Saline Bottle Telugu : సెలైన్ పెట్టించుకుంటే బలం వస్తుందా
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Saline Bottle Telugu : సెలైన్ పెట్టించుకుంటే బలం వస్తుందా గురుంచి తెలుసుకుందాం రండి. శరీరానికి విపరీతమైన నీరసంగా ఉన్నప్పుడు కళ్ళు తిరగడం లాంటి పరిస్థితుల్లో అవసరం మేరకు వైద్యులు పెట్టడం జరుగుతుంది. ఇది పెట్టగానే పేషంట్ కి ఎదో తెలియని ఉత్సాహం వస్తుంది. అది ఎందుకో తెలియాలంటే పూర్తిగా చర్చించాల్సిందే.
సెలైన్ ఎప్పుడు వాడటం మంచిది
- సెలైన్ అంటే ఉప్పు నీళ్ళుగా కూడా పిలుస్తారు.
- వాంతులు, విరోచనాలు విపరీతంగా అవుతుంటే సెలైన్ పెట్టించుకోవడం మంచిది.
- నోటి ద్వారా ఏది తిన్నా, త్రాగినా బయటకి వస్తుంటే సెలైన్ అద్భుతంగా పనిచేస్తుంది.
- వడదెబ్బ తగిలినవారికి ఇది ప్రాణాలు కాపాడుతుంది.
- లీటర్ మంచినీళ్ళు ఆపకుండా త్రాగగలిగే వారికి సెలైన్ అవసరం లేదు.
- అవసరం లేని సమయంలో కూడా దీన్ని పెట్టించుకోవడం వలన శరీరం లోపలికి బ్యాక్టీరియా వెళ్ళే అవకాశం ఉంది.
సెలైన్ బదులుగా ఏది త్రాగడం మంచిది?
- ఉప్పు కలిపిన మజ్జిగ
- Electral Water
- కొబ్బరి నీళ్ళు
కొంతమందికి నీరసంగా ఉన్నప్పుడు సెలైన్ పెట్టించుకుంటేనే ఎనర్జీ వస్తుందని మానసికంగా భావిస్తారు. అలాంటి వారు ఈ సారి సెలైన్ బదులుగా వీటిని త్రాగడం వలన సమస్యని సులువుగా పరిష్కరించుకోవచ్చు.
నీరసం, వడదెబ్బ తగ్గడానికి బెస్ట్ సొల్యూషన్
నీరసం ఉన్నప్పుడు, వాంతులు అవుతున్నప్పుడు ఎక్కువగా సెలైన్ పెట్టడం జరుగుతుంది. అయితే ఇవి ఎన్ని రకాలు
ఉంటాయి వీటిని పెట్టడం వలన ఎలాంటి లాభాలు వస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
- శరీరంలో నీరసం ఉండి గ్లూకోజ్ తగ్గుతున్నవారికి ఇది ఇస్తారు.
- సెలైన్ బాటిల్స్ ఇష్టం వచ్చినట్టుగా అవసరం లేకపోయినా పెట్టించుకోకూడదు.
- అరలీటర్ మంచి నీళ్ళు ఆపకుండా త్రాగేవారికి దీని అవసరం ఉండదు.
- బిపి డౌన్ అయిన వారికి, విపరీతమైన పొట్ట నొప్పి వచ్చినవారికి అవసరం ఉంటుంది.
- వడదెబ్బ తగిలనవారికి సెలైన్ పెట్టుకోవాల్సి ఉంటుంది.
సెలైన్ బాటిల్స్ ఎన్ని రకాలు
- ఉప్పు కలిపిన సెలైన్ (NS)
- పంచదార కలిపిన సెలైన్ (5% Dextrose)
- పంచదార మరియు ఉప్పు కలిపిన సెలైన్ (DNS)
- నార్మల్ దాంట్లో పొటాషియం కలిపిన సెలైన్ (Ringer’s lactate)
సెలైన్ ఖచ్చితంగా కావాల్సినవారు మాత్రమే ఇది పెట్టించుకోవడం మంచిది. దీని అవసరం లేని వారు పెట్టించుకోవడం వలన చర్మం లోపలకి ఇన్ఫెక్షన్స్ వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి దీనిని అవసరం మేరకు ఉపయోగించుకోవడం ఉత్తమం. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.