Reduce Leg Swelling : కాళ్ళ వాపులు తగ్గాలంటే ఏం చేయాలి
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Reduce Leg Swelling : కాళ్ళ వాపులు తగ్గాలంటే ఏం చేయాలి గురుంచి తెలుసుకుందాం రండి. కొంతమంది కాళ్ళ వాపులు రావడంతో అనేక ఇబ్బందులు పడుతుంటారు. ఈ వాపులు రావడం వలన సరిగ్గా నడవలేకపోవడం జరుగుతుంది. ఇలా కాళ్ళ వాపులు ఎందుకు వస్తాయి, వీటిని సులువుగా ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం.
కాళ్ళ వాపులకి కారణాలు
- గుండె జబ్బులు ఉన్నవారికి ఇవి ఎక్కువగా వస్తాయి.
- లివర్ ఫెయిల్ అయిన వారికి కాళ్ళ వాపులుతో పాటు పొట్ట వాపు కూడా వస్తుంది.
- కిడ్నీ ఫెయిల్ అయిన వారికి ఈ సమస్య వస్తుంది.
- అధిక బరువు ఉన్నవారికి కాళ్ళ వాపులు వస్తాయి.
- పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ఎక్కువగా వాడటం వలన కాళ్ళ వాపులు వస్తాయి.
- ఎక్కువ సమయం నుంచొని పని చేసేవారికి కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి.
కాళ్ళ వాపులు ఇలా తగ్గించుకోండి
- బరువు పెరగడం వల్ల వచ్చే కాళ్ళ వాపులు బరువు తగ్గితే తగ్గుతాయి.
- కిడ్నీ ఫెయిల్ అవ్వడం వలన వచ్చే కాళ్ళ వాపులు తగ్గడానికి కిడ్నీ మార్పించుకోవడం మంచిది.
- లివర్ సమస్యలు ఉన్నవారు ఆల్కహాల్ త్రాగకుండా సరైన మెడిసిన్ తీసుకోవడం మంచిది.
- నీరు టాబ్లెట్ తీసుకోవడం వలన మూత్రం ఎక్కువగా వచ్చి వాపులు తగ్గుతాయి.
- ఉప్పు తక్కువగా తీసుకోవడం మంచిది.
ఖచ్చితంగా తీసుకోవలసిన జాగ్రత్తలు
- డాక్టర్ సలహా లేకుండా నీరు టాబ్లెట్లు ఎక్కువగా తీసుకోకూడదు.
- ఈ టాబ్లెట్స్ ఉదయం పూట వేసుకోవడం మంచిది.
- సోడియం మరియు పొటాషియం టెస్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే నీరు టాబ్లెట్స్ వాడటం మంచిది.
- కిడ్నీ సమస్యలు ఉన్నవారు మంచి నీళ్ళు తక్కువగా త్రాగడం మంచిది.
కాళ్ళ వాపులు ఉన్నవారు ముందుగా సమస్య రావడానికి గల కారణాన్ని పరిష్కరించుకోగలిగితే వాపులు త్వరగా తగ్గతాయి. అదేవిధంగా ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలు తినకుండా ఉండటం వలన భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు.
కాళ్ళ వాపులు తగ్గడానికి ది బెస్ట్ చిట్కా
చాలామందిలో కాళ్ళ వాపులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వేలు పెడితే గుంటలు పడేంత వాపులు కూడా ఎక్కువ మందిలో వస్తాయి. అయితే ఈ సమస్య ఎవరికి వస్తుంది. వచ్చినప్పుడు ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం.
కాళ్ళ వాపులు రావడానికి కారణాలు
- మోకాలుకి క్రింది భాగంలో ఉండే టిబియా అనే ఎముక మీద వేలుతో నొక్కి నిమిషం తర్వాత తీసిన తర్వాత గుంటపడితే మోకాళ్ళ వాపులు వచ్చాయని అర్ధం.
- పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్స్ ఎక్కువగా వాడిన వారిలో కాళ్ళ వాపులు కనిపిస్తాయి.
- కిడ్నీల మీద ఒత్తిడి ఎక్కువ అయినప్పుడు కూడా ఈ సమస్య వస్తుంది.
- అధిక బరువు ఒబెసిటితో బాధ పడేవారికి కాళ్ళ వాపులు వస్తాయి.
- కిడ్నీలు, గుండె, లివర్ ఫెయిల్ అయినవారికి కాళ్ళ వాపులు వస్తాయి.
- కాళ్ళల్లో సిరలు పాడైపోయి వేరికోస్ వెయిన్స్ ఉన్నవారికి కనిపిస్తాయి.
కాళ్ళ వాపులు పోవడానికి మార్గాలు
- అధిక బరువు ఉన్నవారిలో ఇవి ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి బరువు తగ్గడం వలన వాపులు నేచురల్గా తగ్గిపోతాయి.
- ఉదయం పూట ‘Dytor’టాబ్లెట్ 10mg వేసుకోవడం వలన వీటిని తగ్గించుకోవచ్చు.
- ఈ టాబ్లెట్ వేసుకోవడం వలన యూరిన్ ఎక్కువగా వస్తుంది కాబట్టి దీనిని ఉదయం పూట వేసుకోవడం మంచిది.
- శరీరంలో సోడియం పొటాషియం ఎక్కువగా బయటకి వెళుతుంది కాబట్టి వీటిని ఎక్కువగా వేసుకోకూడదు.
- ఈ టాబ్లెట్ వారానికి ఒకటి వేసుకోవడం వలన సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి.
- వైద్యులని సంప్రదించిన తర్వాత మాత్రమే వీటిని వాడటం మంచిది.
Note : ఈ టాబ్లెట్ వేసుకోవడం వలన సమస్య తాత్కాలికంగానే పరిష్కారం అవుతుంది.
కాళ్ళ వాపులు వచ్చినంత మాత్రాన అవయవాలు ఫెయిల్ అయినట్టు కాదు. అవయవాల మీద ఒత్తిడి ఎక్కువ అయిన సమయంలో కూడా ఇవి వస్తాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. సమస్యకి కారణాన్ని తొలగించడం వలన మందులు వాడకుండానే వీటిని నేచురల్ గా తగ్గించుకోవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.