How to Stop Snoring : గురక తొందరగా తగ్గాలంటే
ఇవాళ్టి టాపిక్ లో How to Stop Snoring : గురక తొందరగా తగ్గాలంటే గురించి తెలుసుకుందాం. మన సమస్య మనకి కాకుండా పక్కన వారిని ఎక్కువగా ఇబ్బంది పెడుతుందంటే అది గురక మాత్రమే. సాధారణంగా నిద్రలో కొంచెం గురక రావడం అనేది సహజం కానీ కొంతమందికి విపరీతమైన గురక వస్తూ ఉంటుంది దీనిని ‘స్లీప్ ఆప్నియా’ అని పిలుస్తారు. కాబట్టి ఇలాంటి సమస్య ఎవరికి వస్తుంది, ఇది ఉన్నవారికి ప్రాణహాని ఉంటుందా అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
స్లీప్ అప్నియా లక్షణాలు
- ఒకరితో మాట్లాడుతూ కొద్దిగా ఖాళీ సమయం దొరికినా నిద్ర పోవడం.
- కుర్చీలో కూర్చుని నిద్రపోవడం.
- ఎంత సేపు పడుకున్నా కానీ సంతృప్తికరంగా లేకపోవడం.
- గురక వస్తున్నప్పుడు ఎక్కువగా శబ్దం రావడం.
- నిద్ర పోతున్నప్పుడు గాలి సరిగ్గా లోపలికి వెళ్ళకపోవడం.
కారణాలు
- లావు ఎక్కువగా ఉన్న వారికి ఇది వస్తుంది.
- సన్నగా ఉన్నవారిలో ముక్కు వంకరగా ఉన్నప్పుడు వస్తుంది.
- నోరు చిన్నగా నాలుక పెద్దగా ఉన్నవారికి ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది.
- టాన్సిల్స్ పెద్దగా ఉన్నవారికి కూడా గురక పెద్దగా వచ్చే అవకాశం ఉంది.
స్లీప్ అప్నియా ప్రమాదకరమా?
- ఈ సమస్య ఉన్నవారికి ఎక్కువగా హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంటుంది.
- సాధారణ వ్యక్తులకంటే స్లీప్ అప్నియా ఉన్నవారికి 3 రేట్లు ఎక్కువ ప్రమాదం ఉంది.
ఈ సమస్య వినడానికి చూడటానికి చిన్నదిగా కనపడుతుంది. కానీ వీరి చుట్టూ ఉన్నవారికి కొన్ని సార్లు నిద్ర పట్టకపోవడం వీరికి హార్ట్ ఎటాక్ రావడం జరుగుతుంది. కాబట్టి దీనిని వీలైనంత త్వరగా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.