Healthy Teeth : దంతాల ఆరోగ్యానికి పెంచుకోవడం ఎలా
ఇవాళ్టి టాపిక్ లో Healthy Teeth : దంతాల ఆరోగ్యానికి పెంచుకోవడం ఎలా గురించి తెలుసుకుందాం. చాలా మంది పైకి అందంగా ఆరోగ్యంగా కనిపిస్తారు కాని నోటి లోపల చూస్తే మాత్రం పళ్ళు పుచ్చిపోవడం, చిగురు ఇన్ఫెక్షన్స్ లాంటి సమస్యలతో బాధపడటం గమనించవచ్చు. పళ్ళు పుచ్చిపోయి తీపించుకునే పరిస్థితి రాకుముందే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
దంత సంరక్షణకి ఈ జాగ్రత్తలు తప్పనిసరి
- ఏ ఆహారం తీసుకున్నా సరే తిన్న తర్వాత నీళ్ళతో పుక్కిలించడం మంచిది.
- వీలైనంత వరకు సాఫ్ట్ బ్రష్ తో పళ్ళు తోముకోవడం మంచిది.
- కుదిరితే అల్ట్రా సాఫ్ట్ బ్రష్ కూడా ఉపయోగించుకోవచ్చు.
- దంతాలు ఎలా పడితే అలా కాకుండా పై నుండి క్రిందకి లేదా క్రింద నుండి పైకి బ్రషింగ్ చేయడం మంచిది.
- ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు ఖచ్చితంగా బ్రష్ చేయాలి దీని వలన దంతాలు క్లీన్ గా ఉంటాయి.
- బ్రష్ చేసే సమయం రెండు నిమిషాలు కంటే ఎక్కువ సేపు చేయకుండా ఉంటే ఎనామిల్ దెబ్బ తినకుండా ఉంటుంది.
- చిన్నపిల్లలకి ఈ జాగ్రత్తలు చెప్పడంతో పాటు వారితో ప్రాక్టిస్ చేపించాలి.
దంతాలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఎలాంటి ఆహారమైన నమిలి తినగలుగుతాం. అదేవిధంగా సమస్య రాక ముందే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వీటి వలన మన దంతాల ఆయుష్షుని 20 సంవత్సరాలు పెంచుకోవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.