మీ మనస్సు ని డిటాక్స్ ఎలా చేస్తారు | Mind Detox in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

మీ మనస్సు ని డిటాక్స్ ఎలా చేస్తారు – Mind Detox in Telugu

ఇవ్వాల్టి టాపిక్ లో Mind Detox in Telugu గురించి తెలుసుకుందాం అండి

మనస్సును డీటాక్స్ చేయడం ఎలా

మన శరీరాన్ని ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంచుకోవాలన్నా దేహాన్ని చురుకుగా ఉంచుకోవాలి అన్నా మనం కొన్ని రకాల వ్యాధుల బారిన పడకుండా రక్షించుకోవాలి అన్నా మన శరీరాన్ని అప్పుడప్పుడు డిటాక్స్ చేస్తూ ఉండాలి.

డిటాక్సిఫికేషన్ అంటే దేహంలో పేరుకొని పోయినటువంటి వ్యర్థాలని విష పదార్థాలని శరీరం నుంచి బయటకు పంపించేయడం. ఎలా బయటకు పంపిస్తాం అంటే కొన్ని కఠిన ఆహార నియమాల ద్వారా ప్రత్యేకమైనటువంటి ఆహార పదార్థాల ద్వారా కొన్ని ప్రత్యేకమైనటువంటి పానీయాలను తీసుకోవడం ద్వారా మన శరీరంలో పేరుకొని పోయినటువంటి వ్యర్థాలని బయటకు పంపిస్తాం. దీన్నే మనం నిర్విషీకరణ అంటాం. డిటాక్స్ చేసుకోవడం ఫర్ ఎగ్జాంపుల్ హనీ లెమన్ వాటర్ తాగితే బాడీ డిటాక్స్ అవుతుంది అని తెలుసు ఈ మధ్యన ఈ విషయంలో చాలా మందికి అవేర్నెస్ పెరిగిపోయింది. మన ఆరోగ్యం మీద చాలా మంది శ్రద్ధ పెడుతున్నారు. ఇది మంచి శుభ పరిణామమే. అయితే దీనివల్ల లాభం ఏంటి అంటే బాడీ అనేది రీజనరేట్ అవుతుంది. కణాలు నూతన ఉత్తేజం పొందుతాయి యాక్టివేట్ అయిపోతాయి. మన సెల్యులర్ సిస్టం అంతా కూడా మళ్ళీ మనం చురుకుగా అవుతది మన దేహం ఇమ్యూనిటీ పవర్ పెరుగుతది. ఒక రకమైనటువంటి బాడీలో ఒక గ్లోనెస్ అనేది వచ్చేస్తది ఇది మంచిదే కదా ఓకే ఇది చాలా మందికి ఈ మధ్యన చాలా మంది చాలా మంది దీన్ని ఫాలో అవుతున్నారు.

అయితే నేను ఇక్కడ చెప్పాలనుకున్న విషయం ఏంటి అంటే మరి మన దేహాన్ని చురుకుగా ఉంచుకోవడానికి దేహంలోని లోని అన్ని అవయవాలు సక్రమంగా పని చేయడానికి మనం యాక్టివ్ గా ఉండడానికి మన దేహాన్ని డిటాక్స్ చేస్తున్నాం. ఓకే మరి మన దేహాన్ని నడిపించి మన జీవితాన్ని నడిపించి మన నిత్య జీవితంలో జరిగే సంఘటనలకు ప్రతిస్పందించే మన మెదడును కూడా మన ఆలోచనల్ని కూడా మన బ్రెయిన్ ని డిటాక్స్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్.

