బెస్ట్ బిజినెస్ ట్రిక్స్ – Kirana Shop Business in Telugu
ఇవాళ్టి టాపిక్ లో Kirana Shop Business in Telugu గురించి తెలుసుకుందాం రండి.
కిరాణ షాప్ వాళ్ళు డిజిటల్ కిరాణ షాప్ వాళ్ళతో కాంపిటీషన్ కి భయపడుతున్నారు. ఈ కిరాణ షాప్ సక్సెస్ అవ్వటానికి కస్టమర్స్ ని ఎలా తెచ్చుకోవాలో అలానే వాళ్ళని డైలీ కస్టమర్స్ గా మార్చడానికి మా దగ్గర కొన్ని మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలంటే ఇప్పుడే మీరు మా టెలిగ్రాం ఛానల్ ని ఫాలో చేసుకోండి. అలాగే కింద ఉన్న WhatsApp channel ని ఫాలో చేయండి. కిరాణ షాప్ స్టార్ట్ చేయడం అనేది చిన్న బిజినెస్ లా అనిపిస్తాది కానీ ఆ చిన్న బిజినెస్ సక్సెస్ అవ్వడానికి మనం చాలా హార్డ్ వర్క్ చేయాలి. చాలా మంది ఏమనుకుంటారంటే కిరాణ వస్తువులు అందరికీ అవసరమే కదా కాబట్టి దీనికి మార్కెటింగ్ అవసరం లేదు అని అనుకుంటారు. అలానే మీ బిజినెస్ కి బయట పెద్ద కాంపిటీషన్ ఉండదు అని అనుకుంటారు. కానీ మీకు కాంపిటీషన్ ఉంటది అందుకనే మీ కిరాణ షాప్ సక్సెస్ అవ్వటానికి అలాగే సేల్స్ పెరగడానికి కొన్ని స్ట్రాటజీస్ ఫాలో అవ్వడం కంపల్సరీ. దాని కోసం కొన్ని టిప్స్ చెప్పాలని అనుకుంటున్నాము అవేంటో చూద్దాం.
టిప్ 1
కస్టమర్స్ తో రిలేషన్షిప్ ఏర్పరచుకోండి. మీరు మీ ప్రతి కస్టమర్ ను నవ్వుతూ పలకరించండి. అలాగే వాళ్ళకి కావలసిన వస్తువులను ఏంటో తెలుసుకొని వాళ్ళకి అనుగుణంగా ఉండాలి. ఇలా చేయడం వల్ల సేల్స్ పెరగడమే కాకుండా మీకు కస్టమర్స్ తో మంచి రిలేషన్ బిల్డ్ అవుతాది. మీ కస్టమర్ల పేరును మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అప్పుడు మీరు వాళ్ళని మీరు పేరు పెట్టి పిలవడంతో వాళ్ళకి ఒక రిలేషన్ ఫీలింగ్ వస్తాది. అంతేకాకుండా తరచుగా వాళ్ళని ఫీడ్బ్యాక్ అడుగుతూ వాళ్ళకి కావలసిన వస్తువులను తెలుసుకోవడం వలన వాళ్ళు మీ కిరాణ షాప్ కి రెగ్యులర్ కస్టమర్స్ అవుతారు. ఇలా చేయడం వల్ల వాళ్ళకి మన షాప్ మీద నమ్మకం వచ్చి పబ్లిసిటీ కూడా చేస్తారు. కస్టమర్ సర్వీస్ అందించడం రిలేషన్ బిల్డ్ చేసుకోవడం వలన మీ లోకాలిటీలో షాప్ ని అందరూ ఇష్టపడతారు. అలాగే రెగ్యులర్ కస్టమర్స్ ని నిలుపుకుంటూ కొత్త కస్టమర్స్ ని అట్రాక్ట్ చేస్తారు.
టిప్ 2
మీ దగ్గర ఉన్న వస్తువుల్ని డిస్ప్లే లో పెట్టండి. ఈ రోజుల్లో అందరూ డిజిటల్ షాపింగ్ ఏ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి అక్కడ అన్ని వస్తువులు దొరికేస్తున్నాయి. ఈ కారణంగా వాళ్ళ లొకాలిటీలో ఉన్న చిన్న కిరాణ షాప్స్ కి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. ఇది మీరు తెలుసుకుంటే మీ షాప్ కి కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయొచ్చు. ఎలా అంటే మీ షాప్ లో కస్టమర్స్ కి కావలసిన వస్తువులు ఉన్నాయని తెలియజేయండి అంటే వాటిని బయటకు కనపడేలాగా మీ రాక్స్ లో డిస్ప్లే చేయండి. అలానే ఫ్రెష్ గా ఉండే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కూడా బయట డిస్ప్లే చేయండి ఇలా డిస్ప్లే చేయడం వలన మీ స్టోర్ లో ఉన్న క్వాలిటీ మరియు వెరైటీ వస్తువుల్ని చూపిస్తుంది. అంతేకాకుండా వాళ్ళు మీ స్టోర్ కి వచ్చేలా చేస్తుంది ఈ మార్కెటింగ్ స్ట్రాటజీ యూస్ చేస్తూ మీరు డిస్కౌంట్స్ ఆఫర్స్ ను హైలైట్ చేస్తూ డిస్ప్లే లో పెట్టొచ్చు. ఈ విధంగా చేయడం వలన మీ లొకాలిటీలో ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి తెలుస్తూ మీ షాప్ ని పబ్లిసిటీ చేస్తారు.
