ఇలా చేస్తే తప్పకుండా సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది – How Complete Health Possible
ఇవాళ్టి టాపిక్ లో ఇలా చేస్తే తప్పకుండా సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది – How Complete Health Possible గురించి తెలుసుకుందాం
ఈ ప్రపంచంలో మనకి ఎంతో విలువైనది డబ్బుతో కొనలేనిది ఏదైనా ఉంది అంటే అది కేవలం ఆరోగ్యం మాత్రమే. మన జీవితంలో మనం ఏదైనా సాధించాలంటే ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి. అందుకనే ఆరోగ్యమే మహా భాగ్యం అని చెప్పి అంటారు. కాకపోతే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆరోగ్యంగా ఉండటం అంటే సన్నగా ఉండటం అంతే కాకుండా ఎటువంటి రోగాలు లేకుండా ఉండటం కాదు మన మనసు కూడా చాలా ఆరోగ్యంగా ఉండాలి. కానీ చాలాసార్లు ఈ విషయాన్ని అందరూ నిర్లక్ష్యం చేస్తారు. అసలు ఒక మనిషి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఎలా పొందుతాడు అనేది ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాము.
ఇంకా డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్తే ఫస్ట్ ఫిజికల్ హెల్త్ గురించి మాట్లాడుకుంటే. ఏ మనిషికైనా సరే ఒక మంచి ఆహారం కావాలి క్రమం తప్పకుండా ఆ శరీరానికి ఒక చిన్నపాటి వ్యాయామం ఉండాలి. అంతే కాకుండా ప్రాపర్ గా నిద్ర అనేది అవసరం ఇవన్నీ ప్రాపర్ గా కరెక్ట్ గా జరిగినాయి అనుకోండి. అతను శారీరక ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. అలా కాకుండా నేను జంక్ ఫుడ్స్ తింటూ ఉంటాను వ్యాయామం కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను నిద్ర కూడా సరిగ్గా పోను ఎక్కువగా సాయంత్రం పూట సినిమాలు చూస్తానంటే మాత్రం మీ శారీరక ఆరోగ్యం ఎవ్వడు బాగు చేయలేడు. ఎందుకంటే మనం ఏ పని చేయాలన్నా సరే మన శారీరక ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. శారీరక బలం అనేది మనకు ఉంటే మనం ఎటువంటి పనినైనా సరే ధైర్యంగా చేయగలుగుతాము. అంతేకాకుండా రెట్టింపు ఉత్సాహంతో పని చేయగలుగుతాము. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే మెంటల్ హెల్త్ అనేది కూడా చాలా అవసరం. అసలు మానసిక ఆరోగ్యం అనేది ఒక మనిషికి ఎక్కడి నుంచి వస్తుందంటే అవుట్ సైడ్ నాయిస్ ని మనం ఎప్పుడైతే ఇగ్నోర్ చేస్తామో ఆ మనిషి మానసికంగా చాలా హ్యాపీగా ఉంటాడు. అవుట్ సైడ్ నాయిస్ అంటే ఈ సోషల్ మీడియాలో మనం చూస్తున్న రోజు ఈ కంటెంట్ ఏదైతే ఉంటుందో అది కూడా నెగిటివిటీని ఎక్కువగా స్ప్రెడ్ చేసే ఈ కంటెంట్ ఏదైతే ఉంటుందో అది చూడటం వల్ల కూడా మన మెంటల్ హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రశాంతంగా ధ్యానం చేసుకొని మనకి నచ్చిన పని చేసుకుంటూ ప్రశాంతంగా మన బ్రెయిన్ కి స్ట్రెస్ లేకుండా చూసుకోగలిగితే మీ మెంటల్ హెల్త్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అలా కాకుండా ఉదయాన నిద్ర లేచిన తర్వాత నేను న్యూస్ చూస్తాను ఎక్కడ లేని ప్రపంచంలో విషయాలన్నీ తెలుసుకుంటాను తెలుసుకొని నా బ్రెయిన్ కి నేను స్ట్రెస్ ని ఇస్తానంటే మాత్రం మిమ్మల్ని ఎవ్వడు ఆపలేడు. ఎందుకంటే మనం ఒక విషయాన్ని తెలుసుకొని ఆ విషయాన్ని మన జీవితానికి ఉపయోగించుకోవడం వేరు మనం ఒక విషయాన్ని తెలుసుకొని దాని గురించి ఎక్కువగా వర్రీ అవుతూ ఉంటాం. నిజం చెప్పాలంటే మీరు వర్రీ అయ్యే విషయం అసలు