సమయాన్ని సరిగ్గా వాడటం ఎలా – Time Management Tips in Telugu
ఇవాళ్టి టాపిక్ లో Time Management Tips in Telugu గురించి తెలుసుకుందాం.
సమయాన్ని సరిగ్గా వాడుకుంటే నిన్ను ఎవ్వరు ఆపలేరు
ఈ ప్రపంచంలో మనుషులు అనే వాళ్ళు రకరకాలుగా ఉంటారన్నమాట డబ్బు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు మధ్య తరగతి వాళ్ళు అలాగే రకరకాల మనుషులు ఉంటారు. కాకపోతే వీళ్ళందరికీ కామన్ గా భగవంతుడు ఇచ్చిన ఒక వరం ఉంది అదేంటంటే సమయం. ప్రతి ఒక్క మనిషికి కేవలం 24 గంటలు మాత్రమే ఉంటాయి ఆ 24 గంటలని ఎవడైతే కరెక్ట్ గా వాడుకుంటాడో వాడు వాడి జీవితంలో కాస్తో కాస్తో సుఖంగా ఉంటాడు అంతే గురించి నేనేం చెప్పను. మనల్ని సుఖంగా ఉంచే ఈ సమయాన్ని మనం ఎలా వాడుకోవాలి ఎలా వాడుకుంటే మనం సుఖంగా ఉంటాము అసలు దాన్ని ఎలా మిస్ యూస్ చేసుకుంటే మన జీవితంలో చాలా నష్టాలు ఫేస్ చేస్తాం అనేది ఈ రోజు మన టాపిక్. నష్టాల్ని పక్కన పెడితే మనకి భగవంతుడు ఇచ్చిన ఈ 24 గంటల సమయాన్ని మనం ఎంత పర్ఫెక్ట్ గా వాడుకోవాలి అనేది ఈరోజు మన టాపిక్.
సమయాన్ని వాడుకోవడం ఎలా
ఫస్ట్ అఫ్ ఆల్ ఏ మనిషి అయినా సరే సమయం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి ఎందుకంటే గడిచిపోయిన సమయం మళ్ళీ తిరిగి రాదు. అంతేకాకుండా సమయంతో పాటు మన వయసు కూడా పెరిగిపోతుంటుంది ఆ యుక్త వయసు కూడా మనకి తిరిగి రాదు. మామూలుగా ఏ మనిషి అయినా ఏంటి ఒక 20 సంవత్సరాల తర్వాత డబ్బు సంపాదించడం మొదలు పెడతాడు 60 సంవత్సరాల తర్వాత డబ్బు సంపాదించడం ఆపేస్తాడు. ఎందుకంటే ఆ టైం పీరియడ్ లోనే ఆ మనిషి ఒంట్లో శక్తి ఉంటుంది నిజం చెప్పాలంటే కరెక్ట్ గా టైం ఉంటుంది. ఆ సమయాన్ని అలాగే తన బాడీలో ఉన్న ఆ ఎనర్జీని రెండిటినీ ప్రాపర్ గా యూస్ చేసుకుంటే జీవితం అంతా హ్యాపీగా ఉంటుంది మిగిలిన వృద్ధాప్యం ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే పిల్లల్ని లైఫ్ లో సెటిల్ చేసేసి వాళ్ళకి పెళ్లిళ్లు చేసేసి ఎవడు బాధలు వాడు పడరు అని చెప్పేసి వాళ్ళందరిని మనం పక్కకు పంపించేసి లైఫ్ లో కొంచెం ప్రశాంతంగా ఉంటాం అన్నమాట. నేను ఏమంటానంటే సమయాన్ని అలాగే ఒంట్లో ఉన్న శక్తిని ఈ రెండిటిని ప్రాపర్ గా మన యుక్త వయసులో గనక వాడుకోగలిగితే అంటే మన కోసం మనం యూస్ చేసుకోగలిగితే మన జీవితం అంతా హ్యాపీగా ఉంటుంది. అలా కాకుండా మన సమయాన్ని కాస్త ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు వృధా చేసుకొని చివరికి వయసు అయిపోయిన తర్వాత కూడా ఆ సమయంలో మనం పని చేయడం మొదలు పెడితే దానికి మించిన నరకం ఇంకోటి ఉండదు. ఎందుకంటే అప్పటికి మన శరీరం అనేది మనకి సహకరించదు.
