Mutual Fund in Telugu | మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి
ఇవాళ్టి టాపిక్ లో Mutual Fund in Telugu – మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి గురించి తెలుసుకుందాం.
మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి?
అసలు ఈ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం రెండు ఒకటే అయినప్పటికీ. స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి మీరు చాలా రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. కానీ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి కొద్దిపాటి రీసెర్చ్ మాత్రమే అవసరం అవుతుంది. అయితే మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాక మీ మనీని ఒక ఎక్స్పర్ట్ ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తారు. వారు మీ తరపున కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. మీ తరపున ఇలా ఇన్వెస్ట్ చేస్తున్నందుకు కొద్దిపాటి చార్జెస్ వసూలు చేస్తారు.
మ్యూచువల్ ఫండ్స్ సేఫేనా
మరి మ్యూచువల్ ఫండ్స్ సేఫేనా? స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా చేసే ఏ ఇన్వెస్ట్మెంట్ లో అయినా ఎంతో కొంత రిస్క్ ఉండకపోదు. అయితే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ తో పోలిస్తే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ ఎంతో కొంత సేఫే కారణం. ఒక ఎక్స్పర్ట్ ఫండ్ మేనేజర్ మీ తరపున ఇన్వెస్ట్ చేయడం కేవలం ఒక్క స్టాక్ లోనే కాకుండా మల్టిపుల్ స్టాక్స్ లో మీ మనీని ఇన్వెస్ట్ చేయడం.
మ్యూచువల్ ఫండ్స్ ఉపయోగాలు
అడ్వాంటేజెస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కేవలం ₹500 sip స్టార్ట్ చేయవచ్చు. వేల రకాల స్టాక్స్ ఉన్నట్టే మీ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా వందల రకాలు ఉన్నాయి. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఫ్లెక్సి క్యాప్, ఐటి ఫండ్స్ అంటూ చాలా రకాలు ఉన్నాయి. అయితే మీ రిస్క్ ఎబిలిటీ బట్టి మీ వ్యూ బట్టి మ్యూచువల్ ఫండ్స్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
లార్జ్ కాప్ ఫండ్స్
లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ లో ఎక్కువ శాతం లార్జ్ క్యాప్ కంపెనీస్ లేదా టాప్ 100 కంపెనీస్ అయినా tata motors, kotak bank, reliance లాంటి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ ని లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటారు. వీటిలో రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది.
మిడ్ క్యాప్ ఫండ్స్
ఇండియన్ స్టాక్ మార్కెట్ లో 100 నుండి 250 ర్యాంక్ ఉన్న కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ ని మిడ్ క్యాప్ ఫండ్స్ అంటారు. వీటిలో రిస్క్ కొంచెం మోడరేట్ గా ఉంటుంది.
స్మాల్ క్యాప్ ఫండ్స్
స్టాక్ మార్కెట్ లో 250 కన్నా తక్కువ ర్యాంక్ ఉన్న కంపెనీస్ లేదా 5000 కోట్ల కన్నా తక్కువ మార్క్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ ని స్మాల్ క్యాప్ ఫండ్స్ అంటారు.
ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్
టాక్స్ పేయర్స్ టాక్స్ సేవ్ చేసుకోవడానికి ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ ఇది.
డివిడెండ్ ఫండ్స్
డివిడెండ్ ఇచ్చే కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్. ఇలా చాలా రకాల ఉన్నాయి.
అంతేకాకుండా ఇన్వెస్ట్ చేసే ముందు ఆ మ్యూచువల్ ఫండ్స్ ఏ ఏ స్టాక్స్ ఇన్వెస్ట్ చేస్తాయో కూడా ముందే తెలుసుకునే అవకాశం ఉంటుంది.
ఒకవేళ మీరు నేను ఎక్కువగా రిస్క్ తీసుకుంటాను దానికి తగ్గట్టుగా ఎక్కువ రిటర్న్స్ కూడా కావాలి అనుకుంటే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా రిస్క్ తక్కువ ఉండాలి రిటర్న్స్ తక్కువ ఉన్నా పర్వాలేదు అని అనుకుంటే లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా మీ ఒపీనియన్ ని బట్టి రిస్క్ కేపబిలిటీ బట్టి తగిన మ్యూచువల్ ఫండ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు.
మరి ఏ మ్యూచువల్ ఫండ్ లో ఎక్కువ రిటర్న్స్ వస్తాయి?
ఇందాక చెప్పినట్టు హై రిటర్న్స్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్ లో రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. హై రిటర్న్స్ ఇచ్చే ఏదైనా మ్యూచువల్ ఫండ్ ఓపెన్ చేస్తే రిస్క్ ఫ్యాక్టర్ కూడా హై గా ఉండడం గమనించవచ్చు. హై రిటర్న్స్ = హై రిస్క్ అని గుర్తుంచుకోవాలి.
మరి ఎంత కాలానికి ఇన్వెస్ట్ చేయాలి?
మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ లో తప్ప వేరే ఏ ఫండ్ లో కూడా లాగిన్ పీరియడ్ అంటూ ఏమీ ఉండదు. అంటే మీరు ఎంత కాలానికి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, కానీ కాంపౌండ్ యొక్క బెనిఫిట్ పొందాలి అనుకుంటే మాత్రం వీలైనంత ఎక్కువ కాలానికి ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి.
