Control Thyroid : థైరాయిడ్ తగ్గాలంటే ఏమి చేయాలి

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

How to Control Thyroid – థైరాయిడ్ తగ్గాలంటే ఏమి చేయాలి

 

ఇవ్వాల్టి ఆర్టికల్ లో How to Control Thyroid – థైరాయిడ్ తగ్గాలంటే ఏమి చేయాలి గురుంచి తెలుసుకుందాం రండి.

థైరాయిడ్ టాబ్లెట్స్ ఆపేస్తే ఏం జరుగుతుందో తెలుసా ?

ఈ మధ్య కాలంలో చాలా మందిలో థైరాయిడ్ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. దీని వలన ఎత్తు పెరగకపోవడం, ఉండవలసిన బరువు ఉండకపోవడం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఈ సమస్య ఉన్నవారికి టాబ్లెట్స్ వాడటంలో కొన్ని సందేహాలు ఉంటాయి అవి ఏంటో తెలుసుకుందాం.

థైరాయిడ్ టాబ్లెట్స్ వాడటం ఆపొచ్చా?

  • థైరాయిడ్ టాబ్లెట్స్ ఒక్కసారిగా ఆపడం చేయకూడదు.
  • ఈ టాబ్లెట్స్ వాడటం ఆపేస్తే భవిష్యత్తులో దాని ప్రభావం చూపిస్తుంది.
  • హైపర్ థైరాయిడ్ సమస్య ఉన్నవారు కరెక్ట్ డోస్ మెడిసిన్ తీసుకుంటే సులువుగా తగ్గుతుంది.

కొన్ని జబ్బులు ఎన్ని మందులు వాడినప్పటికి తగ్గవు. కానీ థైరాయిడ్ సమస్య ఉన్నవారు కరెక్ట్ గా మెడిసిన్స్ తీసుకుంటే త్వరగా తగ్గించుకోవచ్చు.

థైరాయిడ్ ఉన్న ఆడవారు మెచ్యూర్ అవ్వరా ?

థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నవారికి అనేక రకాల ఇతర సమస్యలు వస్తాయి. అందులో భాగంగా థైరాయిడ్ సమస్య ఉన్న ఆడపిల్లలు మెచ్యూర్ అవ్వడం కష్టమని వైద్యులు చెబుతున్నారు. దీనిని ఎలా అధిగమించవచ్చో తెలుసుకుందాం.

మెచ్యూర్ అవ్వడానికి సొల్యూషన్

  • ఆడపిల్లలకి థైరాయిడ్ ఉండటం వలన పీరియడ్స్ రావడం ఆగిపోతాయి.
  • 14 నుండి 15 సంవత్సరాలకే వారి ఎదుగుదల ఆగిపోతుంది.
  • ఈ సమస్య ఉన్న వారు ఎత్తు పెరగడం కూడా కష్టం అవుతుంది.
  • థైరాయిడ్ టాబ్లెట్స్ కరెక్ట్ గా వాడటం వలన ఈ సమస్యలని పోగొట్టుకోవచ్చు.

ఆడపిల్లలకి సరైన సమయంలో పీరియడ్స్ రాకపోతే వెంటనే థైరాయిడ్ టెస్ట్ చేపించడం తప్పనిసరి. ఇలా చేయడం వలన సమస్యని మొదట్లోనే తగ్గించుకొని ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందవచ్చు.

గొంతు మారితే తో థైరాయిడ్ సమస్య వచ్చినట్టేనా ?

హైపో థైరాయిడ్ సమస్య ఉన్నవారికి కొన్ని ఇతర సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా గొంతు భాగంలో కొన్ని మార్పులు వస్తాయి. ఎలాంటి మార్పులు వస్తాయి దీనిని ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

What causes Eyes to Roll : కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి
కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి

గొంతులో వచ్చే మార్పులు

  • హైపో థైరాయిడ్ సమస్య వచ్చినవారికి గొంతు మారిపోవడం జరుగుతుంది.
  • ఫోన్లో అవతలి వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా వారి గొంతును బట్టి థైరాయిడ్ సమస్యని కనిపెట్టవచ్చు.
  • ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు థైరాయిడ్ టాబ్లెట్స్ వేసుకోవడం వలన రెండు సమస్యలు తగ్గిపోతాయి.
  • గొంతు బొంగురు పోయినప్పుడు థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవడం మంచిది.

గొంతు బొంగురు పోయిన ప్రతి ఒక్కరికి థైరాయిడ్ వచ్చిందని అనుకోకూడదు. ఒంట్లో ఎలాంటి చిన్న సమస్య వచ్చినా సంవత్సరానికి ఒకసారి, ఎలాంటి సమస్య లేని వారు రెండు సంవత్సరాలకి ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవడం మంచిది.

థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టడం కష్టమా ?

థైరాయిడ్ సమస్యతో బాధ పడుతున్నవారికి అనేక రకాల ఇతర సమస్యలు వస్తాయి. అందులో భాగంగా థైరాయిడ్ సమస్యతో ఉన్నవారికి పిల్లలు పుట్టడం కష్టమని వైద్యులు చెబుతున్నారు. దీనిని ఎలా అధిగమించవచ్చో
తెలుసుకుందాం.

థైరాయిడ్ ఉన్నవారికి పిల్లలు పుట్టాలంటే

  • బాడీలో TSH ఎక్కువ ఉన్నవారికి పిల్లలు పుట్టడం కష్టం అవుతుంది.
  • థైరాయిడ్ టాబ్లెట్ తీసుకోవడం వలన త్వరగా సంతానం కలిగే అవకాశం ఉంటుంది.
  • సంవత్సరానికి ఒకసారి TSH టెస్ట్ చేపించుకోవడం మంచిది.
  • భారతదేశంలో చాలామంది థైరాయిడ్ సమస్యకి గురికావడం వలన ప్రతిఒక్కరు దీనిపట్ల జాగ్రత్తగా ఉండాలి.