మీకు సంబంధించిందా మీకు సంబంధం లేనిదా అనే క్లారిటీ కూడా మీకు ఉండాలి. కాబట్టి నేను ఏమంటానంటే మాక్సిమం సోషల్ మీడియాలో ఎక్కువగా నెగిటివ్ కంటెంట్ ని గనక మీరు చూస్తున్నట్లయితే మీరు ఉన్నఫలంగా అలాంటివి చూడమాకండి. ఎందుకంటే మీ మానసిక ఆరోగ్యం మీద కూడా వాటి ప్రభావం ఉంటుంది. అందుకనే ప్రశాంతంగా ధ్యానం చేసుకోండి, స్ట్రెస్ ని తగ్గించుకోండి. మీకు ఆనందాన్ని కలిగించే పనులు చేస్తే మీరు మానసికంగా చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే ఒక కష్టం మనకు వచ్చింది మన కష్టానికి మనం స్ట్రెస్ తీసుకుంటే ఒక అర్థం ఉంటుంది పక్కనోడి కష్టానికి కూడా మనమే స్ట్రెస్ తీసుకొని వాడి తరపున సోషల్ మీడియాలో మనం పోరాడితే మనకు వచ్చేది ఏముంటుంది చెప్పండి. కాబట్టి నేను ఏమంటానంటే ముందు మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. ధ్యానం చేయండి మంచి మంచి విషయాల గురించి డిస్కస్ చేయండి. మంచి మంచి వాటిని సోషల్ మీడియాలో చూడండి. మీ జీవితానికి ఉపయోగపడే వాటిని చూడండి. అలా చూడటం వల్ల కూడా మీకు మానసిక ఆరోగ్యం అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాకుండా శారీరక ఆరోగ్యం అలాగే మానసిక ఆరోగ్యం ఈ రెండు ఇంప్రూవ్ అవ్వాలంటే మీరు మీ లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకోవాలి. లైఫ్ స్టైల్ అంటే ఎక్కువగా మీరు కంప్యూటర్ ముందు కూర్చొని చేసే ఉద్యోగం అనుకోండి కొంచెం కంప్యూటర్ ముందు కూర్చోకుండా అప్పుడప్పుడు నుంచొని కూడా ఉద్యోగం చేయండి. అంతే కాకుండా చిన్న చిన్న షాప్స్ కి వెళ్ళాలి లేకపోతే సూపర్ మార్కెట్ కి వెళ్ళాలంటే నడిచి వెళ్ళడానికి కొంచెం ప్రిఫర్ చేయండి. ఇంకా మరీ ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీ పర్యావరణాన్ని కొంచెం మొక్కలతో నింపండి. మీ చుట్టూ కొంచెం మొక్కలు పెట్టుకున్నారు అనుకోండి వాటికి రోజు ఒక చెంబు నీళ్లు పోస్తే చాలు అంతకు మించి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇలాంటి లైఫ్ స్టైల్ ని మీరు గనక అలవాటు చేసుకుంటే కచ్చితంగా మీ మానసిక ఆరోగ్యం ఆ తర్వాత శారీరక ఆరోగ్యం ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్సులు ఉంటాయి. అలా కాకుండా అరకిలో దూరానికి కూడా నేను బైక్ వేసుకొని వెళ్తాను. సూపర్ మార్కెట్ కి అసలు వెళ్ళను నేను బుక్ చేసుకుంటే ఇంటికి వస్తాయి అని చెప్పేసి మీ ఆరోగ్యాన్ని మీరు పాడు చేసుకుంటారంటే మాత్రం మిమ్మల్ని ఎవడు బాగు చేయలేడు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చు ఏంటంటే ఆరోగ్యమే మహా భాగ్యం. శారీరకంగా అవ్వచ్చు, మానసికంగా అవ్వచ్చు, అంతేకాకుండా ఆధ్యాత్మికంగా కూడా మనం మనల్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. చాలా మందికి ఏంటంటే దైవ భక్తి ఉంటుంది. కానీ అందులో డీప్ గా డైవ్ చేసేంత భక్తి అయితే ఉండదో ఏదో కోరికలు కోరుకోవడానికి కనిపించినప్పుడు దండం పెట్టుకోవడానికి అలా కాకుండా మనం కూడా డివోషనల్ గా ఆధ్యాత్మికంగా కొంచెం మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటే ఈ జీవితం అనేది మనకి చాలా అందంగా కనిపిస్తుంది. ఇప్పటి నుంచి ఈ మార్గాల్లో ప్రయాణం మొదలు పెట్టండి మీరు ఆరోగ్యంగా ఉంటే ఏ లక్ష్యాన్ని అయినా సరే సులభంగా చేరుకుంటారు. ఇలాంటి జీవన విధానాన్ని గనక మీరు అలవాటు చేసుకుంటే మీరు ఎప్పుడూ సుఖంగా ఉంటారు.