Tips to Get Pregnant Fast – సంతానలేమికి కారణాలు – చికిత్సలు
సంతానలేమికి కారణం తెలుసుకోవడం ఎలా?
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Tips to Get Pregnant Fast – సంతానలేమికి కారణాలు – చికిత్సలు గురుంచి తెలుసుకుందాం రండి. సంతాన సమస్యతో బాధపడుతున్నప్పుడు ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని పరీక్షలు రాయడం జరుగుతుంది. కొన్ని పరీక్షలు, కొన్ని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత నే ప్రాబ్లం ఎక్కడ ఉంది అనేది తెలుస్తాయి. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కడ నుంచి వస్తుంది మగవారి వలన, ఆడవారి వలన లేదా ఇద్దరి వలన తెలుసుకొన తరువాత నే ట్రీట్మెంట్ అనేది మొదలు పెడుతారు.
గర్భం కోసం ప్రయత్నించే దంపతులు తప్పక చదవండి
ఇక్కడ మీరు వచ్చి రాంగానే ట్రీట్మెంట్ చేయరు. కాబట్టి ఇది చాలా లెంగ్త్ గా నడుస్తుంది అనుకుంటారు. కాకపోతే ప్రోపర్ ఇన్వెస్టిగేషన్, ప్రోపార్ అనల్యసిస్ చేయకుండా ఈ ట్రీట్మెంట్ చేయడం అనేది జరగదు. ఇందులో ఏఏ టెస్ట్ లు ఉన్నాయి అలాగే అది ఏ విధంగా చేస్తారో తెలుసుకుందాం.
ఆడవారి కి చెయ్యవలసిన టెస్ట్ లు
భార్యను పీరియడ్ కి రెండో రోజు పరీక్షలు చేయడానికి పిలవడం జరుగుతుంది. ఎందుకంటే పీరియడ్ కి రెండో రోజు అయినా తరువాత నెక్స్ట్ పీరియడ్ కి అండాశయాలు గర్భసంచిలో తయారు అవుతుంటాయి కాబట్టి అది కరెక్ట్ సమయం. పీరియడ్ కి రెండో రోజూ వస్తే అల్ట్రా సోనోగ్రఫిక్ (Ultrasonography) అంటే స్కాన్ చేయడం అనేది చేస్తారు.
Ultrasonography ఎలా చేస్తారు (స్కాన్)
ఈ స్కాన్ లో బేసిక్ గా ఏం చేస్తారు అంటే గర్భసంచి బాగుందా, అండాశయాలు బాగుందా, వాటిలో ఎన్ని అండాశయాలు ఇంచు మించు గా పెరుగుతున్నాయి. ఏ అండం పెద్దగా ఉంది విడుదల చేయడానికి ఛాన్స్ ఉంది అని తెలుస్తుంది. వయసుకు సంబంధించి అండాశయాలు బాగున్నాయా లేదా వాటిలో పవర్ బావుందా క్వాలిటీ బాగుండచా అనేది ఈ అల్ట్రా సోనోగ్రఫీ లో తెలుసుకోవచ్చు.
అది కాకుండా అల్ట్రా సొనోగ్రఫీ ద్వారా పుట్టకతో వచ్చిన కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి అంటే ఒక సైడ్ ట్యూబ్ ఉండడం లేదా చిన్న గర్భసంచి ఉండడం లేదా పొర సరిగా పెరగక పోవడం ఈవాన్ని కూడా రెండో రోజు స్కాన్ చేయడం ద్వారా తెలుసుకుంటాం. కావున ఈ రెండో రోజు రావడం ఇన్వెస్టిగేషన్ కి మంచిది అని చెప్పవచ్చును. అదే రోజు బ్లడ్ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది.
బ్లడ్ టెస్ట్ ఎలా చేస్తారు
FSH, LH, E2, P4 వంటి రక రకాల టెస్ట్ లు చేస్తారు. కానీ ఇక్కడ బ్లడ్ ఒకేసారి తీస్తారు రక రకాల టెస్ట్ లు చేస్తారు. ఈ హార్మోన్స్ అంటే బేసిగ్గా బ్రెయిన్ కు పంపించే సిగ్నల్స్ అంటాం. ఆ సిగ్నల్స్ సరిగ్గా ఉంటే పోరా అనేది సరిగ్గా పెరుగుతుంది అండాషయలలో అండం సరిగా పెరుగుతుంది, విడుదలవ్వడం జరుగుతుంది ఆ తర్వాత ట్యూబ్ లో వచ్చి వెయిట్ చేయడం జరుగుతుంది. కావున ఇది చాలా ముఖ్యమైన బ్లడ్ టెస్ట్.
