మార్వాడీల బిజినెస్ విజయ రహస్యాలు ( Marwadi Business Secrets )
మీరు ఇండియాలో ఒక చిన్న ఊరి నుంచి పెద్ద నగరం వరకు చూస్తే పర్టికులర్ గా ఒక సామాజిక వర్గం మాత్రం ఈ బిజినెస్ మార్కెట్లో ఖచ్చితంగా వాళ్ళ పవర్ చూపిస్తుంది. బిజినెస్ ఏదైనా కానివ్వండి వీళ్ళకి అది వెన్నతో పెట్టిన విద్య. ఇంతకీ నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అని అనుకుంటున్నారా మరి ఎవరో కాదు మార్వాడీస్. మార్కెట్ లో మనం ఏ వ్యాపారం చూసినా అక్కడ మార్వాడీస్ డామినేషన్ ఎక్కువగా కనిపిస్తాది. మీరు చూసినట్లయితే ఇండియాలో ఉన్న బిలీనియర్స్ లో 42% అంటే 42 మంది మార్వాడీస్ ఏ ఉన్నారు అంటే మీరు నమ్ముతారు. మార్వాడీస్ ఎంత తెలివైన వాళ్ళు అంటే ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను.
వాళ్ళ షాప్ లో పని చేసే వాళ్ళని ఎంచుకోవడంలో మీకు అర్థమవుతుంది ఎలా అంటే వాళ్ళు ఎంచుకునే వాళ్ళు మంచి నైపుణ్యం మరియు అనుభవం ఉన్న పర్సన్స్ ని తీసుకుంటారు. అలా వాళ్ళ బిజినెస్ లో ప్రాఫిట్స్ ని పెంచుకుంటారు. ఎంత సంపాదించిన చాలా మంది మార్వాడీలు సొంత ఇల్లు కట్టుకోవడానికన్నా అద్దే ఇంట్లో ఉండడానికే ఎక్కువగా ఇష్టపడతారు. అందుకనే వీళ్ళని పిసినగొట్టోళ్ళు అని అంటారు. వీళ్ళు డబ్బుని ఖర్చు చేసే విధానాన్ని చూసి పిసినగొట్టోళ్ళు అని అంటారు కానీ నిజానికి సేవా కార్యక్రమాలకు కు విరాళాలు ఇచ్చేది ఎక్కువగా మార్వాడీలే. కావున మనం ఈ టాపిక్ లో మార్వాడీస్ బిజినెస్ సీక్రెట్స్ ( Marwadi Business Secrets) గురించి తెలుసుకుందాం.
1.మార్వాడిస్ బిజినెస్ సీక్రెట్స్
మీరు చూసుకుంటే పెద్ద పెద్ద కంపెనీలైన డిమార్ట్, మింత్ర, లెన్స్ కార్ట్, హల్దీ రమ్స్, నిర్మా ఇలా ఈ బిజినెస్ లన్నీ మార్వాడీస్ వే. బిజినెస్ లో ఎవరికీ రాని సక్సెస్ మార్వాడీస్ కి మాత్రమే ఎందుకు వస్తుంది అని తెలుసుకోవాలి. మనం బయట రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ మన రాష్ట్రాల్లో కూడా వాళ్ళ బిజినెస్ సూపర్ గా చేస్తున్నారు. కావున మనం ఎందుకు చేయలేకపోతున్నాం అందుకే మనం ఈ ఆర్టికల్లో వాళ్ళ బిజినెస్ సీక్రెట్స్ ఏంటో తెలుసుకొని మన బిజినెస్ కి అప్లై చేసుకుందాం. కావున ఈ ఆర్టికల్ కేవలం మార్వాడీస్ గురించి మాత్రమే కాదు ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో డబ్బు సంపాదించాలనుకుంటున్నారో అలాంటి వారికి ఈ టాపిక్ చాలా యూస్ ఫుల్ అవుతాది.
