Steriods : స్టెరాయిడ్స్ వల్ల ఇంత ప్రమాదకరమా
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Steriods : స్టెరాయిడ్స్ వల్ల ఇంత ప్రమాదకరమా గురుంచి తెలుసుకుందాం రండి. వ్యాయామాలు ఎక్కువగా చేసేవారు, బాడీ బిల్డర్స్ త్వరగా రిజల్ట్ రావాలని స్టెరాయిడ్స్ తీసుకుంటూ ఉంటారు. కొంత మందికి ఇవి తీసుకోవడం వలన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనే భయం ఉంటుంది, మరి కొంత మంది ధైర్యంగా వాడుతూ ఉంటారు. కాబట్టి ఇవి వాడవచ్చో లేదో తెలుసుకుందాం.
స్టెరాయిడ్స్ ఎంత వరకు ప్రమాదం?
- బాడీ మంచి షేప్ లోకి రావాలంటే నేచురల్ డైట్ తీసుకోవడం మంచిది.
- ప్రోటీన్ ఎక్కువగా దొరికే మాంసాహారం, శాకాహారం తీసుకోవడం వలన కూడా మజిల్ పెరుగుతుంది.
- మీల్ మేకర్, కందిపప్పు తినడం వలన 40% ప్రోటీన్ వస్తుంది.
- చికెన్లో కూడా హై ప్రోటీన్ దొరుకుతుంది.
- తప్పక అవసరం అయినప్పుడు మాత్రమే WHEY PROTEIN తీసుకోవడం మంచిది.
చాలా మంది కండలు పెరగాలని Anabolic Steroids తీసుకుంటున్నారు. వీటి వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తేలియకపోవడంతో ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. కాబట్టి ప్రోటీన్ ఎక్కువగా దొరికే ఆహారాలు తీసుకోవడమే మంచి మార్గం.
స్టెరాయిడ్స్ వలన లాభమా నష్టమా
చాలా మందికి స్టెరాయిడ్స్ మీద అనేక సందేహాలు వస్తాయి. వీటిని అసలు వాడవచ్చా, వాడితే ఎలాంటి వాటికి మాత్రమే
వాడాలి, వీటి వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని సందేహాలు ఎక్కువగా వస్తాయి. అయితే వైద్యులు మాత్రం ఇవి ఒక అద్భుతమైన మెడిసిన్ అలానే డేంజర్ అని కూడా చెబుతున్నారు, అది ఎలానో తెలుసుకుందాం.
స్టెరాయిడ్స్ గురించి మనకి తెలియని విషయాలు
- మన శరీరంలో నేచురల్ గా ఉత్పత్తి అయ్యే స్టెరాయిడ్ని Cortisol అని పిలుస్తారు.
- స్టెరాయిడ్స్ ముఖ్యంగా Glucocorticoids (Cortisol), Mineralocorticoids అని రెండు రకాలుగా ఉంటాయి.
- Mineralocorticoids మన శరీరంలో ఉన్న సోడియంపొటాషియంని కంట్రోల్ చేస్తాయి.
- Glucocorticoids మన బాడీ స్ట్రెస్ని తట్టుకునేటట్టు చేస్తుంది అదే సమయంలో ఇమ్యూనిటీ తగ్గేటట్టు చేస్తుంది.
స్టెరాయిడ్ హార్మోన్ పెరిగితే కలిగే నష్టాలు
- ఈ హార్మోన్స్ శరీరంలో పెరిగినప్పుడు ఇమ్యూనిటీ తగ్గిపోతుంది.
- జలుబు, దగ్గు, జ్వరాలకి దారి తీస్తుంది.
- కొంతమందిలో TB సమస్య కూడా వస్తుంది.
స్టెరాయిడ్ హార్మోన్ వలన లాభాలు
- ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ లాంటివి వచ్చినప్పుడు ఇవి అద్భుతంగా పనిచేస్తాయి.
- కీళ్ల నొప్పులు తగ్గడానికి పనిచేస్తాయి.
- రుమాటైడ్ ఆర్థరైటిస్ ఉన్నవారికి ఇవి వరం లాంటిది.
స్టెరాయిడ్స్ వలన లాభాలు, నష్టాలు రెండు ఉన్నాయి కాబట్టి వీటిని జాగ్రత్తగా వాడటం మంచిది. వీలైనంత వరకు స్ట్రెస్ ని తగ్గించుకోవడం వలన జబ్బులకి దూరంగా ఆరోగ్యానికి దగ్గరగా ఉండవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.