Jeelakarra Health Benefits – జీలకర్ర నీళ్లతో అద్భుత లాభాలు అన్ని ఇన్ని కావు
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Jeelakarra Health Benefits : జీలకర్ర నీళ్లతో అద్భుత లాభాలు అన్ని ఇన్ని కావు గురుంచి తెలుసుకుందాం రండి. ఈ ఆర్టికల్ లో జీలకర్ర నీళ్లతో కలిగే లాభాలు తెలుసుకోబోతున్నం. ఒక గ్లాస్ నీళ్లలో ఒక టేబుల్ స్పూన్ జీలర్రను రాత్రి అంతా నానబెట్టి ఉదయాన్నే ఆ నీళ్ల నీ తాగితే మనకు అనేక హెల్త్ బెనిఫిట్స్ అనేవి కలుగుతాయి.
జీలకర్ర నీళ్లతో కలిగే లాభాలు ఏంటో చూద్దాం
1.జీర్ణశక్తిని పెంచుతుంది 2.వెయిట్ లాస్ 3.క్యాన్సర్ నివారణ 4.డయాబెటిస్ కంట్రోల్ 5. ఎసిడిటీ కంట్రోల్ 6. రక్తం వృద్ది
7. గుండె రక్షణ 8. మెరిసే చర్మం 9. స్త్రీల సమస్యలు 10. జుట్టు సంరక్షణ
1. జీర్ణశక్తిని పెంచుతుంది
ఈ నీళ్లు మన జీర్ణశక్తిని అమాంతం పెంచేస్తాయి. జీలకర్ర లో ఉండే తైమోల్ అనే కాంపౌండ్ మన జీర్లశయాములో గాస్ట్రిక్ గ్లాండ్స్ ను స్తిమ్యులట్ చేస్తుంది. ఈ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అనేవి మన జీర్ణక్రియకు అవసరమైన జీర్ణ రసాలను శ్రవిస్తాయి. కావున ఈ జీలకర్ర వాటర్ లో ఉండే తైమోల్ ఈ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ను స్తిమ్యులట్ చేయడం ద్వారా మన డైజేషన్ పవర్ అనేది పెరుగుతుంది.
2. వెయిట్ లాస్
జీలకర్ర వాటర్ వెయిట్ లాస్ లో చాలా ఉపయోగపడుతుంది. అంటే కేవలం జీలకర్ర వాటర్ తాగడం ద్వారా బరువు తగ్గకపోవచ్చు. కానీ బరువు తగ్గడానికి మనం డైట్ లోనూ. ఎక్సర్సైజ్ లోనూ ప్రయత్నం చేస్తూ దానికి తోడుగా జీలకర్ర వాటర్ తాగితే ఇది మన బాడీలోని మెటబాలిజం నీ పెంచుతూ వెయిట్ లాస్ లో బాగా సహాయపడుతుంది. అలాగే ఈ జీలకర్ర వాటర్ మన బాడీలో కలిగే వాపును కూడా తగ్గిస్తుంది.
3. క్యాన్సర్ నివారణ
జీరా వాటర్ కు యాంటీ కార్సోజోనిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అంటే క్యాన్సర్ నివారణ కు ఉపయోగపడే పదార్థాలు ఉన్నాయి. అంతే కాదు ఒకవేళ క్యాన్సర్ తో బాధపడే వారు ఎవరైన ఈ జీలకర్ర వాటర్ ను తీసుకుంటే ఇది శరీరంలో ఒక భాగంగా ఏర్పడిన క్యాన్సర్ మరో భాగానికి స్ప్రెడ్ అవ్వకుండా ఆపుతుంది.
4. డయాబెటిస్ కంట్రోల్
జీరా వాటర్ మన ఇన్సులిన్ సెన్సివిటీ ని పెంచుతుంది. అంటే ఇన్సులిన్ బాగా ఉత్పత్తి అయ్యేలా చేసి మన రక్తం లో అధికంగా ఉండే గ్లూకోజ్ ని తగ్గిస్తుంది.
5. ఎసిడిటీ కంట్రోల్
జీలకర్ర వాటర్ తీసుకోవడం ద్వారా మన డైజేస్తివ్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ లోకి వస్తాయి. ఈ జీరా వాటర్ ఎసిడిటీ, గుండెలో మంట. గుండెలో నొప్పి, కడుపు ఉబ్బరం ఇంకా మల బద్దకం విటిన్నిటిని నివారిస్తుంది.
6. రక్తం వృద్ది
జీలకర్ర లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. రెగ్యులర్ గా జీరా వాటర్ తీసుకోవడం వల్ల హీమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. దీని వలన మన బ్లడ్ యొక్క క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది.
7. గుండె రక్షణ
మన రక్తంలో ట్రై గ్లిజరైడ్స్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇవి పెరిగిపోతే మన గుండె యొక్క గొట్టాలు బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ జీలకర్ర వాటర్ మన రక్తం లో ఉండే ట్రై గ్లైజారైడ్స్ ను ఇంకా బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండెను సమ్మరక్షిస్తుంది. అలాగే బీపీ ని కూడా కంట్రోల్ లో వుంచుతుంది.
8. మెరిసే చర్మం
జీలకర్ర వాటర్ లోని యాంటీ ఆక్సిడెంట్స్ మన చర్మం లోని వ్యర్థాలను తొలగిస్తాయి. అలాగే మోకం పై ఏర్పడిన మచ్చలు. మొటిమలు ఇవి కూడా మరి పోయేలా చేస్తాయి. జీరా వాటర్ లో ఉండే కాల్షియం, పొటాషియం, మాంగనీస్, ఇంకా సిలినియం ఇవి చర్మని కాంతి వంతంగా చేస్తాయి.
9. స్త్రీల సమస్యలు
జీరా వాటర్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ను సరి చేయడం లో సహాయపడుతుంది. జీరా ఇంకా మెంతులు ఈ రెండిటినీ కలిపి కాచిన కాషాయం తాగితే హార్మోన్ ఇన్ బ్యాలన్స్ వలన ఏర్పడిన సమస్యలను సరి చేసుకోవచ్చు.
10. జుట్టు సంరక్షణ
జీరా వాటర్ జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి కావలసిన పోషకాలు అన్నిటినీ సమకూరుస్తుంది. ఇంకా dandruff ను కూడా కంట్రోల్ చేస్తుంది. జుట్టు రాలకుండా ఈ జీలకర్ర నీళ్లు అరికడుతుంది.
Jeelakarra Health Benefits – ఇవి జీలకర్ర నీళ్ల తో ఉన్న లాభాలు కానీ ఏ రెమెడీ అయినా అతిగా వాడితే దాని వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా డయాబెటిస్ పేషంట్లు. బీపీ పేషంట్లు, pregnant women లు ఈ జీలకర్ర నీళ్లను తక్కువ మోతాదులో ఉపయోగించడం మంచిది. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.