జీవిత లక్ష్యాలు
అంతేకాకుండా మన సమయాన్ని మనం ప్రాపర్ గా యూస్ చేసుకోవాలంటే గోల్స్ అనేవి చాలా క్లియర్ కట్ గా ఉండాలి అంటే జీవిత లక్ష్యాలు చాలా క్లియర్ గా ఉండాలి. చాలా మందికి ఏంటంటే వారానికి ఒక జీవిత లక్ష్యం వచ్చేస్తుంది ఒక రోజు ఏమో సినిమా యాక్టర్ అయిపోవాలనుకుంటారు ఇంకొక రోజు ఏమో క్రికెటర్ అవ్వాలనుకుంటారు ఆ తర్వాత రోజు ఇంకేదో అవ్వాలనుకుంటారు. నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు అలా అనుకుంటున్నంత సేపు మీ సమయం చాలా వృధా అయిపోతూ ఉంటుంది మళ్ళీ తిరిగి మీరు ఏదైనా జీవితం లక్ష్యం పెట్టుకున్న తర్వాత మీరు దాన్ని నెరవేర్చుకునేంత సమయం కూడా మీకు ఉండకపోవచ్చు. కాబట్టి ఏదైతే మీరు జీవిత లక్ష్యంగా పెట్టుకుంటారో దాన్ని క్లియర్ కట్ గా మెయింటైన్ చేయండి. ఒక నాలుగు రోజుల తర్వాత ఈ జోనర్ మనకు సెట్ అవ్వదేమో అని చెప్పేసి మీ మీద మీరు డౌట్ పడిపోయి దాన్ని అక్కడ వదిలేసి మళ్ళీ ఇంకో లక్ష్యం కోసం మీరు పరుగులు తీయడం కంటే ఒకే లక్ష్యం కోసం ఈ జీవితాన్ని త్యాగం చేయడం బెటరు. కాబట్టి గోల్స్ అనేవి చాలా క్లియర్ కట్ గా పెట్టుకోవడం వల్ల మన సమయం అనేది ఎక్కువ వృధా కాకుండా ఉండటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి క్లియర్ కట్ గా గోల్స్ ని సెట్ చేసుకోండి సరే నేను గోల్ సెట్ చేసుకున్నాను. నేను దాని కోసమే పోరాడుతాను అనుకున్న తర్వాత
PRIORITY
మీరు చేయాల్సిన ఇంకో పని ఏంటంటే ప్రయారిటీ అనేది ఇవ్వాలన్నమాట. ఏ పనికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి ఈ టాస్క్ ని కంప్లీట్ చేయడానికి మనం ఎంత సమయం వెచ్చించాలి అని చెప్పేసి ప్రాపర్ క్లియర్ కట్ గా ఒక ఐడియా ఉండాలి. నిజం చెప్పాలంటే ఒక 24 గంటల్లో మనం ఏం చేస్తున్నాం అనేది ఒక మ్యాప్ ఉండాలి మన దగ్గర. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఒక సినిమాకి వెళ్ళాలంటే సినిమా ఈ టైం లో మనకి థియేటర్ లో ప్లే అవుతుంది మనం దానికి ఒక గంట ముందు బయలుదేరాలి అని ఒక క్లియర్ కట్ ఐడియా ఎలా అయితే ఉంటుందో మీరు మీ జీవితంలో చేసే ప్రతి ఒక్క టాస్క్ కి ఒక క్లియర్ కట్ ఐడియా అనేది ఉండాలి. సరే చేద్దాంలే రే ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి అనుకుంటే ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఎవ్వడు మార్చలేడు. కాబట్టి ప్రతి ఒక్క పనికి ప్రతి ఒక్క టాస్క్ కి ఒక ప్రాపర్ టైమింగ్ ఉండాలి అంతే కాకుండా ప్రయారిటీ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఆ పని వల్ల మనం ఏ పని ఎప్పుడు ముగించుకోవాలి ఏ పని ఎప్పుడు స్టార్ట్ చేయాలి అని ఒక ఐడియా వస్తుంది. కాబట్టి దీనికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలో ప్రాపర్ ఒక ఐడియా అనేది ఖచ్చితంగా అవసరం.
