గెలవాలి అంటే మొండిగా మారాలి – How To Achieve Success in Telugu
ఇవాళ్టి టాపిక్ లో How To Achieve Success in Telugu గురించి తెలుసుకుందాం.
నమ్మకంతో గెలవాలంటే ఎలా
ప్రతి ఒక్కరి జీవితంలో నమ్మకం ఎంతో ముఖ్యమైనదని మనం తరచుగా విని ఉంటాం. ఈ కథలో ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్న రాముడు అనే కుర్రాడి జీవన ప్రయాణం ద్వారాగా నమ్మకం ఎలా జీవితాన్ని మార్చగలదో తెలుసుకుందాం.
ఒక చిన్న గ్రామంలో రాముడు అనే కుర్రాడు ఉండేవాడు. అతనికి చదువు అంటే ఎంతో ఆసక్తి ఉండేది. కానీ తన కుటుంబం ఆర్థికంగా చాలా బలహీనంగా ఉండేది. అంతే కాకుండా తన చదువుకయ్యే ఖర్చులకు కూడా వాళ్ళ దగ్గర సరిగ్గా డబ్బు ఉండేది కాదు, అయినప్పటికీ రాముడు తన నమ్మకాన్ని కోల్పోలేదు. ఒకరోజు రాముడు స్కూల్ నుంచి తిరిగి వస్తూ గ్రామంలోని బడి మాస్టర్ అయిన శ్రీనివాసరావు గారిని కలిసాడు. మాస్టారు నాకు చదువు అంటే చాలా ఇష్టం కానీ మా కుటుంబ పరిస్థితులు చదువుకోవడానికి సహకరించట్లేదు అలా అని చదువు మానేయడం నాకు అస్సలు ఇష్టం లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి రాముడు తన బాధను మొత్తం ఆ స్కూల్ మాస్టర్ అయిన శ్రీనివాసరావు గారికి చెప్పుకున్నాడు. అప్పుడు శ్రీనివాసరావు గారు రాముడి నమ్మకాన్ని గ్రహించి ఒక ఉపాయం చెప్పాడు. రాముడా మనకు ఉండే నమ్మకం ఎంతో బలమైనది నువ్వు మానసికంగా బలంగా ఉంటే ఎటువంటి ఆపదనైనా నువ్వు ఎదుర్కొంటావు. నువ్వు ప్రతి రోజు అంకిత భావంతో చదువు తప్పకుండా నీ జీవితంలో పెనుమరుపు అయితే వస్తుందని చెప్పేసి ఆ మాస్టర్ గారు రాముడికి కాస్త ధైర్యాన్ని ఇచ్చే మాటలు చెప్పి తనని అక్కడి నుంచి పంపించేస్తాడు. కానీ రాముడు మాత్రం మాస్టర్ చెప్పిన మాటల్ని బలంగా నమ్మి ప్రతి రోజు కష్టపడి చదువుతూ అలాగే గ్రామంలో జరిగే ప్రతి చిన్న పోటీలో పాల్గొని అని ప్రతిసారి గెలిచేవాడు. ఇలాగ ప్రతి రోజు జరగటం వల్ల గ్రామంలో ఉన్న పెద్దలందరూ రాముడి ప్రతిభను గమనించి అతనికి స్కాలర్షిప్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇంకేముంది రాముడు ఎంతో కష్టపడి చదివాడు. అలా తన జీవితంలో వచ్చిన ప్రతి కష్టాన్ని నమ్మకంతో ధైర్యంతో ఎదుర్కొని ఎట్టకేలకు ఒక పెద్ద ఇంజనీర్ అయ్యి తన గ్రామంలో చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్న చాలా మంది పిల్లలకి ఒక ఆదర్శంగా నిలిచాడు.
ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే నమ్మకం అనేది ఒక శక్తివంతమైన ఆయుధం అది మన మీద మనం ఉంచుకోవాలి. అలా ఉంచుకోవడం వల్ల మన జీవితంలో మనకి ఎదురయ్యే ప్రతి ఒక్క కష్టాన్ని అధిగమించి విజయం సాధిస్తాము. ప్రతి ఒక్కరు తమ జీవితంలో నమ్మకం నిలుపుకుంటూ ముందుకు సాగితే ఎప్పటికైనా విజయం సాధిస్తారు.
ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.