Amazing Health Benefits of Banana : అరటి పళ్ళు ప్రయోజనాలు
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Amazing Health Benefits of Banana : అరటి పళ్ళు ప్రయోజనాలు గురుంచి తెలుసుకుందాం రండి.
అరటి పళ్ళు ప్రకృతి వర ప్రసాదం. అత్యధికం గా భూమి పై ప్రజలు తినే పళ్ళలో అరటి పళ్ళుదే ముందు స్థానం. సంవత్సరం పొడవునా అందుబాటులో ఉండే అతి చవకైన, రుచికరమైన పళ్ళు ఇవి..
అరటి పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు
అరటి పళ్ళలో పొటాషియం అత్యధికం ఉంటుంది. పొటాషియం శరీరం లోని రక్త ప్రసరణ ను, నీటి సమతుల్యత ను అదుపు లో ఉంచుతుంది. అరటి పళ్ళ లోని పొటాషియం అధిక రక్త పోటును, గుండె సంబంధ వ్యాధులను దూరం చేస్తుంది. అరటి పళ్ళలో అధిక మోతాదుల్లో ట్రిప్టోఫాన్ ఉంటుంది. మన శరీరం ట్రిప్టోఫాన్ ను సెరటోనిన్ గా మార్చుకొని జ్ఞాపక శక్తిని పెంచి మానసిక ఆందోళన లేకుండా చేస్తుంది. అరటిపళ్ళ లో ఉండే విటమిన్ B6 మానసిక ప్రశాంతత ను ఇచ్చి మంచి నిద్ర పట్టేలా చేస్తుంది. అరటి పళ్ళలో కాల్షియం ఎక్కువ గా లేక పోయినప్పటికీ కాల్షియం ను ఎక్కువ గా శోషించు కొనేలా చేసి ఎముకలను దృఢపరుస్తుంది. రక్త పోటు (బి.పి) ను చాలా వరకు అదుపు లో ఉంచుతుంది. కాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ వృద్ధి చెందకుండా అరటి పళ్ళు కాపాడతాయి. 10.సాధారణ సైజు లో ఉండే అరటి పండు లో దాదాపు 420 మి.గ్రా పొటాషియం ఉంటుంది. రోజుకొక అరటి పండు తినే వారిలో ఆస్తమా వచ్చే అవకాశాలు 34 శాతం తక్కువ. ప్రతి రోజు భోజనం లో ఒక అరటి పండు తినడం వలన మంచి కంటి చూపు ను పొందవచ్చు. అరటి పళ్ళలో ఉండే పొటాషియం, విటమిన్ C, విటమిన్ B6, పీచు పదార్ధం గుండె ను ఆరోగ్యం గా ఉంచుతాయి. అరటిపళ్ళు తియ్యగా ఉండి తిన్న వెంటనే కడుపు నిండి నట్లు అనిపిస్తుంది. అందుచేత బరువు తగ్గవచ్చు. అరటి పళ్ళు తింటే ఆకలి తగ్గుతుంది. తద్వారా బరువు సులభం గా తగ్గవచ్చు. సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులకు అరటిపండు తొక్క దివ్య ఔషదం. ప్రతి అరటి పండులో 105 కాలరీల శక్తి ఉంటుంది. ప్రోటీన్లు అతి తక్కువ ఉంటాయి. కొవ్వులు అసలు ఉండవు. అరటి పండులో గ్లయిసిమిక్ ఇండెక్స్ 60 వరకూ ఉంటుంది. అంటే తిన్న వెంటనే రక్తం లో షుగర్ లెవెల్స్ పెరగవు. ఒక సాధారణ అరటిపండు లో 3 గ్రాముల పీచు పదార్ధం ఉంటుంది. జీర్ణ క్రియ సక్రమం గా జరగడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అరటి పళ్ళ లో యాంటీ ఆక్సడెంట్ లు పుష్కలం గా ఉంటాయి. తరచూ అరటిపళ్ళు తినే వారిలో మూత్ర పిండ వ్యాధులు వచ్చే ప్రమాదం 50 శాతం తక్కువ. కండరాల నొప్పులను సులువు గా తగ్గిస్తుంది.