డబ్బులు మాట్లాడుతాయి అని మీకు తెలుసా | Money Motivation in Telugu
ఇవాళ్టి టాపిక్ లో Money Motivation in Telugu గురించి తెలుసుకుందాం.
డబ్బులు మాట్లాడుతాయి
మీ అందరికి ఒక విషయం చెప్పనా డబ్బులు మాట్లాడతాయి అలా ఎలా మాట్లాడతాయి అనే డౌట్ మీకు రావచ్చు ఈరోజు మన టాపిక్ అదే.
ఇంకా డైరెక్ట్ గా పాయింట్ కి వస్తే ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషి కామన్ గా దేని కోసం పరితపిస్తాడు అంటే మాత్రం కచ్చితంగా డబ్బు కోసం మాత్రం పరితపిస్తాడు. ఎందుకంటే ఎవరు ఎంత కష్టపడిన ఆ డబ్బు కోసం ఎవరి జీవిత లక్ష్యం ఎంత పెద్దదైనా సరే ఎండింగ్ వచ్చేసి ఆ డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క మనిషికి డబ్బు అనే పదం తెలుసు ఆ డబ్బు యొక్క విలువ తెలుసు ఆ డబ్బు అనేది ఎన్ని చోట్ల మనకు ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో ప్రతి ఒక్కరికి తెలుసు. గట్టిగా చెప్పాలంటే ఎలాంటి సమయాల్లో ఆ డబ్బు ఎలా మాట్లాడుతుంది అనేది కూడా మనకి ప్రాపర్ గా తెలుసు. కానీ ఆ డబ్బు సంపాదించడం అంత సులువైన పని అయితే కాదు. ఎందుకంటే దాని కోసం చాలా త్యాగాలు చేయాలి మనం కష్టపడి పని చేయాలి నిజం చెప్పాలంటే మన కంఫర్ట్ జోన్ నుంచి మనం బయటికి రావాలి. ఇవన్నీ చేయడం వల్ల డబ్బు వస్తుంది కానీ ఇవి చేయకుండానే చాలా మంది డబ్బు ఉన్నోళ్ళు అయిపోతున్నారు అది వేరే విషయం అనుకోండి. కానీ డబ్బు ఉన్నోళ్ళలో మెజారిటీగా ఉండే క్వాలిటీస్ డబ్బు లేని వాళ్ళలో మెజారిటీగా ఉండే క్వాలిటీస్ ఏంటి చెప్పనా ఫస్ట్ మనం డబ్బు లేని వాళ్ళలో ఆత్మాభిమానం ఎక్కువ ఉంటుంది. ఇంకా ముఖ్యంగా నిజాయితీతనం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ డబ్బులు ఉండవు. కానీ డబ్బులు సంపాదించే ప్రతి ఒక్కరి దగ్గర నిజాయితీ ఉండదు అని అనను కానీ మెజారిటీగా చాలా మంది దగ్గర నిజాయితీ ఉండదు. అందుకని వాళ్ళు అంత ధనవంతులు అవుతారు. మీరు ఏ మధ్య తరగతి కుటుంబం వాళ్ళని చూసినా సరే వాళ్ళు ఏంటంటే చాలా నిజాయితీగా ఉంటారు. నిజం చెప్పాలంటే డబ్బు ఏముందిరా ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు మనకు మనుషులు ముఖ్యం మనుషులు అంటేనే మంచోళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతూ వాళ్ళు మిడిల్ క్లాస్ జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే అది చాలా అందమైన జీవితం. కానీ కొంతమంది ఏంటంటే మనుషుల్ని పక్కన పెట్టి తన జీవితాన్ని పక్కన పెట్టి కేవలం డబ్బు కోసమే పని చేస్తూ ఉంటారు డబ్బు సంపాదించాలని ఆలోచన తప్ప వాళ్ళకి వేరే ఉద్దేశమే ఉండదు.
కానీ ఇక్కడ నేను చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే డబ్బు ఉన్న వాళ్ళకి డబ్బు లేని వాళ్ళకి కామన్ గా కావాల్సింది ఇంకోటి ఉంది అదే మనశ్శాంతి. మనశ్శాంతి అంటే అంటే నువ్వు ప్రశాంతంగా నిద్రపోగలటం ఉదయాన నిద్ర లేచి ఆనందంగా నవ్వగలగటం ఈ రెండు ఎవరి దగ్గర అయితే ఉంటాయో అది కాదు నిజమైన జీవితం అది కదా నిజంగా జీవించడం. కానీ చాలా మందికి ఆ విషయం తెలియదు అనుకోండి సరే ఈ విషయం పక్కన పెడితే.
