Telugu Chitkalu | ఆరోగ్య చిట్కాలు | Telugu Health Tips
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Telugu Chitkalu | ఆరోగ్య చిట్కాలు | Telugu Health Tips గురుంచి తెలుసుకుందాం రండి.
- సీతాఫలం గింజలను మెత్తని పొడిగా చేసి ప్రతిరోజూ ఆ పొడిని తలకు పెట్టుకొని స్నానం చేస్తే చుండ్రు వెంటనే తగ్గిపోతుంది.
- బిల్వ పత్రాలకు శరీర చెమట వాసనను అరికట్టే గుణం ఉంది. బిల్వ పత్రాలు రుబ్బి శరీరానికి పట్టించి స్నానం చెయ్యాలి.
- పంటిలో రంధ్రం ఏర్పడి ఎక్కువగా నొప్పి వస్తుంటే లవంగనూనె లో ముంచిన దూది ఆ రంధ్రం వద్ద ఉంచాలి.
- ఖర్జూరం ఉదర సంబంధ క్యాన్సర్ల ను రాకుండా చేస్తుంది.
- గ్లాసు నీటిలో కొంచం యాలకల పొడి వేసుకొని త్రాగితే మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది.
- గోరువెచ్చని పాలలో పసుపు కలుపుకొని త్రాగితే కాలేయం పనితీరు మెరుగుపడుతుంది.
రక్తం శుద్ధి అవుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. - సబ్జా మొక్కల యొక్క ఆకులు బాగా నలిపి తేలు కుట్టిన చోట రుద్దితే నొప్పి తగ్గుతుంది.
- స్త్రీలలో ఋతు సమస్యలకు అరటిపువ్వు తినడం మంచిది.
- తులసి ఆకులు నీళ్ళలో వేసుకొని ప్రతిరోజూ త్రాగుతుంటే గొంతు ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.
- వేడి టీ ముక్కులోని సూక్ష్మ క్రిములను అరికడుతుంది.
- ఏవైనా కీటకాలు మనల్ని కుట్టినప్పుడు వాటి చికిత్స కోసం మునగ కాడ రసాన్ని
ఉపయోగిస్తే ప్రయోజనం ఉంటుంది. - క్యాబేజీ వృద్ధాప్య ఛాయలను దగ్గరకు రానివ్వదు.
- మొటిమలు ఎక్కువగా ఉన్నవారు పచ్చి బొప్పాయి గుజ్జును మొహానికి రాసుకొంటే మొటిమలు తగ్గుతాయి.
- స్నానం చేసే నీళ్ళలో కొన్ని చుక్కల వెనిగర్ వేసుకొని స్నానం చేస్తే చెమట వాసన రాదు.
- దాల్చిన చెక్క పొడిని ప్రతి రోజూ ఏదో ఒక రూపం లో తీసుకొంటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. వృద్ధాప్యం రానివ్వదు.
- కూరగాయలన్నిటి లో పాలకూర లో అత్యధికం గా విటమిన్ A ఉంటుంది.
- రాత్రి పూట అన్నం తింటుంటే వంట్లో క్రొవ్వు పెరుగుతుంది.
- చింతపండు మూత్రపిండాల లో రాళ్ళు ఏర్పడకుండా చేస్తుంది. (ఉత్తరాది కంటే దక్షిణాది లో కిడ్నీ స్టోన్స్ ఏర్పడే శాతం
తక్కువ. ఉత్తరాదిలో చింతపండు ఎక్కువ వాడరు) - ఉదయం బ్రష్ చేసుకొనేటప్పుడు కొంచం నిమ్మరసం పిండుకొని బ్రష్ చేస్తే
దంతాలు తెల్లగా మెరుస్తాయి. - అరటిపండు కంటే బంగాళాదుంప లో మూడురెట్లు ఎక్కువ పొటాషియం ఉంటుంది.
- మామిడి పండ్ల రసం లో ఒక స్పూన్ తేనె కలుపుకొని కొద్ది రోజులు త్రాగితే నరాల బలహీనత క్రమం గా తగ్గుతుంది.
- ప్రతిరోజూ బీట్ రూట్ రసాన్ని ముఖానికి రాసుకొని ఆ తర్వాత సున్నిపిండి తో కడిగితే చర్మానికి మంచి రంగు వస్తుంది.
- మాంసాహారం ఎప్పుడూ లంచ్ లో తినడం మంచిది. రాత్రి పూట తినడడం తగ్గించాలి.
- తిన్నప్పుడు చేదుగా ఉండే వేరుసెనగ గింజలో ఆఫ్లో టాక్సిన్ లు ఉంటాయి. ఇవి క్యాన్సర్
కారకాలు. మంచి గింజలు మాత్రమే తినాలి. - పచ్చి గుడ్లను తినడం ఆరోగ్యానికి ఎంతమాత్రమూ మంచిది కాదు.
