ఎవరికీ చెప్పకూడని గోప్యత పాటించవలసిన విషయాలు – What You Should Keep to Yourself in Telugu
ఇవాళ్టి టాపిక్ లో What You Should Keep to Yourself in Telugu గురించి తెలుసుకుందాం.
మీ గురించి ఎవ్వరికి చెప్పకూడని కొన్ని విషయాలు
మీకో విషయం చెప్పనా మీరు అవునన్నా కాదన్నా మనుషులు అవకాశవాదులు కరెక్ట్ గా ఒక సిచుయేషన్ వచ్చిందనుకోండి. ఫర్ సపోజ్ ఒక మనిషికి భయంకరంగా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి అతని యొక్క అసలు రూపం బయట పడుతుంది నిజం చెప్పాలంటే అదే అతని అసలు రూపం. అలాంటి అసలు రూపాలు తెలియకుండా మొహానికి ముసుకేసుకొని నిజం చెప్పాలంటే నేను మంచోడిని నేను చాలా ఉత్తముడిని అని చెప్పేసి కొన్ని టాగ్ లైన్ తగిలించుకొని చాలా మంది మన చుట్టూ తిరుగుతూ ఉంటారు నిజం చెప్పాలంటే మనం కూడా తిరుగుతూ ఉంటాం అది వాస్తవం. ఇక్కడ నేను చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే ప్రతి మనిషి కి కొన్ని పర్సనల్ విషయాలు ఉంటాయి అన్నమాట అంటే మనకి మాత్రమే తెలిసిన మన జీవితంలో జరిగిన కొన్ని విషయాలు. చాలా మంది పాపం అమాయకంగా వాళ్ళు ఏం చేస్తారంటే తనకి బాగా దగ్గర అయిన వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటారు. బేసికల్ గా మనం ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి కూడా మెయిన్ రీజన్ ఒకటి ఉంది. ఎందుకంటే దానికి వాళ్ళ దగ్గర ఏదైనా సొల్యూషన్ ఉంటుందా అని చెప్పేసి మనం వాళ్ళకి సమస్య చెప్తాం చెప్పిన తర్వాత మీ అదృష్టం కొద్ది వాళ్ళు మంచి వాళ్ళే అనుకోండి మీ మంచి కోరి ఏదో ఒక సలహా ఇస్తారు లేదు అనుకోండి వాళ్ళు కూడా ఏదో సలహా ఇస్తారు. కాకపోతే మీకు వాళ్ళకి నాన్ సింక్ అయినప్పుడు అప్పుడు వాళ్ళ నిజ స్వరూపం బయట పడుతుంది మీ పర్సనల్ విషయాలన్నీ పబ్లిక్ లోకి వచ్చేస్తాయి. దాని వల్ల ఇబ్బంది పడేది ఎవరు మీరే.
PERSONAL GOALS
ఇంకా డైరెక్ట్ గా పాయింట్ కి వస్తే ఫస్ట్ మీరు ఎవ్వరితో షేర్ చేసుకోకూడని విషయం ఏంటంటే పర్సనల్ గోల్స్. బేసికల్ గా ప్రతి ఒక్క మనిషికి కొన్ని జీవిత లక్ష్యాలు ఉంటాయి వాటి కోసం మనం పోరాడుతూనే ఉంటాము మనకు తెలిసిన వాళ్ళకి మన జీవిత లక్ష్యాల గురించి చెప్తాం ఉంటాం. అలా చెప్పడం వల్ల జరిగే అనర్థాలు ఏంటంటే మొట్టమొదట వాళ్లే మీకు ఒక స్పీడ్ బ్రేకర్ గా మారుతారు అన్నమాట. ఎందుకంటే అసలు ఏ జీవితం లక్ష్యం లేని వాడి దగ్గరికి వెళ్లి మన జీవిత లక్ష్యం గురించి చెప్తే వాడు మనల్ని ఎలా చూస్తాడు మన గురించి బయట ఇంకెలా చెప్తాడు గట్టిగా మాట్లాడితే మనం ఏమి సాధించకుండా జీవితంలో అలా మిగిలిపోవడానికి కారణం కూడా వాడే కావచ్చు. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళకి మాక్సిమం మీ జీవిత లక్ష్యం చెప్పకుండా ఉంటేనే బెటర్ ఒకవేళ చెప్పారే అనుకోండి వాడికి అంత సీన్ లేదని చెప్పేసి మిమ్మల్ని డీమోటివేట్ చేస్తారు. మరి ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు అమ్మ నాన్న కూడా అవ్వచ్చు. ఎందుకంటే మీకున్న జీవిత లక్ష్యం యొక్క వాల్యూ వాళ్ళకి తెలియదు మీకు ఎంత టాలెంట్ ఉందో వాళ్ళకి ఏం తెలుసు. కాబట్టి మాక్సిమం చెప్పకుండా ఉంటేనే బెటర్ లేదు బ్రదర్ మా కుటుంబ సభ్యులు మాకు సపోర్ట్ చేస్తారు అనుకుంటే మాత్రం మొట్టమొదట మీరు వాళ్లకే చెప్పాలి. ఎందుకంటే మీ మీద వాళ్లకు ఉన్నంత ప్రేమ ఈ ప్రపంచంలో ఎవరికీ ఉండదు కాబట్టి.
