Egg for Good Health : గుడ్డు తినలేని వారికి అద్భుతమైన ఆహారం
ఇవాళ్టి టాపిక్ లో Egg for Good Health : గుడ్డు తినలేని వారికి అద్భుతమైన ఆహారం గురించి తెలుసుకుందాం. శరీరానికి తగిన ప్రోటీన్ అందినప్పుడే నీరసం రాకుండా రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతాం. ముఖ్యంగా కండరాలు ఆరోగ్యంగా ఉండటానికి ఇది తోడ్పడుతుంది. డాక్టర్లు ప్రోటీన్ కావలసిన వారు గుడ్డు తినవచ్చని సూచిస్తున్నప్పటికీ దీనిని అశ్రద్ధ చేస్తున్నారు కాబట్టి వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
గుడ్డు అందరూ తినవచ్చా?
- చాలామంది శాకాహారులు గుడ్డులో నుండి ఒక జీవం వస్తుందని జీవహింస మహా పాపమని గుడ్డుని అశ్రద్ధ చేస్తున్నారు.
- ప్రస్తుతం వచ్చే గుడ్లు ఫర్టి లైజ్ చేసినవి కాకుండా అన్ ఫర్టి లైజ్ చేసినవి అంటే జీవం లేనివి వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
- గుడ్డులో ఎలాంటి జీవం లేదు కాబట్టి దీనిని అందరూ తినవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
గుడ్డు బదులుగా ఇవి బెస్ట్
- గుడ్డులో జీవం ఉన్నా లేకపోయినా కొంతమంది వీటిని తినడానికి ఇష్టపడరు అలాంటి వారికి మంచి ప్రోటీన్ ఆహారాలున్నాయి.
- కందిపప్పు, మీల్ మేకర్, పన్నీర్ లాంటి వాటిల్లో ఎక్కువ ప్రోటీన్ దొరుకుతుంది కాబట్టి వీటిని తినడం మంచిది.
- షుగర్ సమస్యతో బాధ పడుతున్నవారు మాత్రం గుడ్డుని ఖచ్చితంగా తినడానికి ప్రయత్నం చేయాలి.
- షుగర్ ఉన్నవారు గుడ్డు తినడం వలన ఇన్సులిన్ బాలెన్స్ అవ్వడంతో పాటు నీరసం రాకుండా ఉంటుంది.
సాధారణ మనిషికి కేజీ బరువు చొప్పున ఒక గ్రాము ప్రోటీన్ అవసరం అవుతుంది. అంటే 70 కేజీలు ఉన్న వ్యక్తికి రోజుకి 70 గ్రాముల ప్రోటీన్ ఉండేలా చూసుకోవడం మంచిది. దీని వలన రోజంతా నీరసం లేకుండా యాక్టివ్ గా ఉండే అవకాశం ఉంది. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.