కిరాణా షాపు కి టెక్నాలజీ ఇలా ఉపయోగించండి – kirana Shop Secrets in Telugu
ఇవ్వాల్టి టాపిక్ లో kirana Shop Secrets in Telugu గురించి తెలుసుకుందాం రండి.
ఈ రోజుల్లో టెక్నాలజీ మీద జనాలు ఎంతలా డిపెండ్ అయ్యారో తెలియని విషయం కాదు. బస్ బుక్ చేసుకోవాలన్నా, ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడానికైనా, మూవీస్ వెళ్ళడానికైనా ఇలా ప్రతి దానికి మనం టెక్నాలజీ యూస్ చేస్తున్నాం. అలానే మన చిన్న కిరాణ షాప్ లో కూడా టెక్నాలజీని యూస్ చేసుకోవచ్చు. అది కూడా లో కాస్ట్ టెక్నాలజీని యూస్ చేయొచ్చు అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ని చివరి వరకు చూడండి. మీరందరూ అనుకోవచ్చు కిరాణ షాప్ అనేది స్మాల్ బిజినెస్ కదా దానికి టెక్నాలజీ యూస్ చేయడం అవసరమా అని కానీ ఈ ఫాస్ట్ మూవింగ్ వరల్డ్ లో మనం కూడా అప్డేట్ అవ్వాలి కదా. ఏ రిటైల్ బిజినెస్ కైనా కాంపిటీషన్ ఉంటాది మరి మీ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలనుకుంటే కస్టమర్స్ అవసరాలను తీర్చడానికి వాళ్ళు కోరుకునే విధంగా మన షాప్ ఉండేలా చూసుకోవాలి. కాబట్టి కిరాణ షాప్ వాళ్ళు కూడా మోడ్రన్ రీటైల్ షాప్ వాళ్ళ పద్ధతులు కొన్ని పాటించాల్సి ఉంటాది. కిరాణ షాప్ లో టెక్నాలజీ యూస్ చేయడం వలన కస్టమర్ రిలేషన్ ని పెంచుకోవచ్చు. కాస్ట్ కంట్రోల్ చేసుకోవచ్చు సేల్స్ మరియు స్టాక్ డేటా ని ఎప్పటికప్పుడు అనాలసిస్ చేసుకోవచ్చు ఇంకా టైం మరియు డబ్బు ఆదా చేసుకోవచ్చు. ఇలా మీరు అనేక బెనిఫిట్స్ ని పొందొచ్చు. మీరు అనుకోవచ్చు ఇది చాలా డబ్బుతో కూడిన పని అని కానీ ఈ టెక్నాలజీని లో కాస్ట్ లో అయిపోయేలా చూడొచ్చు. కాబట్టి మేము ఇప్పుడు మీ కిరాణ షాప్ లకు అనుగుణంగా లో కాస్ట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ని మీకు చెప్పాలని అనుకుంటున్నాము అవేంటో చూద్దాం.
డిజిటల్ పేమెంట్స్
ఇప్పుడు ముందుగా డిజిటల్ పేమెంట్స్ గురించి తెలుసుకుందాం. కిరాణ షాప్ లో డిజిటల్ పేమెంట్స్ యూస్ చేయడం వలన కస్టమర్స్ ఈజీగా మనీ పే చేయొచ్చు. కోవిడ్ టైం లో షాప్స్ కి వెళ్ళినప్పుడు అందరూ మనీ యూస్ చేస్తూ పే చేయడం మానేశారు. అందరూ ఈ డిజిటల్ పేమెంట్స్ కి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఈ టెక్నాలజీ యూస్ చేస్తే మీ షాప్ కి ఎక్కువ కస్టమర్లు వచ్చే అవకాశం ఉంది. క్యూఆర్ కోడ్స్, యూపిఐ, డిజిటల్ వాలిడ్ ద్వారా కస్టమర్స్ ఈజీగా మనీ పే చేసేస్తారు. అలాగే ఈ డిజిటల్ పేమెంట్స్ వలన మనీ లెక్కపెట్టడం చిల్లర సమస్యలు కూడా తగ్గిపోతాయి.