2.మార్వాడిస్ ఆరిజిన్ ( మార్వాడి మూలం)
ముందుగా మనం మార్వాడిస్ ఆరిజిన్ ( మార్వాడి మూలం) గురించి తెలుసుకుందాం. మార్వాడిస్ రాజస్థాన్ లోని మార్వల్ అనే ప్లేస్ నుంచి వచ్చారు మార్వెల్ అనే ప్లేస్ నుంచి రావడం వలన వీళ్ళని మార్వాడిస్ అంటున్నారు. వీళ్ళు దేశంలోని కొన్ని ప్రాంతాలకి వెళ్లి అక్కడ బిజినెస్ లని చేస్తూ అక్కడే సెటిల్ అయిపోతారు. ఇలా ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ కి వలస వెళ్ళే వాళ్ళని మార్వాడిస్ అంటారు. మార్వాడిస్ వాళ్ళు పెద్దగా చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టరు అంటే ఎక్కువ శాతం వాళ్ళు బిజినెస్ లనే వంశ పారంపర్యంగా చూసుకుంటారు. చిన్నప్పటి నుంచి మార్వాడీస్ వాళ్ళ పిల్లలకి వ్యాపార మెలుకువలు నేర్పిస్తారు. అందుకనే వాళ్ళ బిజినెస్ ని వాళ్లే మెయింటెన్ చేసుకుంటారు. కావున దీనివల్ల వాళ్ళకి లేబర్ ఖర్చు ఉండదు దగ్గరగా ఉండి అన్ని చూసుకోవచ్చు అంటే క్లోజ్ మానిటరీ చేసుకోవచ్చు. కాబట్టి మార్వాడీస్ సక్సెస్ కి కారణం వాళ్ళు బిజినెస్ ని నడిపే విధానం మాత్రమే కాదు లైఫ్ లో వాళ్ళు నడుచుకునే విధానం కూడా. మార్వాడీస్ ఎక్కువగా సింపుల్ లైఫ్ ని లీడ్ చేయడానికి ఇష్టపడతారు. వాళ్ళు పెట్టే ఖర్చుని కూడా ఇన్వెస్ట్మెంట్ లానే అనుకుంటారు. మార్వాడీస్ ఎప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీదనే ఫోకస్ చేస్తారు. అంటే మీకు చెప్పాను కదా వాళ్ళు ఎక్కువగా అద్దె ఇంట్లో ఉండడానికి ఇష్టపడతారని అదే దీనికి కారణం వాళ్ళు ఎలా అనుకుంటారంటే ఆ ఇంటికి కట్టే డబ్బుని బిజినెస్ లో పెట్టుకుంటే లాభం వస్తాది కదా అనే ఆలోచనలో ఉంటారు. మార్వాడిస్ ప్రతి రూపాయి ఆలోచించి ఖర్చు పెడతారు. బార్గేనింగ్ చేయడంలో వీళ్ళని మించే వాళ్ళు ఎవరూ ఉండరంటే నమ్మశక్యం కాదు అంటే అంత బాగా బార్గెనింగ్ చేస్తారు. ఒక్క రూపాయి కూడా వేస్ట్ కానివ్వరు ప్రతి రోజు ఎంత ఆలస్యమైనా అకౌంట్స్ చెక్ చేసుకుంటారు. టాక్స్ కట్టడానికి ఇష్టపడరు చాలావరకు వీళ్ళ ట్రాన్సాక్షన్స్ అన్ని నగదు రూపంలోనే ఉంటాయి. ఈవెన్ వీళ్ళు వాళ్ళ షాప్ పని చేసే వాళ్ళకి కూడా నగదు రూపంలోనే చెల్లిస్తారు. మార్వాడీస్ డబ్బుని నిల్వ ఉంచుకోరు ఎప్పుడు బ్యాంకులో కూడా దాచుకోరు చాలా వరకు డబ్బు అంతా బిజినెస్ లోనే పెట్టేస్తారు. మార్వాడీస్ డబ్బు విషయంలో ఇంత ఖచ్చితంగా ఉన్నప్పటికీ వాళ్ళ దగ్గర వాళ్లకు లేదా వాళ్ళ దగ్గర పని చేసే వాళ్ళకి డబ్బు అవసరం పడితే ఎంత సహాయమైనా చేయడంలో వెనకాడరు.
