High Protein Curry : మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ
ఇవాళ్టి టాపిక్ లో High Protein Curry : మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ గురించి తెలుసుకుందాం. శరీరం బలానికి, దృడమైన కండరాలు పెరగడానికి ప్రోటీన్ చాలా ముఖ్యమైనది. కాబట్టి హై ప్రోటీన్తో పాటు మంచి బలాన్ని ఇచ్చే కర్రీ ఎలా చేయాలో చూద్దాం.
మాంసం కంటే హై ప్రోటీన్ కర్రీ తయారీకి కావలసిన పదార్ధాలు
• నానబెట్టిన పెసలు – 1 Cup
• నానబెట్టిన నాటుశనగలు – 1/2 Cup
• పాలకూర – 1/2 Cup
• పచ్చి బఠాణీ కాయలు – 6 లేదా 7
• బంగాళదుంపలు చిన్నవి – 4
• చిన్న గుత్తి వంకాయలు – 4
• చిన్న చిలగడ దుంపలు – 4
• చిన్న చిక్కుడు కాయలు – 6 లేదా 7
• చెర్రీ టమాటాలు – 10
• ధనియాల పొడి – 1T.Spoon
• పచ్చిమిరపకాయలు – 2
• చిన్న గుండ్రటి ఉల్లిపాయల – 10
• మీగడ – 1T.Spoon
• జీలకర్ర – 1T.Spoon
• నిమ్మకాయ రసం – 1T.Spoon
• పసుపు – కొద్దిగా
తయారీ విధానం
• ముందుగా ఒక చిన్న కుక్కర్ స్టవ్ మీద పెట్టి నానబెట్టి పెసలు, నానబెట్టిన శనగలు, కొద్దిగా పసుపు, నిమ్మరసం పిండాలి.
• తర్వాత ఒక కప్పు నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టాలి.
• రెండు విజిల్స్ రాగానే తీసి పక్కన పెట్టుకోవాలి.
• ఇప్పుడు ఆవిరితో ఉడికే పాత్రని తీసుకోని రంధ్రాలున్న ప్లేట్లో బంగాళదుంపలు, వంకాయలు, పచ్చిబఠాని కాయలు, చిలకడదుంపలు ఉంచాలి.
• అలానే ఉల్లిపాయలు, చిక్కుడుకాయలు, టమాటాలు, పాలకూర ఆకులు, పచ్చిమిరపకాయలు పెట్టి 5-10 నిముషాలుఉంచి హాఫ్ బాయిల్ చేయాలి.
• తర్వాత మరొక నాన్ స్టిక్ పాత్ర పెట్టి మీగడ, జీలకర్ర, కర్వేపాకు, కొత్తిమీర వేసి తాలింపు చేయాలి.
• అలానే హాఫ్ బాయిల్ చేసిన ముక్కలు, ఉడికించిన శనగలు, పెసలు కూడా వేయాలి.
• సుమారు ఏడు నిమిషాలు మగ్గనించి కొద్దిగా నిమ్మరసం పిండితే కూర సిద్ధం అయినట్టే.
చాలామంది మాంసం తింటేనే బలం వస్తుంది అని అనుకుంటారు కానీ ఇలా పప్పులతో కూర చేసి తింటే డబుల్ ప్రోటీన్ వస్తుంది. కాబట్టి తక్కువ ఖర్చులో ఇలా ఆరోగ్య కరమైన వంటలు చేసి తినడం మంచిది. దీనిని ఉట్టిగా తిన్నా కూడా రుచిగా ఉంటుంది. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.