ఈ బ్లడ్ టెస్ట్ ద్వారానే టైముంది చిన్న చిట్కా ట్రీట్మెంట్ చేయడం నిర్ణయిస్తాము లేదా టైం లేదు అండాశయాలు బాలేదు, అండాల క్వాలిటీ బాలేదని నిర్ణయిస్తాం. కాబట్టి ఈ బ్లడ్ టెస్ట్ అనేది అతి ముఖ్యమైనదిగా పరిగణిస్తాం.
AMH టెస్ట్ ఎలా చేస్తారు
AMH అంటే ANTI MULLERIAN HORMONE. ఇది ఏమి చెప్తుంది అంటే బేసిగ్గా వయసుకు తగ్గ అండాలు ఉన్నాయా లేదా వయసు కన్నా ముందే అండాలు తగ్గిపోతున్నాయా అనేది చెపుతుంది. దాన్నే Premature Ovarian Failure అని అంటాం. అంటే ఏజ్ కన్నా ముందు అండాలు తగ్గిపోతుంటే టైం తక్కువ ఉన్నట్టు, టైం తక్కువ ఉన్నప్పుడు తొందరగా ట్రీట్మెంట్ కి వచ్చేస్తే తొందరగా రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ టెస్ట్ లు ఆడవారికి చేయడం జరుగుతుంది.
ఇది కాకుండా ట్యూబ్ టెస్ట్ అనేది చేయాలి అంటే ట్యూబ్స్ ఏంటంటే అండాలు విడుదలైనప్పుడు ట్యూబ్ లో వచ్చి వెయిట్ చేస్తుంటాయి. అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే స్పామ్స్ వచ్చి ఫలదీకరణం అయినా తరువాత పిండం అనేది గర్భసంచిలో కొచ్చి అటాచ్ అవుతుంది. ఇందులో ట్యూబ్ అనేది మీకు ముఖ్యమైన పార్ట్ అనేది మీకు అర్థమైంది. ఇటు బ్లాక్ అయిందనుకోండి ఒకవేళ అండం విడుదలైన ట్యూబ్ లో రాలేదు స్పామ్స్ అనేవి ట్యూబ్ దాటి చేరలేవు. పిండం అనేది తయారవ్వదు.
ట్యూబ్ టెస్ట్ (HSG) ఎలా చేస్తారు
HSG అంటే Hysterosalpingogram. ఇందులో ఒక డై లాంటిది గర్భసంచిలో వేస్తాం. ఆ డై అంటే రంగు, రంగు అనేది ట్యూబ్ నుంచి ఇటువైపు, అటువైపు నుంచి వస్తుంది. బయటికి వస్తే ఓపెన్ ఉన్నట్లు లేదంటే బ్లాక్ అయినట్లు. కొందరికి ఒక సైడు ఓపెన్ ఉంటే కొందరికి రెండు సైడ్లు బ్లాక్ ఉంటాయి లేదా కొందరికి రెండు సార్లు ఓపెన్ గా ఉంటాయి. ఈ బ్లాక్ ఓపెన్ బట్టి ట్రీట్మెంట్ చేయాలో వద్దో నిర్ణయిస్తారు.
మగవారి కి చెయ్యవలసిన టెస్ట్ లు
భర్తకి వీర్యకణాల పరీక్ష చేయడం. భార్య, భర్త ఇద్దరు మూడు నుంచి ఏడు రోజులు మధ్య గ్యాప్ ఉన్నప్పుడు వచ్చి వీర్యం ఇచ్చినప్పుడు వీర్యకణాలు పరీక్ష చేయడం జరుగుతుంది. ఈ పరీక్ష బట్టి ట్రీట్మెంట్ అనేది చేస్తారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కొన్ని వాల్యూస్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా ట్రీట్మెంట్ అనేది చేస్తారు.
ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.