బిజినెస్: Summer Special High Profitable Business Ideas
ఇవాళ్టి టాపిక్ లో సమ్మర్ బిజినెస్ ఐడియాస్ – Top Summer Business Ideas Telugu గురించి తెలుసుకుందాం రండి.
వేసవి కాలం వచ్చేసింది ఇప్పటికే సూర్యుడు తన ప్రభావం చూపించడం మొదలు పెట్టాడు. అయితే ఈ హాట్ సమ్మర్ లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఇచ్చే బిజినెస్ చాలానే ఉన్నాయి. వేసవి రాగానే చాలా మంది వ్యాపారస్తులు లాభం చేకూర్చే బిజినెస్ ల కోసం వెతుకుతారు. ఎందుకంటే వేసవి అందరికీ సరదాగా ఆనందంగా ఉండే సమయం అందుకే మేము ఈ ఆర్టికల్ లో సమ్మర్ లో చేయగలిగే బిజినెస్ ఐడియాస్ షేర్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం.
ఈ టాపిక్ లో మేము మంచి సమ్మర్ బిజినెస్ ఐడియాలను చెప్పాలనుకుంటున్నాము. ఆ బిజినెస్ ని మీరు వెంటనే మొదలు పెట్టొచ్చు కూడా. మీరు కూడా వేసవిలో కాస్త ఎక్కువ డబ్బు సంపాదించాలనుకుంటున్నారా అయితే మీరు సరైన చోటికి వచ్చారు. అవుట్ డోర్ యాక్టివిటీస్ నుంచి సీజనల్ ప్రొడక్ట్స్ దాకా బయట మనకి ఎక్స్ప్లోర్ చేయడానికి బోల్డ్ అని ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ ఆర్టికల్ ఎక్కడా మిస్ చేయకుండా చివరి వరకు చదవండి. అలాగే ఎవరైతే వేసవిలో బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ ఆర్టికల్ షేర్ చేయండి.
బటర్ మిల్క్ బిజినెస్
మొదటిది బటర్ మిల్క్ బిజినెస్ వేసవి సీజన్ లో మజ్జిగ నిమ్మరసం మరియు లస్సీ వ్యాపారం చాలా మంచి బిజినెస్. నెలకు సుమారు 10000 నుంచి 20,000 వరకు లాభం చేయొచ్చు. ఈ సమ్మర్ సీజన్ లో మజ్జిగ నిమ్మరసం మరియు లస్సీ తాగడం అందరికీ ఇష్టం. ఈ డ్రింక్స్ చల్లగా ఉండడం వల్ల ఎండాకాలంలో వీటికి డిమాండ్ ఎక్కువ. మజ్జిగ మరియు లస్సీ మన జీర్ణక్రియను బాగా చేస్తాయి. నిమ్మరిసంలో మంచి విటమిన్ సి ఉంటాది. అందువల్ల ఈ డ్రింక్స్ ని అందరూ ఇష్టపడతారు. ఈ వ్యాపారం నుండి మీరు బాగా సంపాదించవచ్చు మంచి ప్లేస్ సరుకులు మరియు సామాగ్రితో మొదలుపెట్టి కొత్త రుచులు మరియు ప్యాకేజింగ్ తో మార్కెట్లో ప్రత్యేకత సాధించొచ్చు. మంచి నాణ్యతతో మంచి మార్కెటింగ్ తో చేస్తే ఈ వ్యాపారం మంచి ఆదాయం ఇస్తుంది. మీకు మీకు ఏమైనా చిన్న షాప్స్ ఉంటే బయట అక్కడ ఒక స్టాల్ పెట్టి కూడా అమ్మొచ్చు లేదా ఇంటి దగ్గరే కూడా ఒక స్టాల్ అరేంజ్ చేసుకుని అమ్మొచ్చు. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే స్టార్ట్ చేసేయండి.
ఫ్రూట్ జ్యూస్ బిజినెస్
రెండోది ఫ్రూట్ జ్యూస్ బిజినెస్ వేసవిలో ఫ్రూట్ జ్యూస్ బిజినెస్ చాలా మంచి బిజినెస్. ఇది మీరు ఒకటి నుంచి రెండు లక్షలతో స్టార్ట్ చేయొచ్చు లాభం అయితే 50000 నుంచి 60000 వరకు సంపాదించొచ్చు లేదా లక్షల్లో కూడా రావచ్చు. వేడి కాలంలో లో జనాలు శీతల తాజా ఆరోగ్యకరమైన లిక్విడ్స్ కోసం చూస్తారు. ఫ్రూట్ జ్యూస్ ల డిమాండ్ వేసవిలో ఎక్కువ ఉంటాది ఎందుకంటే వేసవిలో అందరూ హైడ్రేట్ గా ఉండాలి కాబట్టి ఎక్కువ జనాలు లిక్విడ్స్ తాగడానికి ఇష్టపడతారు. అందుకే నారింజా, మామిడికాయ, అనాస, ఆపిల్, మ్యాంగో వంటి వివిధ రకాల ఫ్రూట్ జ్యూస్ లను అందించడం ద్వారా మీరు మంచి లాభాలను పొందొచ్చు. ఈ జ్యూస్ లు టేస్టీగా ఉంటాయి మరియు వేడి నుంచి ఉపసమనం ఇవ్వగలవు.
