Heart Problems – గుండె జబ్బులు రాకుండా కాపాడే ఎక్సర్ సైజులు
1. Aerobic Exercises
Aerobic Exercises అంటే రిస్క్ వాకింగ్, రన్నింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, టెన్నిస్ ఆడటం, స్కిప్పింగ్ చేయటం మొదలైనవి. ఈ ఎక్సర్ సైజులు మన గుండె సామర్థ్యాన్ని మన లంగ్స్ యొక్క కెపాసిటీ ని పెంచుతాయి. అలాగే మన బ్లడ్ సర్కులేషన్ నీ కూడా బాగా మెరుగుపరిచి బ్లడ్ ప్రెషర్ ని కూడా వేగాన్ని తగ్గిస్తాయి. ఈ Aerobic Exercises లు టైప్ -2 ని కూడా తగ్గిస్తాయి. అయితే ఇప్పటికే హార్ట్ చిక్కులు తో బాధపడుతున్న వాళ్ళు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు డాక్టర్ సలహా మేరకు మత్రమే ఈ Aerobic Exercises లు చేయాలి.
ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు మత్రమే రోజు కి 30 నిమిషాలు Aerobic Exercises చేయడం ద్వారా భవిష్యత్తులో గుండె జబ్బులు రాకుండా నివారించవచ్చు.
2. Weight Lifting – బరువులు ఎత్తడం
జిమ్ లో ఉండే డంబుల్స్ వాటితో వర్క్ చేయడం. ఇంకా పుషప్, స్కాట్స్ మొదలైనవి కూడా ఈ స్త్రెంత్ వర్క్ లోకి వస్తాయి. బాడీలో ఎక్కువ ఫ్యాట్ ఉన్నవాళ్లు అంటే నడుము దగ్గర పొట్ట దగ్గర ఎక్కువ పేరుకుపోయిన వాళ్ళు ఈ స్ట్రెంత్ వర్క్ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఇవి కొవ్వు కరిగించడమే కాకుండా బాడీలో ఉండే LDL అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడం లో సహాయపడతాయి.
వారానికి రెండు రోజులు ఈ స్ట్రెంత్ వర్క్ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే Aerobics తో పాటు, ఈ స్ట్రేంత్ వర్క్ ను కూడా కలిపి చేస్తే హార్ట్ ఎటాక్ ను చాలా వరకు ప్రివెంట్ చేసుకోవచ్చును.
3. Yoga – స్త్రెంచింగ్స్
యోగ మన హార్ట్ హెల్త్ కు నేరుగా లాభం చేయించకపోయినా ఈ స్త్రెంచింగ్స్ వలన ఎముకలు కండరాలు గట్టిపడి బాడీలో ఫ్లెక్సిబిలిటీ బ్యాలెన్స్ పెరుగుతాయి. సాధారణంగా వయసు పెరిగే కొలది బాడీలో బ్యాలెన్స్ తగ్గి తరచుగా పడిపోవడం అలాగే కీళ్లపై ఒత్తిడి పెరిగి కీళ్లు అరిగిపోవడం, నడవలేకపోవడం మొదలైనవి పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటప్పుడు బాడీలో మొబిలిటీ తగ్గి ఎలాంటి ఎక్సర్సైజులు చెయ్యలేని పరిస్థితిలోకి వెళ్లిపోతుంటారు. దాంతో బాడీలో ఫ్యాట్ పెరిగిపోవడం హార్ట్ లో బ్లాక్స్ పెరిగిపోవడం జరుగుతుంది.
అయితే ఎవరైతే రెగ్యులర్గా యోగా లాంటి స్ట్రెంచింగ్స్ చేస్తూ ఉంటారో వాళ్ల బాడీలో బ్యాలెన్స్ బాగా పెరుగుతుంది. వలన వాళ్లు తరచుగా పడిపోవడం గాని, కీళ్ల జబ్బులు మొదలైనవి రావడం కానీ జరగదు. అందుచేత వయసు బాగా పెరిగినప్పటికీ కూడా Aerobic Exercises లు, ఇంకా స్త్రేంత్ వర్క్ లు సునాయాసంగా చేయగలుగుతారు. ఇలా చేస్తున్నంతకాలం హార్ట్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఇవి Heart Problems (హార్ట్ ప్రాబ్లమ్స్) రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి చేయవలసిన వ్యాయామాలు.
ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.
2 thoughts on “గుండె జబ్బులు రాకుండా వుండాలంటే ఏమి చేయాలి”