జీవితాన్ని మార్చే రహస్యం ఇదే – Life Changing Hacks Telugu
ఇవాళ్టి టాపిక్ లో Life Changing Hacks Telugu గురించి తెలుసుకుందాం.
నా జీవితాన్ని మార్చిన మూడు అలవాట్లు
మామూలుగా ఏ మనిషి జీవితంలో అయినా సరే భయంకరంగా మార్పులు రావాలంటే భయంకరమైన నిర్ణయాలు తీసుకోవాలి భయంకరంగా కష్టపడాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మూడు అతి సాధారణమైన అలవాట్లని మీరు గనక అలవాటు చేసుకుంటే మీరు వద్దన్నా సరే మీ జీవితంలో మార్పు వస్తుంది.
MORNING ROUTINE
ఇంకా డైరెక్ట్ గా పాయింట్ కి వస్తే మీ జీవితంలో పెను మార్పులు తీసుకొచ్చే ఒక భయంకరమైన అలవాటు ఏంటంటే మార్నింగ్ రొటీన్ ప్రాపర్ గా అందరూ దీన్ని డిజైన్ చేసుకోరు. ఎప్పుడు పడుకుంటామో తెలియదు ఎప్పుడు లెగుస్తామో తెలియదు ఒకవేళ లెగిసిన తర్వాత ఏం చేస్తామో కూడా తెలియదు. కాబట్టి ఈ మార్నింగ్ రొటీన్ ని ప్రాపర్ గా ప్లాన్ చేసుకోగలిగితే మనం సాయంత్రం ఎన్నింటికి పడుకోవాలో అర్థమైపోతుంది ఉదయాన్నే ఎన్ని గంటలకు నిద్ర లెగవాలో కూడా అర్థమైపోతుంది. అలా లెగిసిన తర్వాత మనం మెడిటేషన్ చేసుకోవాలా లేకపోతే ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయాలా అది కూడా కాకపోతే ఒక చిన్నపాటి వాకింగ్ చేయాలని చెప్పేసి మీరు గనక మీ మార్నింగ్ రొటీన్ లో యాడ్ చేసుకుంటే మీరు మీ జీవితంలో భయంకరమైన మార్పు చూస్తారు. అంతేకాకుండా మీ శారీరక ఫిట్నెస్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ప్రాపర్ గా మార్నింగ్ రొటీన్ ని ప్రిపేర్ చేసుకోండి అది పెద్ద కష్టమైన పని ఏం కాదు దానికి మనం ఎవరిని సంప్రదించాల్సిన అవసరం లేదు మనకి మనం ఒక టైం టేబుల్ వేసుకోవడం లాంటిది.
HEALTHY EATING
ఇంక మీ జీవితాన్ని మర్చి రెండు హ్యాబిట్ ఏంటంటే హెల్తీ ఈటింగ్ మనం నోటికి ఏది నచ్చితే అది తినేస్తూ ఉంటాము ఎప్పుడు పడితే అది తినేస్తూ ఉంటాం. కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే మనకి జ్వరం వచ్చిందనుకోండి మనం ఏం చేస్తాం జంక్ ఫుడ్స్ అన్ని పక్కన పెట్టేసి చక్కగా శరీరానికి ఎనర్జీ ఇచ్చే ఫుడ్ మాత్రమే తీసుకుంటాం. కాబట్టి నేనేమంటానంటే అదేదో మిగతా టైం లో కూడా అదే తింటే పోతుంది కదా కేవలం జంక్ ఫుడ్ ని ఒక 10% 15% తీసుకొని 85% ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి ఎవరి ఆరోగ్యం బాగుంటుంది మన ఆరోగ్యం కదా బాగుండేది. అందులోనూ మన ఆరోగ్యానికి మంచి చేసే ఫుడ్ పెద్ద కాస్ట్లీ ఏం కాదు అలాంటిది ఏమి లేదండి నా దగ్గర డబ్బులు ఉన్నాయి అంటే మీరు కాస్ట్లీ ఫుడ్ కొనుక్కోండి తప్పేం లేదు. కానీ తక్కువ ఖర్చుతో ఆరోగ్యంగా ఉంచే కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి, వాటిని మీరు google లో సెర్చ్ చేసి మరి తినొచ్చు. అందరూ ఈ విషయం తెలుసు కాకపోతే సచ్ చేయలేరు అంతే. కాబట్టి నేను ఏమంటానంటే ఆరోగ్యాన్ని కాపాడే ఆహారం తీసుకోండి జంక్ ఫుడ్స్ ని బాగా తగ్గించండి నేను తినొద్దు అని చెప్పట్లేదు కానీ తగ్గించండి. ఎందుకంటే ఏ అలవాటునైనా సరే మన మెదల్లో నుంచి ఒకేసారి తీసేయడం అనేది అసలు జరగని పని. కాబట్టి మెల్లమెల్లగా ప్రోటీన్ ఫుడ్ ని యాడ్ చేసుకుంటూ జంక్ ఫుడ్ ని తగ్గించుకుంటూ హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకోండి.
