు ఓటమి ఎదురవుతుంటది ఎన్నో సార్లు అవమానాలు ఎదురవుతుంటాయి ఎన్నో సార్లు మనం చేయని తప్పులకి మనం క్షమాపణ చెప్పాల్సి రావస్తది ఎన్నో సార్లు మనం మనకు తెలియకుండానే మన ప్రమేయం లేకుండానే ఇతరుల వలన సమస్యలకు గురి కావాల్సిన సందర్భాలు వస్తుంటాయి. ఎన్నో సార్లు అనుకున్నవి అనుకున్నట్టుగా జరగవు ఫెయిల్యూర్స్ ఎదురవుతుంటాయి, కష్టాలు ఎదురవుతుంటాయి, కన్నీళ్లు ఎదురవుతుంటాయి.
జీవితం అంటేనే అది కదా సాఫీగా సాగుతుందా జీవితం మనం పోయే దారిలో రాళ్లు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, కంప ఉంటుంది అన్ని ఉంటాయి. అని చెప్పేసి మనం గమనం ఆపేస్తామా అక్కడే ఆగిపోతాం అన్నింటిని చదును చేసుకుంటూ మనం వెళ్లే దారిని మనమే పూలదారిగా మార్చుకుంటూ మనం ముందుకు ప్రయాణించాల్సిందే. ఇదే జీవితం అంటే మనకు ఒక్కసారి ఓటమి ఎదురు కాగానే ఆ భయాన్ని వదిలించుకోకపోతే మనం ముందుకు వెళ్ళలేము గుర్తుపెట్టుకోండి అయితే ఎప్పుడైతే మనకు ఓటమి ఎదురవుతుందో ఎప్పుడైతే మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరగకుండా నిరాశ నిస్పృహలు ఎదురవుతాయో ఇమిడియట్ గా మనల్ని మనం బలోపేతం చేసుకోవాలి ఒక కెరటం ఉంది చూసారా ఎంత ఆదర్శంగా తీసుకోవచ్చు. దాన్ని ఎన్ని సార్లు కింద పడ్డా మళ్ళీ ఉవ్వెత్తున పైకి లేస్తుంది. మనసులో మనకు నిరాశ కమ్ముకున్నప్పుడు ఇక నేను ఏమి సాధించలేను అని మనసు ఒక నిస్పృహకు లోనైనప్పుడు నిరంతరం మీలో స్ఫూర్తిని రగిలించుకునే బాధ్యత మీదే నీలో ఎలా ఉండాలి మన మనసు అంటే ఎప్పటికప్పుడు మనకు ఎదురైనటువంటి ప్రతి దాన్ని స్వీకరిస్తూ దాన్ని యాక్సెప్ట్ చేస్తూ మనల్ని మనం కొత్తగా మలుచుకుంటూ ముందుకు వెళ్లడానికి మనం మానసికంగా సంసిద్ధంగా ఉండాలి.
మనం సక్సెస్ కావాలి ఎవరికైనా ఉండే కోరిక అదే మరి ఎప్పుడు సక్సెస్ అవుతాము అంటే మనలో దృఢ సంకల్పం నేను ఇది సాధించి తీరాలబ్బా అంతే అనే ఒక దృఢ సంకల్పం అంతకు మించి ఆత్మవిశ్వాసం అంతకు మించి బలమైన కోరిక గనుక మనలో ఉన్నట్లయితే కచ్చితంగా విజయం మనకు వచ్చి తీరుతుంది గుర్తుపెట్టుకోండి. ఈ వచ్చే క్రమంలో ఒక్కొక్కసారి ఓటమి మనకు ఎదురవుతుండొచ్చు గెలవకపోవడం ఓటమి కాదు ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అసలు ప్రయత్నం చేయకపోవడమే ఓటమి మనం సక్సెస్ అవుతామో లేమో అని భయపడి ఆగిపోతాం చూసారా అది ఓటమి ఒక్కొక్కసారి ఓటమి ఎదురవుతుంది తప్పులేదు అందులో మీరు అనుకునేవి అనుకున్నట్టు జరగవు ఒక్కొక్కసారి మీరు రాస్తున్నటువంటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో ఫెయిల్యూర్స్ ఎదురవుతుండొచ్చు అంత మాత్రాన కృంగిపోవద్దు మళ్ళీ ప్రయత్నించాలి.