థైరాయిడ్ సమస్యతో బాధ పడుతున్నవారికి సంతానం కలగడం కష్టం కాబట్టి దీనిని వీలైనంత త్వరగా తగ్గించుకోవడం మంచిది. అలానే సంవత్సరానికి ఒక్కసారి టెస్ట్ చేయించుకోవడం వలన భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు.

థైరాయిడ్ ఉన్నవారికీ గుండె పోటు వస్తుందా ?

థైరాయిడ్ సమస్య ఉన్నవారికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ లో గుండె సమస్యలు కూడా ఒకటి. కాబట్టి దీనిని తగ్గించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

థైరాయిడ్ వలన వచ్చే గుండె సమస్యలు

  • ఈ సమస్య ఉన్నవారు ఎక్కువగా ఆయాస పడటం, నీరసం రావడం జరుగుతుంది.
  • ఏ పని అయినా చాలా నెమ్మదిగా చేస్తూ ఉంటారు.
  • కాళ్ళు వాపులు విపరీతంగా ఉంటాయి.
  • ఈ లక్షణాలు కనిపించినవారు హైపర్ థైరాయిడ్ టాబ్లెట్స్ తీసుకోవడం మంచిది.
  • సంవత్సరానికి ఒకసారి అయినా థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి.

థైరాయిడ్ సమస్యని ముందుగానే గుర్తించడం వలన దీని నుండి త్వరగా బయటపడవచ్చు. అలానే టాబ్లెట్స్ క్రమం తప్పకుండా వాడటం వలన గుండె జబ్బుల నుండి దూరంగా ఉండవచ్చు.

థైరాయిడ్ ఉన్నవారిలో కనిపించే లక్షణాలు

థైరాయిడ్ లక్షణాలు ఎలా ఉంటాయి, దీనిని తగ్గించుకోవడం వలన ఎలాంటి సమస్యల నుండి తప్పించుకోవచ్చో చాలామందికి తెలియదు. కాబట్టి థైరాయిడ్ వలన వచ్చే ముఖ్యమైన లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం.

High Protein Curry : మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ
మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ

థైరాయిడ్ ముఖ్య లక్షణాలు

  • గోర్లు సులువుగా విరిగిపోవడం జరుగుతుంది.
  • మలబద్దకం ఉంటుంది.
  • చర్మం పొడిబారిపోవటం.
  • మెడ దగ్గర థైరాయిడ్ గ్రంధి వాపు లాగా కనిపిస్తుంది.
  • శరీరంలో కొంచెం కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
  • స్త్రీలకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఓవర్ బ్లీడింగ్ లాంటివి వస్తాయి.
  • ఎక్కువగా చలి వేయడం.
  • గుండె నెమ్మదిగా కొట్టుకోవడం.
  • ముఖం మీద చర్మం మెత్తగా అవుతుంది.
  • కండరాల బలహీనత వస్తుంది.
  • ఎక్కువగా ఫ్రస్ట్రేషన్ కి గురవుతారు.

థైరాయిడ్ ముఖ్య లక్షణాలు

  • సంవత్సరానికి ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేపించుకోవాలి.
  • ఈ సమస్యకి మందులు వాడవచ్చు.
  • థైరాయిడ్ మెడిసిన్ రెగ్యులర్ వాడాలి.

థైరాయిడ్ లక్షణాలు అన్నీటిలో ఏ ఒక్కటి ఉన్నా వెంటనే టెస్ట్ చేపించుకోవడం మంచిది. అలానే దీనిని తగ్గించుకోవడం అనేక సమస్యల నుండి తప్పించుకొని ఆరోగ్యంగా ఉండవచ్చు.

How to Control Thyroid – ఇలా చేస్తే థైరాయిడ్ సమస్య తగ్గిపోతుంది

థైరాయిడ్ చిన్న సమస్య అయినప్పటికీ ఇది ఎంతో మంది జీవితాలని పాడు చేసింది. కాబట్టి ఈ సమస్య ఉన్నవారికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, దీనిని సులువుగా ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం.

థైరాయిడ్ సమస్య వలన వచ్చే ఇతర సమస్యలు

  • ఈ సమస్య ఉన్నవారు ఎప్పుడు డల్ గా కనిపిస్తారు.
  • అధిక బరువు సమస్య కూడా వస్తుంది.
  • స్త్రీలకి పీరియడ్స్ సమస్యలు వస్తాయి.

తీసుకోవలసిన జాగ్రత్తలు

  • థైరాయిడ్ టాబ్లెట్స్ రెగ్యులర్ గా వాడటం మంచిది.
  • ఈ టాబ్లెట్స్ ని ఇష్టం వచ్చినప్పుడు ఆపకూడదు.
  • టాబ్లెట్ వేసుకున్నప్పుడు ఇది కంట్రోల్లో ఉంటే జీవితాంతం టాబ్లెట్స్ వాడాలని అర్ధం.

థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఒక్కసారిగా టాబ్లెట్స్ వేసుకోవడం ఆపడం వలన భవిష్యత్తులో సైడఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి ఎప్పటికప్పుడు టెస్ట్ చేపించుకుంటూ టాబ్లెట్స్ వాడటం ఉత్తమమైన మార్గం. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Deepu, I am the Writer and Founder of this blog and share all the information related to Blogging, SEO, Internet, Review, WordPress, Make Money Online, News and Technology through this website.

Sharing Is Caring:

2 thoughts on “Control Thyroid : థైరాయిడ్ తగ్గాలంటే ఏమి చేయాలి”

Leave a Comment