ఉదాహరణ
మీకు ఒక చిన్న ఉదాహరణ చూపిస్తా. నెలకు ₹1000 sip చేసే వ్యక్తి యావరేజ్ గా 12% వచ్చే మ్యూచువల్ ఫండ్ లో 30 ఏళ్లకు ఇన్వెస్ట్ చేస్తే వచ్చే రిటర్న్స్ ₹3170000 దాదాపుగా. అదే వ్యక్తి ఇంకొక ఐదు సంవత్సరాలకు తన ఇన్వెస్ట్మెంట్ ని కొనసాగిస్తే తనకు వచ్చే రిటర్న్స్ ₹6575000 దాదాపు. అంటే ఆ వ్యక్తి 30 సంవత్సరాలకు ఎంత సంపాదించాడో దాదాపు కొంత అమౌంట్ నెక్స్ట్ ఐదేళ్లలో సంపాదిస్తాడు. అందుకే మీ ఇన్వెస్ట్మెంట్ ని వీలైనంత ఎక్కువ కాలం కొనసాగించండి కాంపౌండ్ యొక్క బెనిఫిట్ పొందొచ్చు.
అంతేకాకుండా మీరు మీ రిటర్న్స్ ని మాక్సిమైజ్ చేసుకోవడానికి నార్మల్ ఎస్ఐపి (SIP) కాకుండా స్టెప్ అప్ ఎస్ఐపి (Stepup SIP) ని చూస్ చేసుకోవచ్చు.
స్టెప్ అప్ ఎస్ఐపి
స్టెప్ అప్ ఎస్ఐపి అంటే మీ ఇన్వెస్ట్మెంట్ ని ప్రతి ఏడాది 10% గాని 5% గాని పెంచుకుంటూ వెళ్ళడం. ఉదాహరణకి మీరు ₹1000 sip స్టార్ట్ చేసినట్లయితే వచ్చే ఏడాది 1000 లో 10% అంటే ₹100 వచ్చే ఏడాది నుంచి 1100 sip చేయడం మొదలు పెడతారు. ఆ వచ్చే ఏడాది 1100 లో 10% అంటే 110 కలిపి 1210 sip చేయడం మొదలు పెడతారు. దీన్నే స్టెప్ అప్ ఎస్ఐపి అంటారు. ఇలా చేయడం ద్వారా నెలకి ₹1000 sip తో 30 ఏళ్లలో సంపాదించేంత అమౌంట్ 10% స్టెప్ అప్ ఎస్ఐపి తో 25 ఏళ్లలోనే సంపాదించవచ్చు.
మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మ్యూచువల్ ఫండ్స్ లో రెగ్యులర్ డైరెక్ట్ అని రెండు ప్లాన్స్ ఉంటాయి. రెగ్యులర్ ని ఎప్పుడూ సెలెక్ట్ చేయకండి. డైరెక్ట్ కంటే రెగ్యులర్ లో మీరు ఫండ్ మేనేజర్ కి పే చేసే చార్జెస్ దాన్ని ఎక్స్పెన్స్ రేషియో అంటారు. ఈ ఎక్స్పెన్స్ రేషియో డైరెక్ట్ కన్నా రెగ్యులర్ ప్లాన్ లో కాస్త ఎక్కువగా ఉంటుంది. డివిడెండ్, డివి, రీ ఇన్వెస్ట్మెంట్, గ్రోత్ ఇలా త్రీ టైప్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి. ఎప్పుడూ కూడా గ్రోత్ ఫండ్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. షార్ట్ టర్మ్ లో అంటే లాస్ట్ వన్ మంత్ లేదా లాస్ట్ త్రీ మంత్స్ రిటర్న్స్ చూసి ఎప్పుడు ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకంటే వన్ మంత్ లో 50% రిటర్న్స్ ఇచ్చే ఫండ్స్ అన్నీ కూడా వచ్చే పదేళ్లకు కూడా అదే రిటర్న్ ఇస్తాదని గ్యారెంటీ ఉండదు. అందుకే యావరేజ్ గా 3 ఇయర్స్ లేదా 5 ఇయర్స్ రిటర్న్స్ చూసి ఇన్వెస్ట్ చేయండి. మ్యూచువల్ ఫండ్స్ లో మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయడానికి బ్రౌజర్ లో లేదా మొబైల్ లో అప్ స్టాక్స్ ఓపెన్ చేసి. లాగిన్ అయ్యాక మ్యూచువల్ ఫండ్స్ పేజ్ ఓపెన్ చేయండి. మీకు కావాల్సిన మ్యూచువల్ ఫండ్ ఓపెన్ చేసి వన్ టైం బై లేదా మంత్లీ SIP అన్నది సెలెక్ట్ చేసుకోండి. ప్రతి నెల ఏ డేట్ న అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలో సెలెక్ట్ చేసుకున్న తర్వాత అమౌంట్ ఎంత ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కన్ఫర్మ్ చేస్తే పేమెంట్ లింక్ వస్తుంది. పేమెంట్ చేస్తే మీ మ్యూచువల్ ఫండ్ జర్నీ స్టార్ట్ అయిపోతుంది. అప్ స్టాక్స్ ఇంకా ఏంజెల్ వన్ లో డీమేట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ క్లిక్ చేయండి.
ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.
1 thought on “Mutual Fund in Telugu | మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి”