మీ జీవితాన్ని నాశనం చేసే చెడు అలవాట్లు – jeevithani nashanam chese alavattlu
ఇవాళ్టి టాపిక్ లో jeevithani nashanam chese alavattlu గురించి తెలుసుకుందాం.
జీవితాన్ని నాశనం చేసే అలవాటు
ఎవరైనా సరే జీవితంలో సక్సెస్ కావాలంటే కష్టపడి పని చేయాలి. కానీ కొందరు వాళ్ళు సాధించాల్సిన కలల నుంచి దూరంగా వాళ్ళని కిందకి లాగి ఒక పెద్ద సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఆ సమస్య పేరు లేజీనెస్. మామూలుగా ఏ మనుషులైనా సరే లేజీనెస్ అనేది చాలా చిన్నగా మొదలవుతుంది. ఉదయాన్నే నిద్ర లేచినప్పుడు ఇంకొక ఐదు నిమిషాలు పడుకుందాం అని చెప్పేసి అనుకుంటాము సర్లే అని చెప్పేసి ఐదు నిమిషాలు కూడా పడుకుంటాము. కాకపోతే ఆ ఐదు నిమిషాలు కాస్త 60 నిమిషాలు అవుతాయి అంటే మనం గంట పడుకుంటాము.
లేజీనెస్ అంటే ఏంటి
మనం చేసే పనిని ఆ సమయానికి చేయకుండా వాయిదా వేయడం. వాయిదా పెడుతూ పెడుతూ చివరికి ఆ పని పూర్తి చేయకుండానే ఆపేయడం అది చిన్న విషయం అనిపిస్తుందేమో కానీ అది మాత్రం జీవితాన్ని నాశనం చేసే మొట్టమొదటి అడుగు అవకాశాన్ని కోల్పోవడం. మామూలుగా లేజీనెస్ వల్ల మనం ఎన్ని అవకాశాలను కోల్పోతున్నామో మనకి తెలియదు. కొందరు జీవితంలో గొప్ప గొప్ప అవకాశాలను బద్దకం వల్లే వదిలేస్తారు. ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో అవకాశాలు రావడం చాలా చాలా అరుదు కానీ వాటిని వాడుకోకపోతే ఆ అవకాశాలు వెనక్కి తిరిగి రావు. ప్రతి రోజు మనం చేసే చిన్న చిన్న పనులు మన జీవితంలో భయంకరమైన మార్పులను తీసుకొస్తాయి. కానీ లేజీనెస్ వల్ల మనకు వచ్చిన అవకాశాలను వదిలిపెట్టడం ద్వారా మన జీవితాన్ని మెల్లగా మనం పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం.
ప్రతి మనిషికి చిన్నప్పటి నుంచి చాలా కలలు ఉంటాయి చాలా జీవిత లక్ష్యాలు ఉంటాయి. ఒకళ్ళకి డాక్టర్ అవ్వాలని ఇంకొకళ్ళకి బిజినెస్ మ్యాన్ అవ్వాలని కానీ బద్ధకం మన మనసుని శరీరాన్ని రెండిటిల్ని ఎంప్టీ చేస్తుంది. చివరికి మనం మన లక్ష్యాలని మన జీవిత లక్ష్యాలను కూడా మర్చిపోయేలా చేస్తుంది. కాబట్టి లేజీనెస్ ని మీ దరికి రాకుండా ఒకవేళ వస్తే కానీ మొదటి దశలోనే మీలో నుంచి వెళ్ళిపోయేలా చేయండి అంటే నేను ఖచ్చితంగా ఈ పని ఇప్పుడే చేయాలి, ఇప్పుడు చేయకపోతే మళ్ళీ నేను జీవితంలో చేయలేను అని చెప్పేసి మీకు మీరు నచ్చ చెప్పుకొని మీ మనసులో మీరు ఏదైతే పని చేయాలనుకుంటారో ఆ పనిని ఇమ్మీడియట్ గా చేయండి. అలా చేయటం వల్ల మీలో ఉన్న బద్ధకాన్ని బద్దలు కొట్టుకొని మీరు బయటికి రావడానికి 100 కి 100% ఛాన్స్ ఉంది. అలా కాకుండా ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు అని చెప్పేసి మీకు మీరు టైం లెక్క పెట్టుకుంటే మీరు అనుకునే ఆ జీవిత లక్ష్యాన్ని మీరు ఎన్నటికీ చేరుకోరు. కాబట్టి లేజీనెస్ ని మాక్సిమం మీలో ఉండకుండా చూసుకోండి.
లేజీనెస్ వల్ల కోల్పోయిన కాలాన్ని తిరిగి పొందడం ఎలా
ఇక ముఖ్యమైన విషయం ఇంకోటి ఏంటంటే లేజీనెస్ వల్ల కోల్పోయిన కాలాన్ని తిరిగి పొందలేము వయసునైతే అస్సలు తిరిగి పొందలేము. కాకపోతే ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే మీకు కనుక సర్టెన్ ఒక ఏజ్ దాటిన తర్వాత మీ శరీరం మీకు సహకరించదు మీరు ఏమి సాధించాలనుకున్న చివరికి సాధించకుండానే కాలం చేస్తారు. కాబట్టి లేజీనెస్ ని మీరు గనక ఎంకరేజ్ చేస్తే మీ జీవితాన్ని మీరు దగ్గరుండి నాశనం చేసుకున్నట్లే. కాబట్టి మనలో ఉన్న బద్ధకాన్ని మనం దాటుకొని రావాలంటే మనం చేయాల్సింది ఒకే ఒక్క పని ఎప్పుడు చేయాలనుకున్న పని అప్పుడు చేసేయటం అంటే అది ఉదయం పూట నిద్ర లేవటం అవ్వచ్చు సాయంత్రం పూట పడుకోవడం అవ్వచ్చు. అంతేకాకుండా నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ మనం రాత్రి పోయేంత వరకు మనం ఏవైతే పనులు చేయాలనుకుంటామో వాటన్నిటిని మనం అప్పటికప్పుడు చేయటం వల్ల మనలో ఉన్న లేజీనెస్ అనేది మెల్లమెల్లగా తగ్గిపోతుంది. అలా కాకుండా చేద్దాంలే చూద్దాంలే అనుకుంటే మాత్రం మీ జీవితమే ఒక బద్దకంగా మారిపోయి అసలు మీ జీవితానికి ఒక అర్థం లేకుండా మీ లైఫ్ అనేది మీనింగ్ లెస్ గా మిగిలిపోతుంది.
మీరు అనుకున్నది సాధించిపోవడం ఏమో కానీ మీకు సర్టెన్ ఒక వయసు వచ్చిన తర్వాత అసలు ఎందుకు పుట్టానురా బాబు అని రియలైజేషన్ అయితే మీలో మీకు మొదలు అవుతుంది. కాబట్టి అప్పుడు దాకా మనకెందుకు ఇప్పుడే మన జీవితాన్ని మనం మార్చుకుందాము మనం చేయాలనుకున్న పనిని చేద్దాము చేయొద్దు అనుకున్న పనిని అస్సలు చేయకుండా ఉందాము. ఓవరాల్ గా మన బ్రెయిన్ ని మన కంట్రోల్ లో పెట్టుకుందాము. అంతేనండి అంతకు మించి ఏం లేదు కాకపోతే మీలో గనక ఉన్న లేజీనెస్ ని మీరు ఎంకరేజ్ చేస్తే మీ జీవితాన్ని మీరు దగ్గరుండి నాశనం చేసుకున్నట్లే దయచేసి ఆ పని మాత్రం అస్సలు చేయకండి.
ఇంకా ఈ టాపిక్ గనుక మీకు నచ్చినట్లైతే కచ్చితంగా షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటికి మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి..
2 thoughts on “మీ జీవితాన్ని నాశనం చేసే చెడు అలవాట్లు | jeevithani nashanam chese alavattlu”