Hair Growth Tips in Telugu – జుట్టు రాలే సమస్య ఇబ్బంది పెడుతుందా
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Hair Growth Tips in Telugu – జుట్టు రాలే సమస్య ఇబ్బంది పెడుతుందా గురుంచి తెలుసుకుందాం రండి. చాలామందిలో జుట్టు పలుచగా అవ్వడం ఊడటం మనం చూస్తూ ఉంటాం. ఈ సమస్య ఉన్నవారు ఎన్నో కెమికల్ హెయిర్ ఆయిల్స్ వాడుతూ ఉంటారు. అలా వాడటం వలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి జుట్టు పెరుగుదలకి ప్రకృతి సిద్ధమైన ఈ ఉల్లిగడ్డ చిట్కా చూడండి.
How to Grow Thick Hair – జుట్టు ఒత్తుగా పెరగాలంటే
- చిన్న గిన్నెలో ఉల్లి రసం తీసుకొని కొద్దిగా కొబ్బరి నూనె కలపాలి.
- ఈ రెండింటికి విటమిన్ – E క్యాప్సిల్ కలపాలి.
- ఇలా తయరు చేసుకున్న నూనె జుట్టు కుదుళ్లకు అందే విధంగా మర్దన చేసుకోవాలి.
- ఇలా మొత్తం జుట్టుకి పట్టించాలి.
- ఒక అరగంట తర్వాత తల స్నానం చేస్తే సరిపోతుంది.
- ఒక వారం పది రోజులు ఇలా చేయడం మంచిది.
- పలచ బడిన జుట్టు ఒత్తుగా తయారవుతుంది.
- జుట్టు నిగనిగలాడుతూ పొడవుగా పెరుగుతుంది
- జుట్టు కుదుళ్ళు బలపడతాయి.
జుట్టు అందంగా ఆరోగ్యంగా ఉండాలనుకునేవారు ఈ నూనె వాడటం మంచిది. దీనిని వాడటం వలన జుట్టు రాలడం తగ్గడమే కాకుండా ఒత్తుగా, బలంగా పెరుగుతుంది.
జుట్టు రాలడం తగ్గి బలంగా అవ్వటానికి చిట్కా
ఈ మధ్య కాలంలో చాలా మందికి చిన్నతనంలోనే జుట్టు పలుచగా అవ్వడం, జుట్టు రాలిపోవడం వలన బట్టతల లాంటి సమస్యలు వస్తున్నాయి. అలాంటి వారు ఈ సమస్య నుండి సులువగా తప్పించుకొని జుట్టుని ఆరోగ్యంగా ఎలా
చేసుకోవచ్చో తెలుసుకుందాం.
జుట్టు రాలడానికి కారణాలు, పరిష్కారాలు
- జుట్టు రాలడంలో టెంపరరీ హెయిర్ లాస్, పర్మినెంట్ హెయిర్ లాస్ అని రెండు ఉంటాయి.
- శరీరంలో విటమిన్ లోపం, పోషకాహార లోపం వలన టెంపరరీ హెయిర్ లాస్ సమస్య వస్తుంది.
- ఐరన్ లోపం ఉన్నవారికి జుట్టు ఎక్కువగా రాలుతుంది కాబట్టి ఐరన్ ఎక్కువగా దొరికే ఆహారాలు లేదా టాబ్లెట్స్ తీసుకోవడం మంచిది.
- బయోటిన్ విటమిన్ లోపం వలన హెయిర్ లాస్ జరుగుతుంది కాబట్టి రోజుకి ఒక టాబ్లెట్ చొప్పున రెండు నెలల వరకు బయోటిన్ టాబ్లెట్ వాడటం మంచిది.
- క్యాన్సర్ పేషెంట్స్కి కీమోథెరపీ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు హార్మోనల్ ఇంజక్షన్ ఇచ్చినప్పుడు జుట్టు పూర్తిగా రాలిపోతుంది.
- కీమోథెరపీ అయిపోయినప్పుడు వెంటనే జుట్టు తిరిగి వస్తుంది.
- ఉపవాసాలు ఎక్కువగా చేసి బరువు తగ్గేవారికి కూడా జుట్టు త్వరగా రాలిపోతుంది.
శాకాహారంలో మంచి పోషకాలు ఉంటాయి కాబట్టి వీలైనంత ఎక్కువగా న్యాచురల్ ఫుడ్ తీసుకోవడానికి ప్రయత్నించాలి. అదేవిధంగా విటమిన్స్ లోపం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు రాలడం తగ్గి బలంగా అవుతుంది. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.