RELATIONSHIP ISSUES
ఇంకా రెండో విషయం ఏంటంటే రిలేషన్షిప్ ఇష్యూస్. బేసికల్ గా ప్రతి కుటుంబంలో కలహాలు ఉంటాయి చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఆ విషయాలు తీసుకెళ్లి వాళ్ళ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటారు బయట వాళ్ళకి చెప్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఏంటంటే వీడిని ఓదారుస్తున్నట్టు ఓదారుస్తారు కానీ ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్లి చాలా కామెడీగా మన విషయాలు చెప్పుకుంటూ ఉంటారు. ఇది కామన్ గా ప్రతి ఒక్కరు చేసే బ్లెండర్ మిస్టేక్ అన్నమాట దయచేసి ఈ మిస్టేక్ ఎవ్వరు చేయకండి. ఎందుకంటే కుటుంబం అన్నాక ప్రతి ఒక్క కుటుంబంలో గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఆ గొడవల్లోకి రోడ్డు మీద పోయి ఎవడో గొట్టంగా ఇంటికి తీసుకొచ్చి వాడిని జడ్జిగా చేసి మీరు ముద్దాలుగా నుంచుని వాడి ఇచ్చే తీర్పు కోసం అస్సలు ఎదురు చూడమాకండి. మీ కొంపలో సమస్యలు ఉంటే మీరే తీర్చుకోండి ఒకవేళ తీరట్లేదా మీ కుటుంబ సభ్యులు లో ఎవరైతే పెద్ద తరహాగా వ్యవహరిస్తారో వాళ్ళని మాత్రమే మీరు అప్రోచ్ అవ్వండి. అలా కాకుండా రోడ్డు మీద ఎవడు పడితే వాడితో గట్టిగా మాట్లాడితే మీ బెస్ట్ ఫ్రెండ్ ని కూడా ఇలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ చేయొద్దు ఎందుకంటే వాడేం పెట్టిపోవట్లేదు కదా వాడు కూడా ఒక మనిషే కాబట్టి. నేను చెప్పొచ్చేది ఏంటంటే మీ కుటుంబాన్ని చాలా క్లోజ్ గా అబ్సర్వ్ చేసి ఒక పెద్ద మనిషి తరహాగా ఉండి ఒక పెద్ద మనిషిని అప్రోచ్ అవ్వండి దాని వల్ల రిలేషన్స్ పాడవకుండా ఉంటాయి మరి ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య కలహాలు పెరగకుండా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు కంటిన్యూస్ గా ఉంటూనే ఉంటాయి, వాటిని ప్రేమతో నెగ్గలేదు తప్ప ఇంకొక అట్టంగానే తీసుకొచ్చి వాడిని హీరో చేసి మీరు జీరో అవ్వద్దు. ఎందుకంటే ఎన్ని గొడవలున్నా కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులే. కాబట్టి దయచేసి కుటుంబ విషయాలు రోడ్డు మీదకి తీసుకెళ్లమాకండి మరి ముఖ్యంగా అర్హత లేని ప్రతి వాడికి మీ విషయాలు చెప్పి ఆ విషయాలు కాస్త వాడు ఇంకొకళ్ళకి చెప్పి మీ జీవితాన్ని బజార్ పాలు చేసుకోమాకండి.
CHARITABLE ACTS
ఇక నేను చెప్పబోయే మూడో పాయింట్ ఏంటంటే చారిటబుల్ యాక్ట్స్. బేసికల్ గా మనం కొంతమందికి సహాయం చేస్తాం మన దగ్గర స్తోమత ఉన్నప్పుడు ఎవరికైనా సహాయం చేస్తూ ఉంటాం హెల్ప్ చేస్తాం చేస్తూ ఉంటాం. దాన్ని గనక మనం ఎవరికి పడితే వాళ్ళకి చెప్పాం అనుకోండి వాళ్ళు మన గురించి చేసే నెగిటివ్ పబ్లిసిటీ ఉంటుంది చూడండి మనకి జీవితం మీద విరక్తి పడుతుంది. ఆ రేంజ్ లో చేస్తారు ఆ వీడు గనుక చేశాడురా బాబు అని చెప్పేసి మన గురించి చాలా చండాలంగా మాట్లాడతారు. ఇంకా దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను మీకు కాబట్టి మీరు ఎవరికైనా సహాయం చేస్తే దయచేసి అది ఎవరికీ చెప్పమాకండి. ఒకవేళ చెప్పారు అనుకోండి మీరు ఎవరికైతే హెల్ప్ చేశారో వాళ్లకే మీరు శత్రువులైపోతారు ఆ రేంజ్ లో మీకు బయట పబ్లిసిటీ ఇస్తారన్నమాట కాబట్టి మీరు ఎవరికైనా హెల్ప్ చేస్తే దయచేసి ఎవరికీ చెప్పకండి.
FUTURE AND PLANS
ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్యూచర్ ప్లాన్స్ మాత్రం ఎవ్వడికీ చెప్పకండి. ఎందుకంటే వాడి ఫ్యూచర్ వాడికి తెలియదు అలాంటిది మీ ఫ్యూచర్ గురించి మీరు ప్లాన్స్ చెప్పారు అనుకోండి వాడికి ఏం అర్థం కాదు మరి ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులకైతే అసలు చెప్పమాకండి. ఎందుకంటే ఓనర్ సరిగ్గా చేయట్లేదు ఇక వీడికి ఫ్యూచర్ ఏంటి అని చెప్పేసి మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తారు. అది తోడ పుట్టిన వాళ్ళు అవ్వచ్చు మీ బంధువులు అవ్వచ్చు మరి ముఖ్యంగా మిమ్మల్ని తక్కువ అంచనా వేసే మీ అమ్మ నాన్న కూడా అవ్వచ్చు కాబట్టి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఎవరికీ చెప్పకండి. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే వీటన్నిటిని ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరేం తప్పు చేయట్లేదు. కాబట్టి ఈ విషయాలన్నీ మీరు ఎవరితో షేర్ చేసుకోమాకండి ఒక్క ముక్కలో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ సమాజంతో మాక్సిమం మీరు డిస్కనెక్ట్ అయిపోయి మీ పనిలో మీరు బిజీ అయిపోండి.
ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.