3.మార్వాడిస్ స్ట్రాటజీస్ & సీక్రెట్స్ ( Marwadi Business Secrets )
మార్వాడీస్ బిజినెస్ సక్సెస్ అవ్వడానికి వాళ్ళ స్ట్రాటజీస్ అండ్ సీక్రెట్స్ ఏంటో చూద్దాం. ఏ బిజినెస్ లో అయినా సక్సెస్ అవ్వాలంటే రిస్క్ కంపల్సరీ చేయాలి. రిస్క్ తీసుకునే ఆటిట్యూడ్ వర్క్ లో ఫ్లెక్సిబిలిటీ ఎలాంటి పరిస్థితికైనా అడాప్ట్ అవ్వడం వాళ్ళ సీక్రెట్స్, రిస్క్ తీసుకోవడంతో పాటు మనీ మేనేజ్మెంట్ కూడా వీళ్ళ సక్సెస్ కి ఒక కారణం. మనీ మేనేజ్మెంట్ లో మార్వాడిస్ ఖచ్చితంగా రెండు విషయాలు గుర్తుపెట్టుకుంటారు. అదేంటంటే మొదటిది డబ్బు సంపాదించడం, రెండోది డబ్బు ఇన్వెస్ట్ చేయడం. అంటే వీళ్ళ దగ్గర పది రూపాయలు ఉన్నాయంటే అవి బిజినెస్ లో పెట్టి పదింతలు చేయాలనే ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు ఈ మార్వాడీస్. మార్వాడీస్ ఇంకో సీక్రెట్ ఏంటంటే తక్కువ మార్జిన్ తో ఎక్కువ కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడం ఫర్ ఎగ్జాంపుల్ ఒక మార్వాడి బట్టలు అమ్ముతున్నాడు అనుకోండి అతను ప్రతి యూనిట్ పైన చాలా తక్కువ లాభం మాత్రమే పొందుతాడు. కానీ అతను బాగా తక్కువ ధరలో అమ్మడం వల్ల ఎక్కువ మంది కస్టమర్లు అట్రాక్ట్ అవుతారు. ఎక్కువ సేల్స్ జరిగి మొత్తంగా ఎక్కువ లాభం వస్తాది ఈ విధానం వ్యాపార స్థిరత్వం మరియు గ్రోత్ ని పెంచుతాది. మార్వాడీస్ వాళ్ళ బిజినెస్ ని స్ట్రాంగ్ గా ఉంచికోవడానికి వాళ్ళు చేసే వెరైటీ టాకీస్ ఏంటంటే షేరింగ్ ఇప్పుడు ఒక మార్వాడి తన బిజినెస్ లో సక్సెస్ అయితే అతను తన కమ్యూనిటీలో వేరే మార్వాడి బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తాడు. మార్వాడీస్ లో ఫ్యామిలీ బాండింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాది. ఎందుకంటే వీళ్ళ బిజినెస్ లో ఫ్యామిలీ మెంబర్స్ ఏ పార్ట్నర్స్ గా ఉంటారు. ఒకవేళ షాప్ లో పని చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా కుటుంబంలా భావిస్తారు. ఎందుకంటే ఇది బిజినెస్ లో ఒక బలమైన సాంఘిక బంధంలా ఫామ్ అవుతాది ఫలితంగా ఉద్యోగులు వారి పని పట్ల ఎక్కువ నిబద్ధత ఉండి ఆత్మీయత చూపుతారు. దీనివల్ల బిజినెస్ మొత్తంగా బలపడుతుంది. కాబట్టి మార్వాడిస్ ఈరోజు ఇండియాలో బిజినెస్ మార్కెట్ లో సక్సెస్ఫుల్ కమ్యూనిటీస్ గా నిలిచారు. మీరు కూడా వాళ్ళ సీక్రెట్స్ అండ్ స్ట్రాటజీస్ ఫాలో అయితే మీ బిజినెస్ ని సక్సెస్ చేసుకోవచ్చు. కాబట్టి మరి వాళ్ళు అంత కాకపోయినా ఏదో కొన్ని స్ట్రాటజీస్ ఫాలో అవుదాం మరి. ఈ టాపిక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాం. ఒకవేళ ఈ టాపిక్ మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. మళ్ళీ తిరిగి నెక్స్ట్ టాపిక్ లో కలుద్దాం.
1 thought on “మార్వాడీల బిజినెస్ విజయ రహస్యాలు | Marwadi Business Secrets”