- తోటకూర ఆకులు, గులాబీ పూరేకులు కలిపి రుబ్బి నిమ్మకాయ రసం కలిపి మొహానికి రాసుకుంటే జిడ్డు తనం తగ్గి చర్మం కాంతివంతం అవుతుంది.
- అల్లం నొప్పి నివారిణి గా పనిచేస్తుంది.
- రాత్రి పూట స్వీట్స్ తింటే శరీరం లో క్రొవ్వు పెరుగుతుంది. నిద్ర కూడా సరిగ్గా పట్టదు.
- పరగడుపున అరటిపండు ను తినరాదు.
- బీట్ రూట్ జ్యూస్ లో అత్యధికం గా ఐరన్ ఉంటుంది. ఇది రక్త హీనత ను తగ్గిస్తుంది.
- ధనియాలు నోట్లో వేసుకొని చప్పరిస్తూ ఉంటే నోటి దుర్వాసన తగ్గిపోతుంది.
- తేనెటీగలు కుట్టినప్పుడు వాటి చికిత్స కు బిళ్ళ గన్నేరు ఆకులు చాలా బాగా పనిచేస్తాయి.
- ఒక కప్పు నీటిలో రెండు స్పూన్ల తేనె కలుపుకొని పడుకోబోయే ముందు త్రాగితే
మంచి నిద్ర పడుతుంది. - శరీరం పై ఎక్కడైనా కాలినప్పుడు ఆ ప్రదేశం లో తేనె రాస్తే బొబ్బలు ఏర్పడకుండా ఉంటాయి.
- జలుబు చేసినప్పుడు విటమిన్ సి ఎక్కువ తీసుకొంటే జలుబు త్వరగా తగ్గిపోతుంది.
- సబ్జా గింజలను వేడినీటిలో నానబెట్టి పాలలో కలిపి మద్యాహ్నం పూట త్రాగితే శరీరం లోని అధిక వేడి తగ్గిపోతుంది.
- వెల్లుల్లి వాడటం వలన రక్తంలోని కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రక్తపోటు అదుపు లో ఉంటుంది.
రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. - బంగాళా దుంపలపై కనిపించే ఆకుపచ్చని రంగులోని మచ్చల్లో సెలెనైన్ అనే విషపదార్ధం
ఉంటుంది. ఆ దుంపలు తినరాదు. - వడదెబ్బ తిన్న వారికి, ఎండలో ఎక్కువ తిరిగివచ్చిన వారికి పచ్చి మామిడి కాయను ముక్కలుగా కోసి ఉప్పులో అద్ది ఇస్తే వెంటనే శక్తి పొందుతారు
- పరగడుపున కొన్ని కరివేపాకు ఆకులు నమిలి తినడం వలన డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
- అధిక శ్రమ చేసేవారు విటమిన్ E ఎక్కువ తీసుకోవాలి. ఐరన్ తో కలిపి విటమిన్ E
తీసుకొంటే మంచిది. - క్యారట్ తరచూ తినే వారిలో కాలేయ, మూత్రాశయ, సర్విక్స్ క్యాన్సర్లు వచ్చే
ప్రమాదం చాలా తక్కువ. - అనాస పండ్ల రసాన్ని పై పూత గా రాస్తే గజ్జి, తామర, ఇతర చర్మ సంబంధ వ్యాధులు వెంటనే తగ్గుతాయి.
- ఎక్కిళ్ళు ఆగకుండా వస్తుంటే కొంచం పంచదార నోట్లో వేసుకొని చూడండి.
- ఆల్కహాల్ ఎక్కువగా త్రాగే వారిలో B విటమిన్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. B విటమిన్ ఎక్కువ ఉండే ఆహారం తీసుకోవాలి.
- నేరేడు పళ్ళు డయాబెటిస్ ఉన్నవారికి మంచి ఆహారం. పీచు పదార్ధం ఎక్కువగా ఉండి
మలబద్దకాన్ని కూడా నివారిస్తుంది. - మూత్ర పిండాల సమస్యలు ఉన్నవారు అరటిపళ్ళు తినకపోవడం మంచిది.
- కారాన్ని అధికం గా వాడితే జీర్ణాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ.
- అరటి పండు గుజ్జు, చింతపండు, ఉప్పు కలిపిన మిశ్రమాన్ని తీసుకొంటే రక్త విరేచనాలు
తగ్గుతాయి. - ఎక్జిమా వంటి చర్మ వ్యాధుల నివారణకు ఖర్జూర పండ్ల రసం బాగా పనిచేస్తుంది.
ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.
1 thought on “Telugu Chitkalu | ఆరోగ్య చిట్కాలు | Telugu Health Tips”