ఇంకొక విషయం తెలుసా చాలా విజయాలు ఓటమి తోటే మొదలవుతాయి. గొప్ప గొప్ప ప్రయత్నాలు గొప్ప గొప్ప ఆలోచనల తోటి విజయాలు రావు చాలా వరకు విజయాలన్నీ కూడా హేళన, తోటి అవహేళన, తోటి విమర్శల తోటి ఆ తర్వాత ఇలాంటి ఓటముల తోటే మొదలయ్యి వాటి నుంచి నేర్చుకున్నటువంటి పర్ఫెక్ట్ రూట్ తోటి విజయం అనేది మనకు వర్తిస్తది కాబట్టి మనం ఓడిపోతున్నాము అన్నప్పుడు మనం నేర్చుకుంటున్నాము. అనుభవాన్ని కూడబెట్టుకుంటున్నాము అని పాజిటివ్ గా ఆలోచించండి ప్రయత్నం చేయాలి. కచ్చితంగా జీవితం అంటే మనం ఏదైతే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నామో ఆ లక్ష్య సాధన కోసం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో మనం గెలిస్తే ఏమవుతది ఆ గెలుపు మనకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తది. ఒకవేళ ఓడిపోతే ఏమవుతది మనకు అనుభవాన్ని ఇచ్చి ఏం చేస్తే గెలుస్తావు ఏం చేస్తే ఓడిపోతావు అనే గొప్ప అనుభవాన్ని ఇస్తది. కాబట్టి ప్రతి దాన్ని మనం పాజిటివ్ గా తీసుకోవాల్సిందే.
ఏది జరిగిన మనం మంచికే అనుకోవాలి జీవితంలో మన అందరికీ కలలు ఉంటాయి లక్ష్యాలు ఉంటాయి. అవి ఒక రాత్రికి రాత్రి నెరవేరేటివి కావు ఎప్పుడూ కూడా మనం ఎంచుకున్నటువంటి ఒక లక్ష్యం, ఒక కోరిక, ఒక కల అనేది మనకు ఎదురు రాదు మనమే దానికి ఎదురెళ్ళాలి. మనమే శోధించి సాధించుకోవాలి మనం ఎదురు చూసినట్టుగా మనకి కలలు ఊహల్లో మాత్రమే వస్తాయి. మనం అనుకున్నట్టు అనుకున్నట్టుగా లైఫ్ లోకి నిజ జీవితంలో అవి మనకి ఎదురు రావాలి అంటే మనం శోధించి సాధించుకోవాల్సిందే అవునా కాదా. అయితే చాలా మంది ఏమనుకుంటారు అంటే ఈ ప్రయత్నం చేయకుండా కష్టపడకుండా సాధించుకునే క్రమంలో ఓడిపోయినప్పుడు దేవుడు నాకు మంచి రాత రాయలేదు, దేవుడు నా తలరాతని ఇలా రాశాడు. నా రాతలో లేదు ఇలా రాత మీదకి నెట్టేసి దేవుడి మీదకి నెట్టేసి మన అసమర్థతను మనం కప్పి పుచ్చుకుంటాం గుర్తుపెట్టుకోండి. దేవుడు రాసాడా లేదా అనేది పక్కన పెడితే ఒకవేళ రాసాడే అనుకుందాం. అందరి అభిప్రాయం ప్రకారం తలరాత దేవుడే రాశాడు అనుకుందాం కానీ ఎడిట్ ఆప్షన్ మనకే ఇచ్చాడు తెలుసా. ఆ విషయం ఏదో నాకు తెలిసినట్టు రాశాను కానీ మీకు నచ్చినట్టుగా మీరు మార్చుకోండి ఎడిట్ చేసుకోండి అనే గొప్ప అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. ఈ విషయం ఎంతమంది గ్రహించారు చెప్పండి ఎంతమంది జీవితంలో కాంప్రమైజ్ అయ్యి కాంప్రమైజ్ కాకుండా కంఫర్ట్ జోన్ లో ఉండకుండా కష్టపడుతూ వాళ్ళు అనుకున్నటువంటి జీవితాన్ని సాధించగలుగుతున్నారు. ఇక్కడ కష్టపడకుండా సునాయాసంగా రావాలని ఆశిస్తూ దేవుడు నాకు మంచి రాత రాయలేదని దేవుని నిందించుకుంటూ అదృష్ట దురదృష్టాన్ని నిందించుకుంటూ గడిపేసే వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. ఈ విషయం అంతరాత్మలు ఒకసారి పరీక్షించండి మనం అవునా కాదా సో మనం తలుచుకుంటే మన తలరాతని మనమే