మన పాయింట్ కి వచ్చేస్తే డబ్బు మాట్లాడుతుంది అబ్బా ఏది ఏమైనా సరే మనం ఎటువంటి కష్టాల్లో ఉన్నా సరే ఎటువంటి బాధల్లో ఉన్నా సరే ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా సరే మనం ఎక్కడున్నా సరే ఎప్పుడైనా సరే ఎక్కడికైనా సరే మన డబ్బు గనుక మన పక్కన ఉంటే అది ఖచ్చితంగా మాట్లాడుతుంది. ట్రాఫిక్ పోలీస్ పట్టుకున్న ఏదైనా కేసు ఉండి పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన లేక లేకపోతే మనం సరదాగా ఎమ్మెల్యే అవ్వాలన్నా ఎంపీ అవ్వాలన్నా సరే కచ్చితంగా ఆ సమయంలో డబ్బు మాట్లాడుతుంది. కానీ నా పాయింట్ ఏంటంటే డబ్బుని మనం ఎలా సంపాదించాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం డబ్బు సంపాదించే ప్రాసెస్ లో చాలా కష్టపడుతూ ఉంటాం నిద్ర లేని రాత్రులు గడుపుతూ ఉంటాం అయినా సరే మనం మన గోల్ అచీవ్ చేస్తున్నాం అనే ప్రాసెస్ లో మనకు వచ్చే ఆ కిక్ ఉంటదో చూశారు అది మామూలుగా ఉండదు ఎంత ఆనందాన్ని ఇచ్చిద్ది అంటే అంత ఆనందాన్ని ఇచ్చిద్ది. కానీ అక్రమంగా డబ్బు సంపాదించిన వాడికి ఆ కిక్ ఉండదు. నిజం చెప్పాలంటే నిద్ర కూడా ఉండదు డబ్బులు ఎవడి కోసం సంపాదిస్తున్నాం ఎందుకు సంపాదిస్తున్నాం అనే పాయింట్ తెలియక పాపం సంపాదిస్తూనే ఉంటాడు చివరికి ఆ డబ్బు కోసం తన పక్కన ఉన్నవాళ్లే తనకి అన్యాయం చేస్తారు. ఓవరాల్ గా అర్థమైంది అనుకుంటున్నాను.
నేను మళ్ళీ ఇంకోసారి చెప్తాను ఏది ఏమైనా సరే డబ్బు అనేది ప్రాపర్ ప్లానింగ్ తో న్యాయంగా సంపాదిస్తే మాత్రం దాంట్లో ఉండే ఆనందమే వేరు, అందులో వచ్చే మజానే వేరు. కానీ అన్యాయంగా నువ్వు ఏ రోజైతే డబ్బులు సంపాదిస్తావో అక్రమంగా ఎప్పుడైతే డబ్బులు సంపాదిస్తావో ఆ డబ్బు ఖచ్చితంగా అలాగే పోతుంది. ఎందుకంటే నువ్వు కష్టపడి డబ్బులు సంపాదించే ప్రాసెస్ లో ఆ డబ్బుని ఎలా సేవ్ చేయాలనే ఆలోచన నీకు వస్తుంది. కానీ అనుకోకుండా రాత్రికి రాత్రి నువ్వు ఏదో ఒక తప్పు చేసి డబ్బులు సంపాదిస్తే దాన్ని సేవ్ చేయలేక దాని నుంచి బయట పడలేక అంత డబ్బుని అసలు హ్యాండిల్ చేయలేక నువ్వు పడే తిప్పలు ఉంటే చూసావు అది మామూలుగా ఉండదు. కాబట్టి డబ్బు మన మాట వినేలా చేయాలి, డబ్బు మాట్లాడేలా చేయాలి. అంతేగాని డబ్బు సంపాదించే ప్రాసెస్ లో మనకు మనం అన్యాయం చేసుకొని మనం అనుకునే వాళ్ళని దూరం చేసుకొని చివరికి ఆ డబ్బు నీకే అన్యాయం చేసేలా అస్సలు చేసుకోకూడదు. కాబట్టి నేను చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే డబ్బు ఖచ్చితంగా మాట్లాడ పడిద్ది మన సమస్యలో ఉన్నప్పుడు మనకు అండగా ఉంటది మనం హాస్పిటల్ లో ఉన్నప్పుడు మనకు ఆరోగ్యాన్ని ఇస్తది. కానీ నువ్వు నిజాయితీగా సంపాదిస్తే నీ చుట్టూ హెల్తీ అట్మాస్ఫియర్ ఉంటది. కానీ నువ్వు గనక దాన్ని అక్రమంగా సంపాదిస్తే నీకు ఉన్న మనశాంతి పోయి లేని రోగాలు తేల్చుకొని ఏరుకోరి హాస్పిటల్ లో పడతావ్. నిజం చెప్పాలంటే బతకాల్సిన దానికన్నా చాలా ఎర్లీగా చచ్చిపోతావ్. అది నా పాయింట్. డబ్బులు ప్రాపర్ గా సంపాదించండి ప్లానింగ్ గా సంపాదించండి కష్టపడి సంపాదించండి క్లారిటీగా సంపాదించండి అంతేగాని ఎలా పడితే అలా తప్పు ధరలు అస్సలు సంపాదించకండి ఉన్న మనశ్శాంతి పోద్ది దాన్ని ఎవడు తీసుకురాలేడు నీ మనశ్శాంతి కేవలం నీకు నువ్వు ఇచ్చుకునే గిఫ్ట్. కాబట్టి నీ మనశ్శాంతిని నీకు నువ్వు గిఫ్ట్ గా ఇచ్చుకో నీ మనశ్శాంతిని పోగొట్టుకునే పనులైతే అస్సలు చేయొద్దు.
ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.