షుగర్ కేన్ జ్యూస్ బిజినెస్
మూడోది షుగర్ కేన్ జ్యూస్ సమ్మర్ లో వేడిని తట్టుకోవడానికి జనాలు ఎక్కువగా షుగర్ కేన్ జ్యూస్ తాగడానికి ఇష్టపడతారు. అందుకే వేసవి కాలంలో చెరుకు రసం వ్యాపారం ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పొచ్చు. చెరుకు రసం యొక్క సహజ తీపి మరియు శీతలకరమైన లక్షణాల వలన ఎండాకాలంలో కస్టమర్స్ ఎక్కువగా షుగర్ కేన్ జ్యూస్ తాగడానికి ఇష్టపడతారు. షుగర్ కేన్ జ్యూస్ తాగడం వలన మనం డీహైడ్రేట్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు ఈ వ్యాపారం ఇప్పుడు ప్రతి స్ట్రీట్ లోనూ కనబడుతుంది. ఎందుకంటే ఇది తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టవచ్చు అలాగే రోజుకి 3000 నుంచి 5000 వరకు సంపాదించొచ్చు మరియు చెరుకు రసం యొక్క డిమాండ్ వేసవి సీజన్ లో చాలా ఎక్కువ ఉంటాది. కాబట్టి మీరు మరింత లాభం పొందే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వెంటనే ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసేయండి.
ఐస్ క్రీమ్ బిజినెస్
నాలుగోది ఐస్ క్రీమ్ బిజినెస్ వేసవిలో ఐస్ క్రీమ్ వ్యాపారం బెస్ట్ ఆప్షన్ మీరు నెలకి 30000 నుంచి 50000 వరకు సంపాదించొచ్చు. ఐస్ క్రీమ్ అనేది ఏడాది పొడవున అమ్మబడే డెసర్ట్ కానీ దీని డిమాండ్ వేసవి సమయంలో ఎక్కువ ఉంటుంది. వేసవిలో ఐస్ క్రీమ్ వ్యాపారాన్ని ప్రారంభించడం వలన ఎక్కువ లాభాలను పొందొచ్చు. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీకు మినిమమ్ ఇన్వెస్ట్మెంట్ తో కూడా స్టార్ట్ చేయొచ్చు. మెయిన్ గా ఇన్వెస్ట్మెంట్ ఎక్విప్మెంట్స్ కే అవుతుంది. నేడు ఐస్ క్రీమ్ అమ్ముకునే వారి కోసం వాహనాలు కూడా ఉన్నాయి దీని ద్వారా మీరు తమ వ్యాపారాన్ని ఊరంతా తిరుగుతూ కూడా అమ్మొచ్చు. మీరు ప్రతి రోజు లేదా మీ అవసరానుసారం మీ స్థలాన్ని మార్చుకోవచ్చు. అంటే ఎక్కువ కస్టమర్లు ఉండే చోట మీరు ఐస్ క్రీమ్ అమ్ముకోవచ్చు. అలాగే మీకు ఒకవేళ ఆల్రెడీ చిన్న బిజినెస్ ఉంటే అది కిరాణ షాప్ కానీ స్టేషనరీ షాప్ కానీ ఇలా ఏమైనా ఉంటే అప్పుడు మీరు ఒక ఫ్రీజర్ ని కొని అందులో ఐస్ క్రీమ్ పెట్టి అమ్మొచ్చు. ఒకవేళ మీ షాప్ లో ఎక్కువ ప్లేస్ ఉంటే మీరు కస్టమర్స్ కి కూర్చోవడానికి చైర్స్ కూడా అరేంజ్ చేస్తే మంచిది. అలా చేస్తేనే మీ పార్లర్ కు ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంటాది. అలాగే మీ వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఐస్ క్రీమ్ పార్లర్ బిజినెస్ ప్రారంభించడానికి ముందు ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి లైసెన్స్ పొందాలి. ఇది 15 అంకెల రిజిస్ట్రేషన్ నెంబర్ ఇది పార్లర్ లో తయారవుతున్న ఆహార పదార్థాలు ఎఫ్ఎస్ ఎస్ఏఐ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారిస్తుంది. కాబట్టి ఇంకెందుకు లేట్ వెంటనే ఈ బిజినెస్ ని మీ సమ్మర్ లో స్టార్ట్ చేసి మంచి ప్రాఫిట్స్ ని పొందండి.