మార్చుకోవచ్చు. మన జీవితాన్ని మనమే మార్చుకోవచ్చు మనం అనుకునేది మనమే సాధించవచ్చు. దానికి ఎల్లప్పుడూ మనం చేయాల్సిన పని ఏంటి అంటే మన మనసును పాజిటివ్ గా ఉంచుకోవడం మన జీవితాన్ని ఎల్లప్పుడూ పాజిటివ్ గా ముందుకు నడిపించుకోవడం. ఇంకొక విషయం తెలుసా ఏదైనా సరే మనల్ని ముందు భయపెట్టిస్తది ఇది నేను చేయలేనేమో ఇది సాధించలేనేమో ఇది నా వల్ల కాదేమో అనిపిస్తది కష్టాన్ని చూసి భయపడతారు. కష్టం కొంతమంది కష్టం వస్తదేమో అని ముందే భయపడి ప్రయత్నించకుండా కూర్చుంటారు. కొంతమంది మేము ఓడిపోతామేమో అని ముందే భయపడి ప్రయత్నించకుండా కూర్చుంటారు. కొంతమంది వామ్మో నన్ను ఎవరైనా ఎక్కిరిస్తారేమో అని ముందే భయపడి ప్రయత్నం ఆపేస్తారు. ఇలా ఒక ఓటమికి భయపడుతూ మనం కూర్చుంటే అడుగు ముందుకు వేయలేము ఎప్పుడైనా సరే దేనికైనా సరే ఒక సవాలు లేదో ఒక సమస్యకి మనం ఎదురెళ్ళాలి. దూరం నుంచి ఒక కొండను ఎక్కాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మనకి ఒక పర్వతమో, ఒక కొండనో ఎక్కాలి. మనం దాని దగ్గరికి వెళ్ళినం ఎక్కడానికి దాని వైపు ఒక్కసారి పైకి చూసిన ఏమనిపిస్తది చెప్పండి. వామ్మో ఇంత పెద్ద కొండని ఇప్పుడు నేను ఎక్కాలా, ఇంత పెద్ద పర్వతం ఎక్కాలా అని భయపెట్టిస్తది. మనల్ని ఎక్కడ మొదలు పెట్టారు మీరు చివరికంట ఎక్కేశారు అప్పుడు మీరు ఏ కొండను చూసి అయితే భయపడ్డారో ఏ పర్వతాన్ని చూసి అయితే భయపడ్డారో అది ఎక్కడ ఉంది చెప్పండి మీకు కాళ్ళ కింద ఉంది.
సమస్య అయినా సవాళ్లైనా కష్టమైనా అంతే ఎదురెల్లి పోరాడితే అది మన కాళ్ళ కిందకి చేరుతుంది. ఈ విషయం మీరు మర్చిపోకండి భయపడ్డంత సేపు ఏదైనా మనల్ని భయపెట్టిస్తది. దాన్ని సాధించుకునేంత వరకు ఆ ఎదురెళ్లే క్రమంలో కాసింత సహనాన్ని వహించాల్సిన అవసరం రావచ్చు ఓర్పు పట్టాలి. కచ్చితంగా ఓటమి ఓర్పు సహనాన్ని సహనంగా ఎదుర్కొన్న వాళ్ళు ఓర్పుతో ఎదురు చూసిన వాళ్ళకి లైఫ్ లో ఫెయిల్యూర్స్ అంటూ లేవు. కచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ వచ్చేసి ఆలింగనం చేసుకుంటది. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దాని వల్ల కలిగే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. ప్రపంచమంతా చీకటి అయిపోయింది, ఎటు చూసినా మనకు నైరాశ్యమే కనపడుతుంది, ఎటు చూసినా మనకు సహాయం చేసే వాళ్ళు లేరు ఎప్పుడు చూసినా కష్టాలు ఎదురవుతున్నాయి. ఒక దాని తర్వాత ఒకటి ఇలాంటి పరిస్థితుల్లో కూడా మన మనోబలము అనేది మనకు ఉన్నది ఉన్నట్లయితే కచ్చితంగా ఎంత చీకటిలోనైనా అదే ఒక వెలుతురుగా మారి ఒక దీపంగా మారి మనల్ని ముందుకు నడిపిస్తది. ఇది నిజంగా చెప్తున్నాను ఏదైనా మన మీదనే ఆధారపడి ఉంటది మనం భయపడితే భయపడుతూనే ఉంటది చిన్న మినుగురు పురుగు కూడా మనల్ని భయపెట్టేస్తది. కాబట్టి ఒక్కసారి ఎదురెల్లి చూస్తే ఆ భయమే మన నుంచి దూరంగా పారిపోతది మనం ఎలా ఆలోచిస్తే అలా తయారవుతాం. మనం బలహీనులం అనుకుంటే బలహీనులం