Kirana Shop Business in Telugu – కిరాణా స్టోర్ ఎలా పెట్టాలి
సొంతంగా మీరు బిజినెస్ చేయాలనుకుంటున్నారా? ఏ బిజినెస్ చేస్తే బాగుంటది అని అనుకుంటున్నారా? కాబట్టి అలాంటి వాళ్ళ కోసమే How to Start Kirana Shop Business in Telugu అండి.
కిరాణా షాపు బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి?
మేము ఇప్పుడు మీకు కిరాణ షాప్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి? ఆ కిరాణ షాప్ బిజినెస్ కి కావలసిన లైసెన్స్ ఏంటి, ఎంత ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేయొచ్చు ఇలాంటివన్నీ ఈరోజు మేము ఈ టాపిక్ లో చెప్పబోతున్నాము.
అసలు కిరాణ షాప్ అంటే మన ఇంట్లోకి కావలసిన వస్తువులు అంటే పప్పులు, బియ్యం, మసాలా, దినుసులు, సోప్స్, షాంపూస్, పాలు ఇలా అన్ని వస్తువులు దొరికే షాప్ కిరాణ షాప్. మనకి పొద్దున లేవగానే ఈ కిరాణ షాప్ అవసరం పడతాది. కాబట్టి ఈ కిరాణ షాప్ 365 డేస్ రన్నింగ్ అయ్యే బిజినెస్. ఈవెన్ మీరు చూసుకుంటే కోవిడ్ టైం లో అన్ని షాప్స్ క్లోజ్ చేసేసిన మనకి కిరాణ షాప్ సక్సెస్ ఫుల్ గా రన్ అయ్యేది. కాబట్టి కిరాణ షాప్ బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలనుకుంటే పెట్టుబడి ఫస్ట్ ప్రయారిటీ అన్నమాట. కిరాణ షాప్ తెరవడానికి 5 లక్షల నుంచి 25 లక్షల వరకు ఖర్చు అవుతాది. అంటే మీరు చిన్న స్ట్రీట్ లో స్టార్ట్ చేస్తే పెట్టుబడి తక్కువగా ఉంటాది. అలాగే ఒకవేళ పెద్ద షాప్ అంటే కమర్షియల్ ప్లేస్ లో పెడితే ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి ఉంటాది. కాబట్టి మీకు గవర్నమెంట్ తరపు నుంచి లోన్స్ కూడా వస్తాయి అవి యూస్ చేసుకుని మీరు కిరాణ షాప్ స్టార్ట్ చేయొచ్చు. ఈ బిజినెస్ చిన్న షాప్ లో పెట్టిన మంచి బిజినెస్ ఏ చేసుకోవచ్చు. ఆ చిన్న రీటైల్ షాప్ ని మీరు తర్వాత తర్వాత హోల్సేల్ బిజినెస్ గా కూడా చేసుకోవచ్చు.
కిరాణ షాప్ బిజినెస్ రకాలు
కాబట్టి ఈ కిరాణ షాప్ బిజినెస్ రెండు రకాలుగా చేసుకోవచ్చు, అదే హోల్సేల్ అండ్ రీటేల్. ఇప్పుడు తక్కువ పెట్టుబడితో రీటేల్ షాప్ తెరవడానికి ఏం చేయాలో తెలుసుకోండి. ఏ బిజినెస్ కైనా లొకేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. అదే కిరాణ షాప్ వాళ్ళకైతే మరింత ఇంపార్టెంట్. కాబట్టి మీరు మీ షాప్ మంచి మార్కెట్ ప్లేస్ లో ఉండేలా చూసుకోవాలి. ఇంకా కిరాణ షాప్ మంచి ప్లేస్ లో ఓపెన్ చేశాక దానికి మీరు ఎంతవరకు ఖర్చు పెట్టొచ్చు అంటే ఐదు లక్షల నుంచి 10 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. క్లాస్ రాక్స్ పెట్టించడానికి కిరాణా సరుకుల్ని హోల్సేలర్స్ దగ్గర నుంచి తెచ్చుకోవడానికి లోన్స్ కి అలా కొంచెం పెట్టుబడి పెట్టాల్సి ఉంటాది. ఒకవేళ మీ దగ్గర అంత డబ్బు లేకపోతే ఒక చిన్న బడ్డి కొట్టులా కూడా పెట్టుకోవచ్చు.
కిరాణ షాప్ పెట్టడానికి పర్మిషన్స్
ఇప్పుడు కిరాణ షాప్ కి ఎలాంటి పర్మిషన్స్ కావాలో తెలుసుకోండి. మొదటిది ట్రేడ్ లైసెన్స్ కిరాణ దుకానాలు వ్యాపారం చేయడానికి మున్సిపల్ కార్పొరేషన్ నుండి ట్రేడ్ లైసెన్స్ పొందాలి. రెండవది షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్. ఇది షాప్ పని గంటలు జీతాలు సంబంధించినది. మూడవది జిఎస్టి రిజిస్ట్రేషన్ 40 లక్షల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న ఏ వ్యాపారినికైనా ఇది అవసరం. నాలుగవది ఎంఎస్ఎంఈ లేదా ఉద్యోగాధార రిజిస్ట్రేషన్ చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు ప్రభుత్వం నుండి పథకాలు మరియు సబ్సిడీలను పొందడానికి సహాయపడుతుంది.
