Immunity : ఇమ్యూనిటీని పెంచే బెండకాయ పెరుగు పచ్చడి
ఇవాళ్టి టాపిక్ లో Immunity : ఇమ్యూనిటీని పెంచే బెండకాయ పెరుగు పచ్చడి గురించి తెలుసుకుందాం.పెరుగు పచ్చళ్ళు చాలా రుచిగా ఉంటాయి. బెండకాయ, పెరుగు కాంబినేషన్లో పెరుగు పచ్చడి చేసి తింటే భలే రుచిగా ఉంటుంది. అంతే కాకుండా ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియా, ఇమ్యూనిటీ పెరుగుతుంది. అన్ని లాభాలనిచ్చే పెరుగు పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం.
కావలసినవి
- బెండకాయ ముక్కలు – 250 గ్రా
- పెరుగు – 1 1/2 కప్పు
- పుల్ల మజ్జిగ – 1 కప్పు
- కొబ్బరి తురుము – 1/2 కప్పు
- వేయించిన వేరుశనగపప్పు (ముక్కా చెక్కా) – 1/2 కప్పు
- కొత్తిమీర – 1/2 కప్పు
- పచ్చిమిరపకాయలు – 4-5
- అల్లం తురుము – 2 టేబుల్ స్పూన్స్
- ఎండుమిర్చి – 3
- జీలకర్ర – 1 టీ స్పూన్
- ఆవాలు – 1 టీ స్పూన్
- ఇంగువ పొడి – కొద్దిగా
- పసుపు – కొద్దిగా
- కరివేపాకు – కొద్దిగా
తయారీ విధానం
- స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టి బెండకాయ ముక్కలు వేసి ఐదు నిముషాలు ఉడికించుకోవాలి.
- తర్వాత పుల్ల మజ్జిగ పోసి ఉడికించుకోవాలి.
- మిక్సీలో వేయించిన వేరుశనగ గింజలు, పచ్చి కొబ్బరి తురుము, అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర ముక్కా చెక్కాలా మిక్సీ పట్టుకోవాలి.
- బెండకాయ ముక్కల్లో నీరు తగ్గి ముక్కలు పొడిపొడిగా అయిన తర్వాత ఇందులో వేరుశనగ మిశ్రమాన్ని, పసుపు, గట్టి పెరుగు కలపాలి.
- తాలింపు కోసం స్టవ్ మీద చిన్న నానిక్ పాత్ర పెట్టి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేయాలి.
- తర్వాత కరివేపాకు, ఇంగువ పొడి, అల్లం తురుము, మీగడ వేసి వేయించుకోవాలి.
లాభాలు
- ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది.
- అరుగుదల శక్తి పెరుగుతుంది.
- ఇమ్యూనిటీ పెరుగుతుంది.
బెండకాయ పచ్చడి ఇలా చేసి తినడం వలన ఉప్పు లేనిలోటు తెలియదు. నేచురోపతి ఫాలోవర్స్కి ఇది ఒక వరం లాంటిది. కాబట్టి మీరు ఒకసారి ప్రయత్నించి చూడండి. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.