కోకోనట్ బిజినెస్
ఐదోది కోకోనట్ బిజినెస్ వేసవిలో కొబ్బరి అమ్మకాలు బాగా పెరుగుతాయి. అలాగే మీరు నెలకి 20000 నుంచి 25000 వరకు సంపాదించొచ్చు. కొబ్బరి నీరు ఎండలో తిరిగే వాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు ఎందుకంటే కొబ్బరి నీళ్లలో మన బాడీని హైడ్రేట్ చేసి శక్తి ఉంది. కాబట్టి అందుకే ఎండలో తిరుగుతున్నప్పుడు ఎక్కువగా కొబ్బరి నీళ్లు అమ్ముడయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ వ్యాపారంలో లాభాలు సాధించాలంటే నాణ్యమైన కొబ్బరి నీళ్లను ఇవ్వడం మరియు సరైన ధరను పెట్టడం ముఖ్యం. అలాగే మార్కెట్ లో డిమాండ్ ని బట్టి వ్యాపార స్ట్రాటజీలను అమలు పరచడం మరియు కస్టమర్స్ కి బెస్ట్ సర్వీస్ అందించడం వల్ల కొబ్బరి వ్యాపారంలో మీరు విజయం సాధించొచ్చు. కాబట్టి ఇంకెందుకు లేట్ ఒకసారి ఈ బిజినెస్ గురించి కూడా ఆలోచించండి.
వాటర్ మెలన్ బిజినెస్
ఆరోది వాటర్ మెలన్ బిజినెస్ సమ్మర్ సీజన్ లో వాటర్ మెలన్ బిజినెస్ కూడా మంచిగా రన్ అవుతాది. మీరు 10000 నుంచి 20000 వరకు పెట్టుబడి పెడితే మీకు నెలకి లక్ష వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అందుకే త్వరగా ఈ బిజినెస్ స్టార్ట్ చేసేయండి. ఎండాకాలంలో అందరూ ఫ్రూట్స్ తినాలని అనుకుంటారు వాళ్ళ ఒంట్లో ఉన్న వేడిని దూరం చేసుకోవడానికి పుచ్చకాయలు చాలా ఉపయోగపడతాయి. పుచ్చకాయలు వేసవి కాలంలో ఎక్కువగా డిమాండ్ లో ఉంటాయి ఎందుకంటే ఇవి శీతల కారకమైన పండ్లు మరియు వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటర్ మిలన్ బిజినెస్ అనేది సమ్మర్ సీజన్ లో చేయడానికి మంచి బిజినెస్ అని చెప్పొచ్చు. వేసవిలో వాటర్ మిలన్స్ మన శరీరాన్ని హైడ్రేట్ చేస్తాయి వేసవిలో పుచ్చకాయ వ్యాపారం చేయాలంటే ముందుగా మీరు క్వాలిటీ పుచ్చకాయల సప్లై చేసే రైతులను గుర్తించాలి. ఈ బిజినెస్ ని రోడ్ సైడ్ స్టాల్స్ మార్కెట్లు మరియు షాపింగ్ మాల్ ఏరియాలో అమ్మొచ్చు. ఈ పండ్లు తీవ్రమైన వేడికి సహజ పరిష్కారంగా పని చేయడం వల్ల వేసవిలో పుచ్చకాయ వ్యాపారం ఎక్కువ ప్రాఫిట్స్ ని ఇస్తుంది. మరియు వేసవి సీజన్ ప్రారంభమయ్యే సమయంలో ఈ వ్యాపారంలో పెట్టుబడి చేసి నాణ్యమైన పుచ్చకాయలను సరఫరా చేయడం వల్ల మీరు మంచి లాభాలను పొందొచ్చు.
ఏసీ అండ్ రిఫ్రిజిరేటర్ సర్వీస్ బిజినెస్
ఏడోది ఏసీ అండ్ రిఫ్రిజిరేటర్ సర్వీస్ బిజినెస్ వేసవిలో ఏసీ అండ్ రిఫ్రిజిరేటర్ సర్వీసింగ్ బిజినెస్ చాలా డిమాండ్ లో ఉంటాది. ఈ సీజన్ లో ఏసీ అండ్ రిఫ్రిజిరేటర్ల పైన పని భారం ఇతర కాలాలతో పోలిస్తే ఎక్కువగా ఉంటాది. కాబట్టి అందుకే జనాలు సమ్మర్ సీజన్ లో తమ ఏసీ లు మరియు ఫ్రిడ్జ్ లను సర్వీసింగ్ చేయించుకోవాలని అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఏసీ అండ్ ఫ్రిడ్జ్ లేకుండా ఒక రోజు కూడా ఉండలేరు కాబట్టి మీరు వేసే సమయంలో బాగా డబ్బు సంపాదించే వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఏసీ అండ్ రీఫ్రిజిరేషన్ సర్వీస్ గురించి ఆలోచించండి. ఈ వ్యాపారంలో నిపుణులు లేదా సర్వీసింగ్ పద్ధతులు తెలిసిన వారు బాగా డబ్బు సంపాదించగలరు అయితే మీరు సర్వీసింగ్ పద్ధతి తెలుసుకోవాలి లేదా నిపుణుడైన వ్యక్తిని పెట్టుకోవాలి.
ఓకే ఫ్రెండ్స్ నేను మీకు ఈ సమ్మర్ లో స్టార్ట్ చేయడానికి మంచి బిజినెస్ ఐడియాస్ ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు గనుక ఈ ఐడియాస్ నచ్చితే మాకు కామెంట్ లో చెప్పండి. మళ్ళీ తిరిగి నెక్స్ట్ టాపిక్ లో కలుద్దాం..