CONSISTENT LEARNING
ఇంకా మీ జీవితాన్ని మార్చే మూడో అలవాటు ఏంటంటే కన్సిస్టెంట్ లెర్నింగ్. మామూలుగా మనం ఏంటంటే ఒక వయసు తర్వాత మన బ్రెయిన్ అనేది నేర్చుకోవాలి కోటాన్ని ఆపేస్తుంది. ఎందుకంటే మనకు అన్నీ తెలిసిన ఫీలింగ్ వల్ల కావచ్చు లేకపోతే తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అని చెప్పేసి ఆలోచన మన మనసులోకి రావడం వల్ల వచ్చు. మనం ఏంటంటే కంటిన్యూస్ గా ఏ విషయాన్నైనా సరే నేర్చుకోవడం వల్ల మనకే ఉపయోగం జరుగుతుంది. ఎందుకంటే కళ్ళు మూసి తెరిచే లోపు ప్రపంచం అప్డేట్ అయిపోతుంది. అంతేకాకుండా మన జేబులో ఉన్న సెల్ ఫోను మనకి తెలియకుండానే అప్డేట్ అయిపోతుంది అలాంటిది మనం అప్డేట్ అవ్వడంలో తప్పేముంది. కాబట్టి పుస్తకాలు చదవడం అవ్వచ్చు లేకపోతే కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం అవ్వచ్చు, టెక్నాలజీని చాలా దగ్గరగా అబ్సర్వ్ చేయడం అవ్వచ్చు, ఇవన్నీ చేయడం వల్ల మీలో మీకు తెలియని ఒక మెచ్యూరిటీ లెవెల్ అనేది వచ్చేస్తుంది. అంతేకాకుండా మీరు ఈ ప్రపంచానికి కనెక్ట్ అయి ఉంటారు ఏది మంచి ఏది చెడు అని చెప్పేసి ఎటువంటి విషయాన్నైనా సరే అనాలసిస్ చేయగలరు. కాబట్టి కంటిన్యూస్ గా నేర్చుకుంటూ ఉండండి.
ఈ మూడు పెద్ద కష్టమైన పనులు ఏం కాదు అలా అని చెప్పేసి రేపు పొద్దున స్టార్ట్ చేస్తే మన జీవితాలు మారిపోయేది ఏం కాదు. కాబట్టి వీటిని మనం ప్రతి రోజు గనక చేయగలిగితే మన జీవితంలో భయంకరంగా మారిపోతుంది ఇది నా గ్యారెంటీ. కాబట్టి మంచిగా రొటీన్ ప్లాన్ చేసుకోండి మంచి ఆహారాన్ని తీసుకోండి రోజు ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకుంటూ ఉండండి మీ జీవితంలో వద్దన్నా సరే మార్పు వస్తుంది. మీరు హ్యాపీగా ఉంటారు.
ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.