Weight Loss Salad : బరువు తగ్గడానికి బెస్ట్ సలాడ్
ఇవాళ్టి టాపిక్ లో Weight Loss Salad : బరువు తగ్గడానికి బెస్ట్ సలాడ్ గురించి తెలుసుకుందాం. ఒబెసిటి తగ్గించడానికి, కొవ్వు కరగడానికి రాజ్మా గింజలు బాగా ఉపయోగపడతాయి. వీటిల్లో హై ప్రోటీన్, లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇలాంటి లాభాలు ఇచ్చే రాజ్మా గింజలతో సలాడ్ ఎలా చేసుకోవాలో చూద్దాం.
తయారీకి కావలసిన పదార్ధాలు
- రాజ్మా గింజలు – 250 గ్రా
- క్యాప్సికం ముక్కలు – 1/2 కప్పు
- క్యారెట్ ముక్కలు – 1/2 కప్పు
- క్యాబేజీ ముక్కలు – 1/2 కప్పు
- టమాటా ముక్కలు – 1/2 కప్పు
- పుల్ల మజ్జిగ – 1 కప్పు
- నిమ్మరసం – 1 టేబుల్ స్పూన్
- మిరియాలపొడి – 1 టీ స్పూన్
- జీలకర్ర పొడి – 1టీ స్పూన్
- చాట్ మసాలా – కొద్దిగా
రాజ్మా సలాడ్ తయారీ విధానం
- చిన్న సైజ్ ప్రెజర్ కుక్కర్ తీసుకోని స్టవ్ మీద పెట్టి 12 గంటలు నానిన రాజ్మా గింజలు పోయాలి.
- పుల్ల మజ్జిగ పోసి మూత పెట్టి ఉడికించాలి.
- కుక్కర్లో ఉడికించి ప్రక్కన పెట్టుకోవాలి.
- మరొక బౌల్ తీసుకుని క్యాబేజీ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, టమాటా ముక్కలు వెయ్యాలి.
- అలానే నిమ్మరసం, చాట్ మసాలా, మిరియాల పొడి, జీలకర్ర పొడి పోసి, ఉడికిన రాజ్మా గింజలు దీంట్లో వేయాలి.
- చివరిగా కొత్తిమీర వేసి కలిపితే సరిపోతుంది.
లాభాలు
- బీపీ తగ్గుతుంది
- షుగర్ తగ్గుతుంది
- హై ప్రోటీన్ ఉంటుంది.
- అధిక బరువు తగ్గుతారు.
సలాడ్స్ తినడం వలన ఒబెసిటీ, డయాబెటిస్ సమస్యలు త్వరగా తగ్గుతాయి. ఇలా రాజ్మాతో చేసిన సలాడ్ ప్రతిరోజూ లంచ్ కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.