టిప్ 3
స్మార్ట్ వర్క్ చేయండి మీ బిజినెస్ ఏదైనా సక్సెస్ అవ్వాలంటే హార్డ్ వర్క్ ఒకటే చేస్తే సరిపోదు స్మార్ట్ వర్క్ కూడా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ షాప్ కి ఒక కస్టమర్ బ్రెడ్ కొనటానికి వచ్చాడు అనుకోండి. తను బ్రెడ్ అడిగినప్పుడు మీరు వాటితో పాటు జామ్ ఎగ్స్ బటర్ ఏమైనా కావాలా అని అడగాలి. అలాగే ఏమైనా వెజిటేబుల్స్ తీసుకుంటే లాస్ట్ లో కొత్తిమీర కావాలా కరివేపాకు కావాలా అని అడగాలి. ఇలా అడగడం వలన వాళ్ళకి మనం వేరే వస్తువులను రిమైండ్ చేసినట్టు ఉంటది వాళ్ళకి షాపింగ్ ఈజీ అవుతాది మనకి సేల్స్ పెరుగుతాయి. అంతేకాకుండా మీ షాప్ లో నుంచి ఎక్కువ ప్రొడక్ట్స్ అమ్ముడు అవుతాయి.
టిప్ 4
లోకల్ సప్లయర్స్ తో పార్ట్నర్షిప్ చేయండి. ఇప్పుడు ఎక్కువగా అందరూ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఏ ఎక్కువ ఇష్టపడుతున్నారు అందుకే మీరు లోకల్ సప్లయర్స్ తో పార్ట్నర్షిప్ చేయండి దానివల్ల మీకు ఆర్గానిక్ అండ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ లభిస్తాయి. మీ షాప్ కి కస్టమర్స్ ని పెంచడానికి ఇది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ. మీ లోకల్ లో ఉన్న సప్లయర్స్ దగ్గర నుంచి వస్తువులు లేదా వెజిటేబుల్స్ లేదా ఫ్రూట్స్ వంటివి తీసుకొని అవి మీరు మీ షాప్ లో డిస్ప్లే చేయండి. మీ లోకల్ లో ఉన్న ఉండే వేరే షాప్ లో అవి దొరకవు ఓన్లీ మీ షాప్ లోనే దొరుకుతాయి అనేలా మీరు సేల్ చేయాలి. దీనివల్ల మీ షాప్ లోకాలిటీలో యూనిక్ సెల్లింగ్ పాయింట్ గా ఉంటాది వాటి క్వాలిటీ నచ్చి కస్టమర్స్ మళ్ళీ మీ షాప్ కి తిరిగి వస్తారు. మీకు దీని గురించి ఇంకా తెలియాలంటే డిస్క్రిప్షన్ లో లోకల్ సప్లయర్స్ తో పార్ట్నర్షిప్ ఎలా చేయొచ్చో చెప్పాము అది మీరు చూడొచ్చు.
టిప్ 5
షాప్ డెకరేషన్ మీ షాప్ మార్కెటింగ్ చేసుకోవడానికి ఇంకొక ఛాన్స్ ఉంది, అదే మీ షాప్. డెకరేషన్ మీ కిరాణ షాప్ ఎప్పుడు నీట్ గా ఆర్గనైజ్ చేసి ఉండాలి. వైట్ కలర్స్ యూస్ చేయాలి మీ షాప్ ఎక్కడ నుంచైనా కనపడేలా లైటింగ్స్ వాడాలి. అలాగే వస్తువులు కనపడేలా కూడా రాక్స్ కి లైటింగ్ వాడితే మంచిది. మీ కిరాణ షాప్ కి నేమ్ బోర్డ్ ఉండాలి. దాని మీద ఫోన్ నెంబర్ ఏమైనా కార్డ్స్ యాక్సెప్ట్ చేస్తే వాటి డీటెయిల్స్ బోర్డు మీద ఉండాలి. అంటే డెబిట్ కార్డ్, google పే, ఆర్ ఫోన్ పే. బయట ఒక బోర్డు పెట్టాలి దాని మీద ఎప్పుడు ఏం సేల్స్ అవుతున్నాయో డిస్కౌంట్స్ ఉన్నాయో లేదా సీజనల్ పరంగా మీ షాప్ లో ఏమేమి ఉన్నాయో ఆ బోర్డు మీద చెప్పాలి. అలా చేయడం వలన కస్టమర్స్ కి ఈజీగా మీ షాప్ లోని వస్తువుల గురించి అర్థమయ్యి వాళ్ళు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ మార్కెటింగ్ టిప్స్ మీ షాప్ సక్సెస్ అవ్వడానికి యూస్ అవుతాయని భావిస్తున్నాం.
మీకు మరిన్ని టిప్స్ తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. తిరిగి మళ్ళీ నెక్స్ట్ టాపిక్ లో కలుద్దాం..