Millet Daddojanam : రుచికరమైన మిల్లెట్ దద్దోజనం ఇలా చేయండి
ఇవాళ్టి టాపిక్ లో Millet Daddojanam : రుచికరమైన మిల్లెట్ దద్దోజనం ఇలా చేయండి గురించి తెలుసుకుందాం. దద్దోజనంని స్పెషల్గా చేస్తూ ఉంటారు. కానీ వైట్ రైస్ ఉపయోగించి చేయడం వలన అధిక బరువు, షుగర్ లాంటి సమస్యలు వస్తాయి. ఈ సారి ఇలా కాకుండా కోర్రలతో దద్దోజనాన్ని రుచికరంగా, ఆరోగ్యంగా ఎలా చేయవచ్చో చూద్దాం.
తయారీకి కావలసిన పదార్థాలు
- 12:00 సేపు నానబెట్టిన కొర్రలు – 1 CUP
- కొబ్బరి పాలు – 2 CUPS
- గట్టి పెరుగు – 1.1/2 CUP
- నానబెట్టిన వేరుశనగ గింజలు – 1/2 CUP
- పచ్చిమిర్చి ముక్కలు – 1Tb.Sp
- అల్లం తురుము – 1T.Sp
- మీగడ – 1Tb.Sp
- ఆవాలు – 1T.Sp
- జీలకర్ర – 1Tb.Sp
- ఇంగువ పొడి – 1T.Sp
- మిరియాలు (చెక్క ముక్క) – 1T.Sp
- కరివేపాకు కొద్దిగా
- కొత్తిమీర కొద్దిగా
కొర్రల దద్దోజనం తయారీ విధానం
- స్టవ్ మీద నాన్ స్టిక్ పాత్ర పెట్టి నానబెట్టిన కొర్రలు వెయ్యాలి.
- సుమారు 6 గంటలు నానబెట్టిన వేరుశనగ గింజలు కూడా వెయ్యాలి.
- ఇవి ఉడకడానికి కొబ్బరి పాలు, రెండు కప్పులు నీళ్లు పొయ్యాలి.
- మూత పెట్టి మెత్తగా ఉడకనివ్వాలి.
- ఈ అన్నం చల్లార్చి పెరుగు వేసి కలపాలి.
- పొయ్యి మీద నాన్ స్టిక్ పాత్ర పెట్టి మీగడ వేసి వేడి చేసుకోవాలి.
- తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము, కరివేపాకు, మిరియాలు (ముక్క చెక్క) వేసి వేయించి దద్దోజనం లో కలపాలి.
- పైన కొత్తిమీర డ్రెస్సింగ్ చేస్తే దద్దోజనం సిద్ధం.
కొర్రల దద్దోజనంతో లాభాలు
- రక్షణ వ్యవస్థని పెంచుతుంది.
- ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియా పెంచుతుంది.
NOTE: దద్దోజనం నిల్వ ఉంచుకొని తింటే మరింత రుచికరంగా ఉంటుంది.
దద్దోజనం తెల్లబియ్యంతో చేసి తినడం కంటే ఇలా కొర్రలతో చేసి తినడం మంచిది. నూనె బదులుగా మీగడ వాడటం వలన ఎవరైనా ఇష్టంగా తినేస్తారు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.