అధిక రక్తపోటుకు అద్భుత చికిత్సలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

How to Control Bp in Telugu – బిపి డౌన్ అయితే వెంటనే ఇలా చేయండి

ఇవ్వాల్టి ఆర్టికల్ లో How to Control Bp in Telugu – బిపి డౌన్ అయితే వెంటనే ఇలా చేయండి గురుంచి తెలుసుకుందాం రండి. కొంతమందిని వారి ముఖం చూడగానే వారు ఎదో సమస్యతో ఇబ్బంది పడుతున్నారు లేదా నీరసంగా ఉన్నారు అనిపిస్తుంది. వారు ఆరోగ్యంగా లేకపోవడం కొంచెం దూరం కూడా నడవలేకపోవడం జరుగుతుంది. అలాంటి వారికి పరిష్కారాన్ని తెలుసుకుందాం.

నీరసం తగ్గి యాక్టివ్ అవ్వడానికి

  • నీరసంతో ఉన్న పేషెంట్ మంచి నీళ్లు త్రాగగలిగే పరిస్థితిలో ఉన్నప్పటికీ కొన్ని సార్లు సెలైన్ పెట్టుకోవాల్సి ఉంటుంది.
  • సెలైన్ పెట్టుకోవడం వలన బిపి డౌన్ అయిన సమయంలో వెంటనే మెడిసిన్ ఇవ్వవచ్చు.
  • ఇంట్లో ఎవరికైనా నీరసంగా ఉన్న సమయంలో కూడా హాస్పటల్కి వెళ్ళే సమయంలోపు సెలైన్ పెట్టవచ్చు.
  • బిపి నార్మల్గా ఉండి యాక్టివ్ గా ఉన్నవారికి సెలైన్ అవసరం ఉండదు.

చాలామంది యాక్టివ్ గా ఉన్నప్పటికీ సెలైన్ పెట్టించుకోవడం జరుగుతుంది దీని వలన బ్యాక్టీరియా శరీరం లోపలకి నేరుగా వెళుతుంది. కాబట్టి ఇది అవసరం ఉన్నవారు మాత్రమే వాడటం మంచిది.

బిపి టాబ్లెట్స్ వేసుకోవడం ఆపొచ్చా

ఈ మధ్య కాలంలో చాలా మంది బీపీ సమస్యతో బాధపడుతున్నారు. అయితే కొంతమంది టాబ్లెట్స్ ఎలా వేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటే, మరికొంతమంది మెడిసిన్స్ నిర్లక్ష్యం చేసి సమస్యని పెంచుకుంటున్నారు. కాబట్టి బీపీ టాబ్లేట్స్ ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం.

బీపీ ఉన్నవారు చేయకూడని తప్పులు

  • బీపీ సమస్యతో బాధ పడుతున్నవారు ఒకరోజు టాబ్లెట్స్ వేసుకోవడం మరుసటి రోజు మానేయడం లాంటి పనులు చేయకూడదు.
  • టాబ్లెట్స్ ఇష్టం వచ్చినప్పుడు వేసుకోవడం కూడా ఆరోగ్యానికి ఆపదే అని వైద్యులు సూచిస్తున్నారు.
  • టాబ్లెట్స్ ఒక్కసారిగా ఆపడం వలన బీపీ అమాంతం పెరిగే అవకాశం ఉంది.
  • కొంతమందికి బీపీ 170, 190 వరకు వెళ్ళినప్పుడు మెదడులో నరాలు చిట్లడటం, పక్షవాతం రావడం జరుగుతుంది.
  • వీటిని రెగ్యులర్ గా వేసుకోవడం వలన కళ్ళు, కిడ్నీలు బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి.

బీపీ సమస్య ఉన్నవారు టాబ్లెట్స్ ఆపడం వలన సమస్యని ఇంకాస్త పెంచుకొని బాధ పడతారు. కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు, బిజీగా ఉన్న సమయాలలో ఆలస్యం అయినా కానీ వీటిని తప్పని సరిగా వేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.

What causes Eyes to Roll : కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి
కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి

బిపి పెరిగితే కిడ్నీ సమస్యలు వస్తాయా ?

బీపీ అనే మాట వింటేనే చాలా మందికి బీపీ పెరిగిపోతూ ఉంటుంది. మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు ఉన్నవారికి కిడ్నీ సమస్యలు కూడా వస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమస్యతో బాధ పడుతున్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

హై బీపీ ఇలా అదుపులో

  • యుక్తవయసులో బీపీ వచ్చినవారికి కిడ్నీలు కూడా డామేజ్ అవుతున్నాయి.
  • చెకప్ కోసం డాక్టర్ దగ్గరకు వెళ్లడం వలన ఎలాంటి ఉపయోగం ఉండదు, టెన్షన్ పడటం వలన రీడింగ్ తప్పుగా చూపించే అవకాశం ఉంది.
  • రీడింగ్ ఎంత ఉందో ఖచ్చితంగా తెలుసుకోవాలి అంటే ఒక పుస్తకంలో రోజుకి ఐదు సార్లు చొప్పున రీడింగ్ నోట్ చేసుకోవాలి.
  • ఎన్ని సార్లు 140/90 వస్తుందో గమనించుకోవాలి.
  • షుగర్, బీపీ ఉండి షుగర్ కంట్రోల్ లేని వారికి బీపీ 130/85 దాటకుండా ఉండాలి.
  • ఎప్పుడైనా 170 లేదా 180 దాటితే రీడింగ్ 5 లేదా 6 సార్లు చెక్ చేసుకోవాలి నార్మల్గా ఉంటున్నప్పుడు రోజుకి రెండు సార్లు చూసుకున్నా సరిపోతుంది.
  • ఇది ఉన్నవారికి ఎటువంటి లక్షణాలు కనిపించవు కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండటం అవసరం.