అవుతాం. మనం బలవంతులం అని ఒకసారి మనసు కనుక్కొని చూడండి మీకే తెలియని శక్తి మిమ్మల్ని గట్టిగా కమ్మేస్తది. మీ మనసుని గట్టిగా కమ్మేసుకుంటది మీకు తెలియని శక్తి అంత శక్తి మనలో ఉంటది. మనం ఒకవేళ బలహీనులము అమ్మో నా వల్ల కాదు అనుకుంటే మీలో ఉన్న శక్తి అంతా కూడా నిర్వీర్యం అయిపోతుంది. ఏదైనా మన ఆలోచనల్లోనే ఉంటుంది ఇంకా కొంతమంది విధి మీదకి నెట్టేస్తుంటారు. నా కష్టాలు కన్నీరు నా విధి ఇంతే నా తలరాతి ఇంతే అని విధి అంటూ ఒకవేళ ఉంది అనుకుంటే ఆ విధి రాత అనేది అన్ని తలుపులు మూసేసినా కూడా నీ కోసం ఒక తలుపు ఎక్కడో ఒకవైపు తెరుచుకునే ఉంటుంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. కనీసం తలుపు లేకపోయినా కిటికీ అన్న ఉంటుంది మనం చేయాల్సిన పని ఏంటి అంటే దాన్ని కనిపెట్టడమే అది ఎప్పుడు వీలవుతుంది మనం మానసికంగా బలంగా ఉన్నప్పుడే మన మనసుకి మంచి ఆలోచనలు వస్తాయి సమస్య ఎదురైనప్పుడు దాని నుంచి ఎలా బయట పడాలి అనే దిశలో ఆలోచిస్తాము. ఓటమిని ఎలా ఎదుర్కోవాలనే దిశలో ఆలోచిస్తాము గెలుపుని ఎలా అందుకోవాలి అనే దిశలో ఆలోచిస్తాం. కాబట్టి మనసుని ఎప్పుడూ కూడా దృఢంగా ఉంచుకోవాలి. మనం లక్ష్యాన్ని సాధించాలి అంటే మనం నిజాయితిగా లక్ష్యం కోసం శ్రమిస్తున్నప్పుడు అలుపెరగకుండా పోరాటం చేస్తున్నప్పుడు ఈరోజు కాకపోయినా రేపైనా సరే విజయం మన దగ్గరికి వచ్చి ఖచ్చితంగా తీరుతుంది. సో ముందుగా ఇవన్నీ జరగాలంటే మనల్ని మనం నమ్మాలి మన మీద మనకు నమ్మకం ఉండాలి గమ్యం మనం వెళ్లాల్సిన గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ కూడా దాన్ని చేరుకోవడానికి మాత్రం మనం వేసే అడుగు ఉంది చూసారా అది మొదటి అడుగు అనేది ఎప్పుడూ కూడా ఒక్క అడుగు తోటే మొదలవుతుంది. ఆ అడుగు వేయగానే ఆ గమ్యంలో కొంత భాగం అనేది మన పాదాల కిందకే చేరిపోతుంది అంటే మనం అడుగు అడుగు వేసుకుంటూ పోతున్న కొద్దీ గమ్యం మన పాదక్రాంతం అవుతుంది. ఈ విషయం మీరు మర్చిపోకండి ఏ పని చేయకపోతే ఏ ఫలితం ఉండదు పని చేసి లేదా ప్రయత్నిస్తే ఏదో ఒక ఫలితం ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి నిరాశ నిస్పృహలు అనేటివి శాశ్వతం కాదు వాటిని పారద్రోవలేటువంటి మంత్రం మన మనసులోనే మన నిరంతరం స్ఫూర్తి అండ్ మోటివేషన్ అనే వాటి రూపంలో మనల్ని మనం వాటిని పెంచి పోషించాలి. ఈ విషయం మర్చిపోకండి మీ నిరాశను మీరే పారద్రోలుకోవాలి మీ చీకట్లు మీరే తరిమేయాలి. మన మనసు ఎల్లప్పుడూ కూడా ఉవ్వెత్తునటువంటి ఒక ఉజ్వలమైన అనేటువంటి ఒక జ్వాల లాగా రగులుతూ ఉండాలి. ఇది పాసిబుల్ అంటే 100% పాసిబుల్ మన ఆలోచనల్లోనే అన్ని ఉంటాయమ్మ ఇది నిజం. మనం ఎలా ఆలోచిస్తే అలా తయారవుతాం. మన ఆలోచనలే మన ఓటమి, మన ఆలోచనలే మన విజయం. కాబట్టి నిరాశకు అమ్ముకుంటున్నప్పుడు ఇమిడియట్ గా దాన్ని దులిపేసేయండి, పారగొట్టేసేయండి, లేచి నిలబడండి, మళ్ళీ ప్రయత్నించండి ప్రయత్నించండి ప్రయత్నించండి..