Heart attack – మన గుండెను కాపాడే 5 సూపర్ ఫుడ్స్
ఇవ్వాల్టి ఆర్టికల్ లో 5 Foods That Reduce Risk Of Heart Attack – మన గుండెను కాపాడే 5 సూపర్ ఫుడ్స్ గురుంచి తెలుసుకుందాం రండి. మన గుండె రోజుకి కొన్ని లక్ష సార్లు కొట్టుకుంటుంది. అంటే సంవత్సరానికి 3 కోట్ల 50 లక్షల సార్లు కొట్టుకుంటుంది. మరి ఇంత హార్డ్ వర్క్ చేసే మన గుండె ఆరోగ్యంగా ఉండాలంటే దానికి మనం ఎలాంటి ఫుడ్ నీ ఇవ్వాలి. మనం ఏం తింటే గుండె కండరాలు బలంగా ఉంటాయి. అలాగే మన హార్ట్ లో బ్లాక్స్ లేకుండా ఉంటాయో ఇప్పుడు చూద్దాం.
గుండెను కాపాడే 5 ఆహార పదార్థాలు
1.ఆకు కూరలు
2.ముడి ధాన్యాలు
3.బెర్రీస్
4.వాల్ నట్స్
5.డార్క్ చాక్లెట్స్
1. ఆకు కూరలు
మన హార్ట్ ని స్ట్రాంగ్ గా చేసే ఫస్ట్ మరియు బెస్ట్ ఫుడ్ ఆకు కూరలు. వీటిలో ముఖ్యంగా పాలకూర, ఇంకా క్యాబేజీ. పాలకూర రక్త నాళాలను శుభ్రం చేసి బ్లడ్ ప్రేజర్ ను కంట్రోల్ చేస్తుంది. ఇంకా క్యాబేజీ లో ఉండే సలిబుల్ ఫైబర్ బాడీ లో ఉండే ఎక్సెస్ కొలెస్ట్రాల్ తొలగించడంలో సహాయపడుతుంది.
2. ముడి ధాన్యాలు
పొట్టు పూర్తిగా తీయని పాలిష్ పట్టని ధాన్యాలు, బ్రౌన్ రైస్, ఓట్స్, ఇంకా మిల్లెట్స్ ఇవ్వని మన గుండెకు ఎంతో బలాన్ని చేకూర్చే ఫుడ్స్. మూడు పూటలా ఒల్ గ్రైన్స్ తో చేసిన ఆహారాన్ని తీసుకుంటే హార్ట్ డిసీజెస్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా వుంటాయి.
3. బెర్రీస్
బెర్రీస్ అంటే స్త్రా బెర్రీస్, బ్లూ బెర్రీస్ లాంటివే మాత్రమే కాదు. మన దేశంలో, మన ప్రాంతంలో పండే నేరేడు, వగ్కాయలు, ఉసిరికాయలు, కాసిరెగ్కాయలు ఇవ్వని కూడా బెర్రీస్. అంతే కాదు మనకు ఏడాది పొడువునా దొరికే అతి చవకైన మోస్ట్ పవర్ ఫుల్ బెర్రీ జామకాయ. వీటి అన్నిటిలో పుష్కలంగా దొరికే యాంటీ ఆక్సిడెంట్ లు మన గుండెకు ఎంతో రక్షణ కలిగిస్తాయి.
4. వాల్ నట్స్
మన హార్ట్ నీ కాపాడే నెక్స్ట్ సూపర్ ఫుడ్ వాల్ నట్స్. వాల్ నట్స్ లో మన గుండె ఆరోగ్యానికి అవసరమైన మెగ్నీషయం, కాపర్ ఇంకా మాంగనీస్ లాంటి మినరల్స్ ఉంటాయి. అంతే కాకుండా వాల్ నట్స్ లో ఉండే ఫైబర్ ఇంకా ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్. ఇవి మన బాడీ లో అక్సిడేటివెస్ స్ట్రెస్ ను ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తాయి. ఇంకా LDL అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. వాల్ నట్స్ కాస్ట్లీ అనుకొనే వాళ్ళు దానికి బదులుగా ఫ్లాగ్ సీడ్స్, చియ సీడ్స్ ను కూడా ఉపయోగించవచ్చు.
5. డార్క్ చాక్లెట్స్
హార్ట్ హెల్త్ ను (Heart Attack) కాపాడే నెక్స్ట్ సూపర్ ఫుడ్ డార్క్ చాక్లెట్స్. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడే మరొక సూపర్ ఫుడ్. ఇందులో పుష్కంగా ఉండే Flavonoids మన హార్ట్ ఎఫిసైన్సీ నీ పెంచుతాయి. అయితే డార్క్ చాక్లెట్ లో ఉండే షుగర్ వల్ల ఇబ్బందులు కలగ కూడదు అనుకుంటే మనం డార్క్ చాక్లెట్ నీ తీసుకున్నపుడు అందులో చాలా వరకు 70% CoCoa Chocket లు మాత్రమే తీసుకోవాలి.
ఇవి మన హార్ట్ ను కాపాడుతూ దాని efficiency పెంచే 5 సూపర్ ఫుడ్స్. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.
2 thoughts on “మన గుండెను కాపాడే 5 సూపర్ ఫుడ్స్”