PROTRACTION
అంతే కాకుండా ఇవన్నీ జరగాలంటే మనకి వాయిదా వేసే తత్వాన్ని కొంచెం అణచి పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రోక్రాస్టినేషన్ అనేది ఏ పనికైనా సరే అంత మంచిది కాదు ఈ పని రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం ఇంకా మనకి సమయం ఉంది కదా అని చెప్పేసి మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటే ఈ జీవితంలో మిమ్మల్ని ఎవ్వరూ బాగు చేయలేరు. ఎందుకంటే మనకి కేవలం రోజుకు ఉండేది 24 గంటలు అందులో నిద్రపోవడానికి కొన్ని గంటలు ఉన్నాయి అంతేకాకుండా పని చేయడానికి కొన్ని గంటలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి వాటిని పర్ఫెక్ట్ గా వాడుకోవాలి ఇంకా ముఖ్యంగా సమయం గడిచే కొద్దీ మీరు కూడా ముసలివాళ్ళు అయిపోతూ ఉంటారు. దీన్ని కూడా మైండ్ లో పెట్టుకొని పనులను వాయిదా వేయకుండా ఏ రోజు పనులు ఆ రోజే ఫినిష్ చేసుకోవడం వల్ల మీరు ఖచ్చితంగా ఆ టాస్క్లు అన్నిటిని కంప్లీట్ చేస్తారు.
REGULAR REVIEW
ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీరు తీసుకోవాల్సిన మెయిన్ జాగ్రత్త ఏంటంటే ప్రతి ఒక్క పనిని రివ్యూ చేసుకోవడం. మనం ఈ రోజుని ఎలా యూస్ చేసుకున్నామో లేకపోతే ఈ రోజుని వేస్ట్ చేసుకున్నామా అని చెప్పేసి ఏ రోజుకి ఆ రోజు మీ గురించి మీరు రివ్యూ చేసుకోవడం వల్ల మీ గ్రోత్ మీకు కనపడుతుంది లేకపోతే మీ డౌన్ ఫాల్ కూడా మీకు అర్థమవుతుంది. కనుక మనం వేరే విషయాల మీద రివ్యూ చేయడం కన్నా మన జీవితం మీద అలాగే మనకున్న ఈ కొంచెం సమయం మీద మనం గనక రోజు రివ్యూ తీసుకుంటే మీరు మెజారిటీగా టైం వేస్ట్ చేసుకోవడానికి ఆస్కారం ఉండదని నేను అనుకుంటున్నాను. కాబట్టి ప్రాపర్ గా రివ్యూ తీసుకోండి.
ఇంకా ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే మీ లక్ష్యాల గురించి క్రమం తప్పకుండా వాటిని అనాలసిస్ చేసుకోండి. అంతే కాకుండా మనకి ఏది వర్క్ అవుట్ అవుతుంది ఏది వర్క్ అవుట్ అవుతుంది అని చెప్పేసి ప్రాపర్ గా ఒక డిసిషన్ మేకింగ్ కి వచ్చేయండి. ఆ తర్వాత ప్రాపర్ గా ప్రణాళికలు వ్యూహాలు ఆ తర్వాత వాటితో మీ జీవితంలో మీకున్న టాస్క్లని ప్రాపర్ గా కంప్లీట్ చేయండి. భగవంతుడు మీకు ఇచ్చిన ఈ చిన్న జీవితాన్ని హ్యాపీగా ముగించేయండి. అలా కాకుండా వయసులో ఉన్నప్పుడు టైం మొత్తం వేస్ట్ చేసి వయసు అయిపోయిన తర్వాత నేను ఆ రోజు అలా చేస్తే బాగుండే అని చెప్పేసి వృద్ధాప్యం వచ్చిన తర్వాత బాధపడితే ఉపయోగం ఉండదు. కాబట్టి ఇప్పటి నుంచి మీ జీవితాన్ని మీరు ప్రాపర్ గా డిజైన్ చేసుకోండి. అదండి సంగతి సమయాన్ని ప్రాపర్ గా యూస్ చేసుకుంటే ఇన్ని లాభాలు ఉన్నాయి సమయాన్ని ప్రాపర్ గా యూస్ చేసుకోవాలంటే ఇన్ని మార్గాలు ఉన్నాయి.
ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.
1 thought on “సమయాన్ని సరిగ్గా వాడటం ఎలా | Time Management Tips in Telugu”