Special Ponganalu : స్పెషల్ పొంగానాలు రెసిపీ
ఇవాళ్టి టాపిక్ లో Special Ponganalu : స్పెషల్ పొంగానాలు రెసిపీ గురించి తెలుసుకుందాం. దుంపలు తినడం ఆరోగ్యానికి హానికరమని అందరూ అనుకుంటారు. కానీ దుంపల్లో కూడా మంచి దుంపలు ఉంటాయి. క్యారెట్, బీట్ రూట్ లాంటివి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇలాంటి ఆరోగ్య కరమైన బీట్ రూట్‌తో పొంగనాలు చేస్తే ఎవరైనా ఇష్టంగా తినేస్తారు. అవి ఎలా చేయాలో చూద్దాం.
పొంగనాలు తయారీకి కావలసిన పదార్ధాలు
- అటుకులు – 1 కప్పు
- వేరుశనగ పప్పులు – 2 టేబుల్ స్పూన్లు
- పుల్ల పెరుగు – 1 కప్పు
- బీట్రూట్ తురుము – 1 కప్పు
- క్యారెట్ తురుము – 1/2 కప్పు
- పచ్చిమిరపకాయ ముక్కలు – 1 టేబుల్ స్పూన్
- అల్లం తురుము – 1 టేబుల్ స్పూన్
- మిరియాలు (ముక్క చెక్క) – 1 టీస్పూన్
- టమాటా ముక్కలు – 1/2 కప్పు
- మీ గడ – 1 టేబుల్ స్పూన్
- పుట్నాల పప్పు పొడి – 1/2 కప్పు
- పసుపు – కొద్దిగా
బీట్రూట్ పొంగనాలు తయారీ విధానం
- ముందుగా పుల్లటి పెరుగు గంటపాటు నానబెట్టిన అటుకులను ఒక బౌల్లోకి తీసుకోవాలి.
- వీటికి బీట్రూట్, క్యారెట్ తురుము యాడ్ చేయాలి.
- అలానే పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా వెయ్యాలి.
- తర్వాత అల్లము, మిరియాలు (ముక్కచెక్క) వేసి బాగా కలపాలి.
- వీటన్నిటిని పూర్తిగా కలిపిన తర్వాత వేరుశనగ పప్పులు (ముక్కచెక్క), పుట్నాల పప్పు పొడి, పసుపు, నిమ్మరసం కొద్దిగా కలిపి పిండి చేసుకోవాలి.
- పొయ్యి మీద నాన్ స్టిక్ గుంటల పాత్ర పెట్టి మీగడ రాయాలి.
- గుంటల పాన్‌లో బీట్రూట్ వుండలను పెట్టి సిమ్ కాల్చుకోవాలి.
- పొంగనాలు ఒక వైపు కాలిన తర్వాత మరో వైపు తిప్పి కాల్చుకుంటే రెడీ అయినట్టే.
డిన్నర్లో ఎప్పుడైనా టేస్టీగా తినాలని అనిపిచ్చినప్పుడు బీట్ రూట్‌తో ఇలా పొంగానాలు చేసుకొని తినడం మంచిది. ఇందులో నూనె వాడకపోవడం వలన వీటిని ఎవరైనా ఎన్నైనా తినవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.