Instant Broken Wheat Dosa Recipe : గోధుమ రవ్వ దోశ రెసిపీ
ఇవాళ్టి టాపిక్ లో Instant Broken Wheat Dosa Recipe : గోధుమ రవ్వ దోశ రెసిపీగురించి తెలుసుకుందాం. ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్లో రవ్వ దోశ తినడానికి చాలా మంది ఇష్టపడతారు. సహజంగా రవ్వ దోశలని బొంబాయి రవ్వతో చేస్తూ ఉంటారు. వీటిల్లో పోషకాలు ఉండవు. అందువలన ఈ సారి ఇలా చేయకుండా పాలిష్ పట్టని ఎర్ర గోధుమ రవ్వతో స్పెషల్గా (Instant Rava Dosa) చేసి తినవచ్చు. అది ఎలా చేయాలో చూద్దాం.
గోధుమ రవ్వ దోశ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు
- ఎర్ర గోధుమ రవ్వ – 1 కప్పు
- పచ్చి కొబ్బరి తురుము – 1/2 కప్పు
- ఉల్లికాడ ముక్కలు – 1/2 కప్పు
- పెరుగు – 1/2 కప్పు
- ఉల్లిపాయ ముక్కలు – 1/2 కప్పు
- ఎండు మిరపకాయలు – 5
- కరివేపాకు – కొద్దిగా
- పచ్చిశనగపప్పు – 2 టేబుల్ స్పూన్స్
- మీగడ – 1 టేబుల్ స్పూన్
- జీలకర్ర – 1 టీ స్పూన్
- మినపప్పు – 1 టేబుల్ స్పూన్
- వంట సోడా – 1 టీ స్పూన్
రవ్వ దోశ తయారీ విధానం
- ముందుగా పొయ్యి మీద నాన్ స్టిక్ పాత్రను తీసుకొని దానిలో పచ్చి శనగపప్పు, జీలకర్ర, మినప్పప్పు వేసి దోరగా వేయించాలి.
- దీనిలో కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసి వేయించాలి.
- తర్వాత మిక్సీ జార్ లో వేయించుకున్న తాలింపుని, పచ్చి కొబ్బరి తురుము వెయ్యాలి.
- వేయించిన పాలిష్ పట్టని ఎర్ర గోధుమ రవ్వని కూడా వేసి ముక్క, చెక్క అయ్యేటట్లు మిక్సీ పట్టాలి.
- తర్వాత దీనిలో పెరుగు వేసి మళ్లీ గ్రైండ్ చేసి వంట సోడాని యాడ్ చెయ్యాలి.
- స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టి దోశ వెయ్యాలి.
- దోశమీద ఉల్లికాడ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు చల్లాలి.
- తర్వాత కొద్దిగా మీగడ రాస్తే కలర్ ఫుల్గా, టేస్టీగా రవ్వ దోశలు సిద్దం అయినట్టే.
బ్రేక్ ఫాస్ట్ లో ఇలా గోధుమ రవ్వతో దోశలు వేసి తిన్న తర్వాత ఏదైనా ఫ్రూట్స్ తింటే ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.