స్టోర్ మేనేజ్మెంట్ యాప్
తర్వాత స్టోర్ మేనేజ్మెంట్ యాప్ గురించి తెలుసుకుందాము. ఈ కిరాణ షాప్ బిజినెస్ స్మూత్ గా జరగాలంటే ఒక స్టోర్ మేనేజ్మెంట్ యాప్ యూస్ చేయడం మంచిది. చాలా మంది కిరాణ షాప్ ఓనర్స్ వాళ్ళ కిరాణ స్టోర్ ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్ కి ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నారు. దీనివల్ల బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి వాళ్ళు టైం తీసుకోలేకపోతున్నారు. మాన్యువల్ గా స్టాక్ ని చూసుకోవడం బుక్ లేదా పేపర్ లో సేల్స్, డేటా ఎంట్రీ చేసుకోవడం స్టాఫ్ ని మేనేజ్ చేసుకోవడం వంటి పనులతో వాళ్ళు రోజు బిజీగా అయిపోతున్నారు. అదే ఒక స్టోర్ మేనేజ్మెంట్ యాప్ ని యూస్ చేస్తే కనుక కిరాణ షాప్ ఓనర్స్ వాళ్ళ టైం ని సేవ్ చేసుకోవచ్చు. ఈ స్టోర్ మేనేజ్మెంట్ యాప్ లు మనం స్మార్ట్ ఫోన్లతో యూస్ చేయొచ్చు నాకు తెలిసిన ఒక యాప్ ఉందండి అది ezo యాప్ ఈ యాప్ స్టాక్ ని ట్రాక్ చేయడం సేల్స్, లెక్కలు చూడడం స్టాఫ్ ని మేనేజ్ చేసుకోవడం వంటి పనులను ఆటోమేటిక్ గా చేసేస్తది. అంతేకాకుండా కిరాణ షాప్ బిజినెస్ గ్రోత్ అవ్వడానికి మరింత అంతర్దృష్టిని అందిస్తాది.
గూగుల్ బిజినెస్
ఇప్పుడు మనం google బిజినెస్ అకౌంట్ గురించి తెలుసుకుందాము. మీ కిరాణ షాప్ కి ఒక google అకౌంట్ క్రియేట్ చేసుకోండి అలా అకౌంట్ ఉండడం వల్ల ఎవరైనా ప్రొడక్ట్స్ లేదా గ్రోసరీస్ గురించి సెర్చ్ చేసినప్పుడు మీ లోకాలిటీలో ఉన్న మీ షాప్ google maps లో కనపడే ఛాన్స్ ఉంది. దీనివల్ల కస్టమర్ షాప్ ని కనుగొనడానికి కూడా ఈజీ అవుతాది. అంతేకాకుండా కిరాణ షాప్ ఓనర్స్ తమ google అకౌంట్ ప్రొఫైల్ లో స్టోర్ యొక్క టైమింగ్స్, కాంటాక్ట్ డీటెయిల్స్, లొకేషన్స్ స్టోర్ ఇమేజెస్ లాంటి ఇన్ఫర్మేషన్ ని పెట్టొచ్చు. ఈ బిజినెస్ అకౌంట్ లో కస్టమర్స్ మీకు రివ్యూస్ ఇవ్వచ్చు. కాబట్టి మీ ప్రొడక్ట్స్ లేదా మీ సర్వీస్ వాళ్ళకి నచ్చితే రివ్యూ ఇస్తారు. ఒకవేళ పాజిటివ్ రివ్యూ గనుక మీకు వస్తే మీ షాప్ కి కస్టమర్స్ పెరగొచ్చు. అలాగే రెప్యూటేషన్ కూడా పెరగొచ్చు. షాప్ ఓనర్స్ కూడా ఈ రివ్యూస్ అండ్ కామెంట్స్ కి రెస్పాండ్ అవ్వచ్చు. అప్పుడు కస్టమర్స్ ఫీడ్బ్యాక్ కి వాల్యూ ఇస్తున్నారని కొత్త కస్టమర్స్ కి అర్థమయ్యి మన షాప్ కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.
వాట్సాప్ బిజినెస్
తర్వాత whatsapp బిజినెస్ గురించి తెలుసుకుందాము. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. అందులో whatsapp కంపల్సరీ కాబట్టి మీరు దీని టెక్నాలజీ యూస్ చేస్తూ మీ షాప్ ని సేల్స్ పెంచొచ్చు ఎలా అంటే మీ లోకాలిటీలో ఉన్న వాళ్ళతో మరియు మీ షాప్ కి వచ్చే కస్టమర్స్ నంబర్స్ ని తీసుకుని ఒక whatsapp బిజినెస్ గ్రూప్ క్రియేట్ చేయండి. అందులో మీ షాప్ లో ఉన్న వస్తువుల గురించి సేల్స్ డిస్కౌంట్స్ గురించి పెడితే వాళ్ళకి అప్పుడు మీ షాప్ లో ఏమున్నాయో తెలుస్తాయి. ఒకవేళ వాళ్ళకి హోమ్ డెలివరీ కావాలి అంటే కూడా అందులో మిమ్మల్ని అడిగితే మీరు వాళ్ళకి ఆ ప్రొడక్ట్స్ హోమ్ డెలివరీ చేయొచ్చు ఇలా కూడా మీ సేల్స్ పెంచుకోవచ్చు. అలానే మీ కస్టమర్స్ కి ఏం కావాలన్నది మీరు ఎప్పుడు గుర్తుంచుకోవచ్చు. కాబట్టి అలాంటి షాప్ ఒకసారి ఈ టెక్నాలజీస్ ని మీరు మీ కిరాణ షాప్ లో యూస్ చేసి ఎలా బెనిఫిట్ పొందారో మాకు కామెంట్ లో చెప్పండి. తిరిగి మళ్ళీ నెక్స్ట్ టాపిక్ లో కలుద్దాం.