Mushroom Masala Curry – మష్రూమ్స్ లేదా పుట్టగొడుగులు తినొచ్చా
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Mushroom Masala Curry – మష్రూమ్స్ లేదా పుట్టగొడుగులు తినొచ్చా గురుంచి తెలుసుకుందాం రండి. ఎవరైనా ఇష్టంగా తినగలిగే వాటిల్లో పుట్టగొడుగులు కూడా ఒకటిగా చెప్పవచ్చు. వీటిల్లో విటమిన్- డి పుష్కలంగా దొరకడంతో పాటు ఇవి తినడం వలన ఎముక పుష్టి పెరుగుతుంది. కాబట్టి వీటితో మసాలా కర్రీ ఎలా చేయవచ్చో తెలుసుకుందాం.
Mushroom Masala Curry తయారీకి కావలసిన పదార్ధాలు
- పుట్టగొడుగులు – 250 గ్రా
- ఉల్లిపాయ ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్
- సన్ ఫ్లవర్ సీడ్స్ – 2 టేబుల్ స్పూన్స్
- రెడ్ క్యాప్సికమ్ ముక్కలు – 2 టేబుల్ స్పూన్
- ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు – 2 టేబుల్ స్పూన్
- గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు – 1 టేబుల్ స్పూన్
- అల్లం చిన్న ముక్కలు – 1 టేబుల్ స్పూన్
- ఎండుమిర్చి – 2
- ధనియాల – 1 టేబుల్ స్పూన్
- జీల కర్ర – 1 టీ స్పూన్
- కరివేపాకు – కొద్దిగా
- మిరియాల పొడి – 1 టేబుల్ స్పూన్
- మీగడ – 1 టేబుల్ స్పూన్
- కొత్తిమీర – కొద్దిగా
- లెమన్ జ్యూస్ – 1 టేబుల్ స్పూన్
మష్రూమ్స్ మసాలా కర్రీ తయారీ విధానం
- ముందుగా మష్రూమ్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
- ఒక నాన్ స్టిక్ పాత్ర తీసుకొని అందులో కొద్దిగా మీగడ, సన్ ఫ్లవర్ గింజలు, మిరియాలపొడి, ఎండుమిర్చి, ధనియాలు వేయాలి.
- తర్వాత ఆవాలు, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు మీగడలో వేసి తాలింపు వేగనివ్వాలి.
- మసాలా వేయించిన తర్వాత మష్రూమ్స్ ముక్కలను వేయాలి.
- కరివేపాకు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు వేయాలి.
- వీటిలో ఉన్న నీటితోనే మష్రూమ్ ముక్కలు బాగా ఉడుకుతాయి.
- దీనిలో నిమ్మరసం, కొద్దిగా నీరు పోసి ఉడికించి కొత్తిమీర వేయాలి.
- బాగా డ్రై అయ్యే వరకు ఉడకనివ్వాలి.
మష్రూమ్స్ అంటే ఇష్టం ఉన్నవారికి ఈ రెసిపీ ఖచ్చితంగా నచ్చుతుంది. దీనిని చపాతీ, పుల్కాలోకే కాకుండా ఉట్టిగా కూడా తినేయొచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.