Career Guidance : మీ పిల్లల భవిష్యత్తు కోసం కెరీర్ గైడెన్స్
ఇవాళ్టి టాపిక్ లో Career Guidance : మీ పిల్లల భవిష్యత్తు కోసం కెరీర్ గైడెన్స్ గురించి తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో గ్రూప్స్, IIT, NEET పరీక్షలకి ఆసక్తి చూపిస్తున్న విద్యార్థులు లక్షల్లో ఉన్నారు. దీని వలన కాంపిటేషన్ పెరిగి అతి తక్కువ మంది మాత్రమే అర్హత సాధిస్తున్నారు. అయితే ప్రతి విద్యార్థి ఎలాంటి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలన్నా వారికి సరైన దిశా నిర్దేశం అవసరం అవుతుంది. కాబట్టి పిల్లలని ఎలా గైడ్ చేయాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
పిల్లలు ఉన్న తల్లి తండ్రులు ఇలా చేయండి
- విద్యార్థులు ఎక్కువ శాతం ఉదయం నుండి రాత్రి వరకు విరామం లేకుండా చదువుతూ ఉండటంతో వారికి స్ట్రెస్ పెరుగుతుంటుంది.
- పిల్లలకి ఒత్తిడి పెరగకుండా పేరెంట్స్ సపోర్ట్ ఇస్తూ వారితో మాట్లాడుతూ ఉండాలి.
- విద్యార్థులలో ఎక్కువ శాతం మంది యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఒకటికి రెండు సార్లు పాఠాలు చెప్పాల్సి ఉంటుంది.
- ఎంత సమయం చదివినా చదువులో రాణించలేని వారికి ప్రతిభ ఉన్న దానిలో ప్రోత్సహించాలి.
- మార్కులు కోసం వారి మీద ఒత్తిడి తేకుండా చూడటం మంచిది.
ప్రతి ఒక్కరిలో ఎదో ఒక ప్రతిభ ఉంటుందని గుర్తుంచుకోవాలి. కాబట్టి చదువు మీద మాత్రమే దృష్టి పెట్టకుండా ఇష్టం అయిన రంగాలలో దృష్టి పెట్టడం వలన అద్భుతాలు చేయవచ్చు. అదేవిధంగా సీట్లు, మార్కుల కోసం ఇబ్బంది పెట్టకపోవడం వలన పిల్లలు డిప్రెషన్లోకి వెళ్లకుండా ఉంటారు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.