షాపు ఇంటీరియర్
ఇప్పుడు షాప్ ఇంటీరియర్ గురించి మాట్లాడుకుందాం. మీ కిరాణ షాప్ కి మంచి కలర్స్ తో పెయింట్ వేయించాలి. వాటి వల్ల మన దగ్గర ఉన్న సరుకులు కస్టమర్ కి కనపడడానికి దాంతో పాటు మంచిగా రాక్స్ చేయించాలి. స్టాక్స్ సర్దుకునే విధంగా మనకి ఎలాంటి సైజెస్ లో రాక్స్ కావాలో చూసుకుని చేయించుకోవాలి. గ్లాస్ లేదా చెక్క లేదా ఐరన్ తో రాక్స్ చేయించుకోవచ్చు. అలాగే ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ ని పెట్టుకోవాలి. దీనివల్ల మీరు ఈజీగా అండ్ ఫాస్ట్ గా వెయిట్స్ ని చెక్ చేయొచ్చు. ఇంకా చైర్ డెస్క్ టేబుల్ చిప్స్ ప్యాకెట్స్ అవి వేలాడి తీయడానికి హ్యాంగర్స్ లాంటివి కూడా కావాలి. అలాగే మీ షాప్ కి బయట బోర్డు ఉండాలి అంతేకాకుండా ఆ బోర్డు మీద మీ పేరుతో పాటు మీ ఫోన్ నెంబర్ ఏమేమి సరుకులు దొరుకుతాయో తెలిసే విధంగా ఫోటోస్ అలాగే ఏమైనా మీరు జిపే యాక్సెప్ట్ చేస్తే జిపే ఫోన్ పే కార్డ్స్ యాక్సెప్ట్ చేస్తున్నట్టు వాటి నెంబర్ కూడా ఆ బోర్డు పైన మెన్షన్ చేయాలి. అలాగే మీ షాప్ కి వచ్చే కస్టమర్స్ కి షాపింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి. అంటే వాళ్ళకి బయట పార్కింగ్ ఉండాలి. వాళ్ళకి నుంచోవడానికి వీలుగా ఉండేలా చూసుకోవాలి.
కిరాణ షాప్ సరుకులు
ఇంకా మెయిన్ గా కిరాణ షాప్ కి కావలసిన సరుకులు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో తెలుసుకోండి. పప్పులు, పంచదార, మసాలాలు ఇలాంటివి మీరు డైరెక్ట్ గా హోల్సేలర్స్ దగ్గర నుంచి తీసుకోవాలి. వాళ్ళు బల్క్ అమౌంట్ లో బస్తాల్లో ఇస్తారు ఇంకా షాంపూ, సోప్స్ లాంటి మీ దగ్గరలో ఉన్న డీలర్స్ దగ్గర నుంచి తీసుకోవాలి. కాబట్టి మీరు చిన్న వస్తువు నుంచి పెద్ద బస్తాల వరకు కస్టమర్ ఏం అడిగినా ఇచ్చేలా ఉండాలి. హోల్సేల్ కిరాణ షాప్ వాళ్ళు అలాగే రీటైల్ షాప్ వాళ్ళు కూడా ఏ వస్తువు అడిగినా ఇచ్చేలా ఉండాలి. కాబట్టి మీరు కస్టమర్ ఏం అడిగినా లేదు అనేలా ఉండాలి. ఎందుకంటే ఒకసారి వచ్చిన కస్టమర్ కి లేదు ఆ వస్తువు అంటే రెండోసారి మళ్ళీ అతను మన షాప్ కి రాడు. కావున అందుకే జాగ్రత్తగా అన్ని సరుకులు తెచ్చుకుని అమ్మాలి. అందుకే ఇప్పుడు కిరణ షాప్స్ కి కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది. సూపర్ మార్కెట్స్ హైపర్ మార్కెట్స్ లాంటి షాప్స్ బయట చాలా వచ్చేసాయి. అక్కడ కూడా తక్కువ క్వాంటిటీస్ లో సరుకుని అమ్మేస్తున్నారు. కాబట్టి దీనివల్ల చిన్న కిరాణ షాప్స్ కి కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది. అందుకనే మీరు కిరాణ షాప్ ని బాగా మార్కెటింగ్ చేయాలి ఎలా అంటే కస్టమర్స్ తో రిలేషన్ ని ఏర్పరచుకుంటూ మీ సరుకుల్ ని కస్టమర్స్ కి మంచిగా కనపడే విధంగా నీట్ గా ఆర్గనైజ్ చేసుకుంటూ షాప్ ని నీట్ గా డెకరేట్ చేసుకుంటూ లోకల్ సప్లయర్స్ తో పార్ట్నర్షిప్ చేసుకుంటూ ఇలా కొన్ని మార్కెటింగ్ స్ట్రాటజీస్ యూస్ చేస్తూ మీ షాప్ కి సేల్స్ పెంచుకోవచ్చు. మీకు మార్కెటింగ్ స్ట్రాటజీస్ గురించి వివరంగా తెలుసుకోవాలంటే క్రింద లింక్ ప్రొవైడ్ చేశాం. అది చూసి స్ట్రాటజీస్ గురించి తెలుసుకోండి.
కాబట్టి ఫైనల్లీ ఒకవేళ మీరు రిటైల్ కిరాణ షాప్ పెట్టాలి అనుకుంటే ఒక రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు అవ్వచ్చు. ఇంకా లేదా హోల్సేల్ గా పెట్టాలి అనుకుంటే 20 లక్షల వరకు అవ్వచ్చు. కాబట్టి మీకు ఈ ఆర్టికల్ గనుక నచ్చినట్లైతే లైక్ చేయండి షేర్ చేయండి. తిరిగి మళ్ళీ నెక్స్ట్ టాపిక్ లో కలుద్దాం..
3 thoughts on “కిరాణా షాపు ఎలా మొదులు పెట్టాలి | How to Start Kirana Shop Business in Telugu”