కిరాణా షాపు లో స్టాక్ మెయింటెన్ చేయడం ఎలా| Kirana Shop Business in Telugu
ఇవాళ్టి టాపిక్ లో Kirana Shop Business in Telugu గురించి తెలుసుకుందాం రండి.
కిరాణ షాప్ లో స్టాక్ ని మెయింటైన్ చేయడం పెద్ద తలనొప్పి పని అనవసరమైన వస్తువులకి ఖర్చు చేయకుండా ఎక్కువ ఏ వస్తువులైతే కస్టమర్స్ తీసుకుంటున్నారో అవి చూసుకోవడం వల్ల మన కిరాణ షాప్ సక్సెస్ అవ్వటానికి ఛాన్స్ ఉంది. మనం ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే స్టాక్ ని చూసుకోవడం చాలా ఈజీ అవుతది, అది ఎలాగో చూద్దాం. దీనికన్నా ముందు ఇంకొక ఇంపార్టెంట్ సజెషన్ ఏంటో తెలుసా ఏం లేదండి మా టెలిగ్రాం ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే చేసుకోమని చెప్తున్నాను అంతే అలాగే కింద ఉన్న WhatsApp ఛానల్ ని కూడా ఫాలో చేయండి.
టిప్ 1
టిప్ వన్ ప్రారంభం లో దుకానంలో తక్కువ స్టాక్ ఉంచండి. ఎందుకంటే మీరు షాప్ లో 20 వస్తువులు ఉంచాలని అనుకుందాం. ఆ 20 వస్తువుల్ని మినిమమ్ స్టాక్ లో ఉంచండి ఎప్పుడైతే స్టాక్ అయిపోతదో అప్పుడు వెంటనే స్టాక్ ని ఫిల్ చేయండి. ఈ స్టాక్ వాల్యూస్ కి ఒక రికార్డ్ మెయింటైన్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏ వస్తువుకి ఎంత డిమాండ్ ఉందో అలాగే కస్టమర్స్ డిమాండ్ గురించి కరెక్ట్ గా తెలుస్తది. అంతేకాకుండా మీ కిరాణ షాప్ లో స్టాక్ మెయింటైన్ చేయడం ఈజీ అవుతది.
టిప్ 2
టిప్ టు బ్రాండెడ్ మరియు అన్‌బ్రాండెడ్ వస్తువులు రెండింటిని ఉంచండి. ఈ రోజుల్లో ఎక్కువ కస్టమర్స్ బ్రాండెడ్ వస్తువులు మాత్రమే తీసుకుంటున్నారు. అలాగే అన్‌బ్రాండెడ్ వస్తువులను ఉంచడం వల్ల కస్టమర్ కు డిఫరెంట్ తెలుస్తది వాళ్ళకి ఆ వేరియేషన్ తెలిసినప్పుడు మీ షాప్ ని వాళ్లే పబ్లిసిటీ కూడా చేస్తారు. దీని కారణంగా మీ షాప్ కి ఎక్కువ కస్టమర్స్ వస్తారు, అలాగే సేల్స్ కూడా పెరుగుతాయి. కానీ గుర్తుంచుకోండి ఖరీదైన వస్తువులని ప్రారంభంలో తక్కువ క్వాంటిటీలో ఉంచండి ఎందుకంటే ఖరీదైన వస్తువులను కొనే కస్టమర్లు తక్కువగా వస్తారు.
టిప్ 3
టిప్ త్రీ ఫిఫో పద్ధతిని ఉపయోగించండి ఫిఫో అంటే ఏంటో అనుకుంటున్నారా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఇప్పుడు త్వరగా చెడిపోయే చాలా వస్తువుల్ని ఎక్కువ రోజులు ఉంచొద్దు ఎందుకంటే పొరపాటున అవి ఎక్స్పైర్ అయిపోతాయి. ఆ ఎక్స్పైర్ అయిపోయిన వస్తువు కస్టమర్ కి వెళ్తే అతనికి మన షాప్ మీద నమ్మకం పోతది అందుకే ఇది జరగకుండా ఉండడానికి మీ వస్తువుల్ని త్వరగా సేల్ చేసేయాలి. ఎలా అంటే ఫస్ట్ వచ్చిన వస్తువుని ఫస్ట్ అమ్మేయాలి అలా మీరు సరైన స్టాక్ బ్యాలెన్స్ చేయాలి అలా చేయడం వల్ల మీకు త్వరగా పాడైపోయిన వస్తువులు మీ దగ్గర ఎక్కువ రోజులు ఉంచుకోకుండా మీరు అమ్మేయడం వల్ల మీకు సేల్స్ కూడా బానే ఉంటాయి. కస్టమర్స్ కి మీ మీద నమ్మకం వస్తది. అలాగే మీ స్టాక్ ని మీరు ఈజీగా మెయింటైన్ చేయొచ్చు నేను ఆల్రెడీ చెప్పాను ముందు ఫస్ట్ టిప్ లో స్టాక్ ని మీరు తక్కువ పెట్టుకుంటే ఇదే మీకు ఉపయోగం అవుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ పాలు పెరుగు బ్రెడ్ లాంటి వస్తువులు తక్కువ మార్జిన్ ఉంటాయి కానీ కస్టమర్స్ వాటిని డైలీ కొంటారు కాబట్టి వాటిని ఉంచుకోవడం వల్ల మీకు యూస్ ఉండదు. కాబట్టి మీరు ఫస్ట్ వచ్చిన వాటిని ఫస్ట్ అమ్మేయాలి అప్పుడు అవి త్వరగా ఎక్స్పైర్ అవ్వవు మీ కస్టమర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా.
టిప్ 4
టిప్ ఫోర్ ఏంటంటే వస్తువు ఎంఆర్పి సేల్ ధర డిస్కౌంట్ ఎక్స్పైరీ డేట్ ఇలా మీ షాప్ లోని అన్ని వస్తువుల డేటా నోట్ చేసుకోండి. దీనివల్ల ఒక్కో వస్తువు ఎంత అమ్ముడు అయింది ఏ వస్తువు ఎక్స్పైర్ అయిపోయింది ఇలా చాలా వరకు స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుస్తది. దీన్ని బట్టి మీరు మీ స్టాక్ ని మేనేజ్ చేసుకోవచ్చు. మీరు దీనికి ఒక రికార్డ్ లాంటిది మెయింటైన్ చేయొచ్చు. ఎలా అంటే ఐదర్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లో నోట్ చేయొచ్చు. అప్పుడు మీరు ఈజీగా మీ స్టాక్ ని మేనేజ్ చేయొచ్చు.
బోనస్ టిప్
ఇప్పుడు మీ కిరాణ షాప్ సేల్స్ పెరగడానికి ఒక బోనస్ టిప్ చెప్తాను యూస్ అవుతాదేమో చూడండి. ఏంటంటే చాక్లెట్స్ చిప్స్ లాంటివి పిల్లలకి ఇష్టమైన వస్తువుల్ని వాళ్ళకి కనపడేలాగా కింద రాక్స్ లో పెట్టండి. ఎందుకంటే కస్టమర్స్ తో పిల్లలు వస్తే ఆ చాక్లెట్స్ అవి తీసుకోమని పేచి పెడతారు. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ తీసుకునే ఛాన్స్ ఉంది అలా మీకు సేల్స్ పెరుగుతాయి. ఈ టిప్ బాగుందనే అనుకుంటున్నాను. బాగుంటే మీరు యూస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ టాపిక్ లో కలుద్దాం.