బీపీ ఉన్న ప్రతి ఒక్కరి ఇంట్లో రీడింగ్ మిషన్ తప్పనిసారిగా ఉంచుకోవాలి. వైద్యులు అన్ని సమయాలలో అందుబాటులో ఉండరు కాబట్టి మనమే జాగ్రత్తలు తీసుకోవాలి.ఎప్పటికప్పుడు బీపీ పెరగకుండా చూసుకుంటే కిడ్నీ సమస్యల నుండి కూడా దూరంగా ఉండవచ్చు.

బీపీ తగ్గించే బెస్ట్ మెడిసిన్

ఈ మధ్య కాలంలో బిపి సమస్యతో అనేక మంది బాధ పడుతున్నారు. అయితే మెడిసిన్ వాడటంలో చాలా మందికి సందేహాలు వస్తాయి. కాబట్టి ఏ మెడిసిన్ వాడితే మంచి ఫలితం వస్తుంది, ఎలా వాడాలి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

బిపి కోసం ఏ మెడిసిన్ వాడాలంటే

  • బిపి సమస్య ఉన్నవారు Thiazide Diuretics మెడిసిన్ వాడటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
  • ఈ గ్రూపులో Hydro Chlorothiazide, Clorthali-done అనే రెండు రకాల మెడిసిన్స్ ఉంటాయి.
  • ఈ టాబ్లెట్స్ని సాధారణంగా వేరే టాబ్లెట్ కాంబినేషన్తో కలిపి ఇస్తారు.
  • Telmisartan +H అని కలిపి ఇవ్వడం జరుగుతుంది.
  • Telmisartan 40mg, Almisartan – 20mg తీసుకుంటారు. (సమస్యని బట్టి డోస్ మారుస్తూ ఉంటారు)
  • ఈ టాబ్లెట్స్ వాడేవారికి కాళ్ళ వాపులు రాకుండా ఉంటాయి.
  • వీటిని ఎక్కువ కాలం వాడేవారికి ఒంట్లో క్యాల్షియం, సోడియం, పొటాషియం తగ్గడం పెరగడం ఉంటుంది.

బిపి సమస్య ఉన్నవారు ఎక్కువ కాలం టాబ్లెట్స్ వాడటం వలన సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తాయి. కాబట్టి మెడిసిన్
వాడేటప్పుడు ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలానే ఎక్కువ శాతం న్యాచురల్ ఫుడ్ తీసుకోవడం వలన దీనిని నియంత్రణలో ఉంచుకోవచ్చు.

High Protein Curry : మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ
మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ

How to Control Bp in Telugu – బీపీ ని తగ్గించే మోస్ట్ పవర్ ఫుల్ మెడిసిన్

బిపి సమస్య ఉన్నవారు ఎక్కువగా వాడే టాబ్లెట్స్ గురించి వాటి సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలిసిన విషయమే. అయితే కొన్ని సార్లు బిపి పెరిగినప్పుడు పవర్ ఫుల్ టాబ్లెట్స్ అరుదుగా వాడుతుంటారు అవి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

BP కి పవర్ ఫుల్ టాబ్లెట్

  • బిపి సమస్య ఉన్నవారికి Alpha blockers అనేవి అద్భుతంగా పని చేస్తాయి.
  • ఇవి పవర్ ఫుల్ టాబ్లెట్స్ అవ్వడం వలన ఇది వేసుకున్న వెంటనే కూర్చొని లేస్తేనే కళ్ళు తిరుగుతాయి.
  • ఏ టాబ్లెట్స్ వాడినా సమస్య తగ్గన్నప్పుడు మాత్రమే ఇది వాడుతారు.
  • మొదటి డోస్ లోనే కొంతమందికి హైపర్ టెన్షన్ వస్తుంది.

బిపి కంట్రోల్ లేనివారికి వచ్చే ఇతర జబ్బులు

  • కిడ్నీలు పాడైపోవడం
  • పక్షవాతం రావడం

How to Control Bp in Telugu – బిపి 40 సంవత్సరాలు ఉన్నవారికి కూడా వస్తుంది. ఇది వచ్చిన వారు ఎలాంటి టాబ్లెట్స్ తీసుకున్నా తగ్గని సమయంలో మాత్రమే వైద్యులని సంప్రదించి వీటిని వాడటం ఉత్తమం. దీనివలన సమస్యని త్వరగా కంట్రోల్ చేసుకోవచ్చు.

ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Deepu, I am the Writer and Founder of this blog and share all the information related to Blogging, SEO, Internet, Review, WordPress, Make Money Online, News and Technology through this website.

Sharing Is Caring:

Leave a Comment