బ్రెయిన్ డిటాక్స్ ఏంటి దీని కోసం ఏమైనా ప్రత్యేకమైనటువంటి పదార్థాలు ఉన్నాయా ప్రత్యేకమైనటువంటి పరికరాలు ఉన్నాయా ఒక్కసారి ఆలోచించండి. మనం యాక్టివ్ గా ఉండాలి అంటే బాడీ డిటాక్సిఫికేషన్ ఎంత అవసరమో అంతకు మించి బ్రెయిన్ డిటాక్సిఫికేషన్ అవసరం. మనం బ్రెయిన్ యాక్టివ్ గా ఉండి ఆలోచన పరంగా మనం చాలా సానుకూలంగా ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా దాని ప్రభావం మన శరీరం మీద కూడా పడుతుంది. పాజిటివ్ మైండ్ తో ఉన్న వాళ్ళ యొక్క శరీరం ఎప్పుడూ కూడా యాక్టివ్ గా ఉంటుంది. కాబట్టి మనం శరీరాన్ని ఒక్కటే కాదు శరీరాన్ని డిటాక్స్ చేసుకుంటూ పరిశుభ్రంగా ఉంచుకుంటూ బ్రాండెడ్ సోప్ వాడుతూ లేదా బ్రాండెడ్ పర్ఫ్యూమ్స్ వాడుతూ మనం చాలా పరిశుద్ధంగా ఉన్నాము అనుకోగానే సరిపోదు ఎప్పటికప్పుడు మన బ్రెయిన్ ని కూడా డిటాక్స్ చేసుకుంటూ ఉండాలి. మన మెదడుకి కూడా చాలా తుప్పు పట్టిపోతుంటది దాన్ని వాష్ చేస్తూ ఉండాలి. మన మెదడుకు దుమ్ము పట్టిపోతుంటది దాన్ని దులిపేస్తూ ఉండాలి. బ్రెయిన్ వాష్ బ్రెయిన్ కి మన ఇల్లు దులిపితే ఇల్లు ఎలా కలకలలాడుతదో మన మెదడును కూడా ఎప్పటికప్పుడు దులిపేస్తూ ఉండాలి మరి.

బ్రెయిన్ ని డిటాక్సిఫికేషన్ ఎలా జరుగుతుంది

జీవితంలో సంతోషంగా ఉండడం ఎలా | Happy Life Tips in Telugu
జీవితంలో సంతోషంగా ఉండడం ఎలా | Happy Life Tips in Telugu

బ్రెయిన్ ని దులిపేయడం అంటే ఏంటి మెదడుకి డిటాక్సిఫికేషన్ ఎలా జరుగుతుంది అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఒక చిన్న చెరువు ఉంది చెరువులో గనుక పూడిక తీయకపోతే చెరువు పనికొస్తదా చెప్పండి దానిలో చెత్త చెదారం పేరుకొని పోతది అవునా కాదా. తర్వాత దాని నిండా వ్యర్థ పదార్థాలు పేర్కొని పోయి వ్యర్థమైనటువంటి కలుపు మొక్కలు. ఫర్ ఎగ్జాంపుల్ గుర్రపు డెక్కాకు చూడండి చెరువుల్లో పెరిగిపోతే అక్కడ దాని యొక్క బి ఓడి సిఓడి లో చేంజెస్ వచ్చేసి ఆటోమేటిక్ గా ఆ నీరంతా వ్యర్థమైపోతుంటది వాటర్ పొల్యూషన్ పెరిగిపోతుంది అవునా సో మనం ఆ చెరువు మనకు ఉపయోగకరంగా ఉండాలి అన్నా ఆ నీరు మనకు ఉపయోగపడాలి అన్నా ఏం చేయాలి చెరువులో పూడిక తీయాలి పూడిక తీస్తేనే చెరువు పరిశుభ్రం అవుతది కొత్త నీరు కింది నుంచి ఊరుతూ వస్తది వాటర్ ఫ్రెష్ గా కనపడతది. జలజీవరాశులకి మళ్ళీ అది అంటే జలజీవరాశులకు మంచి ఆక్సిజన్ సప్లై అవుతది అవునా కాదా ఒక నీటి చలిమ ఉంది చలిమను తీసేటప్పుడు ఏం చేస్తాం ఇసుకను తోడుతా ఉంటే ఫ్రెష్ వాటర్ వచ్చేస్తది సేమ్ అలాగే మన మెదడు కూడా అంతే మన నిత్యం మనం ఎదుర్కొంటున్నటువంటి సంఘటనలు మన పరిసరాల ప్రభావము మన చుట్టూ ఉన్నటువంటి మనుషుల ప్రభావం కావచ్చు, మనం ఎదుర్కొంటున్నటువంటి ఏవైనా కావచ్చు, ప్రాబ్లమ్స్ కావచ్చు, అవమానాలు కావచ్చు, విమర్శలు కావచ్చు ఆ మన నిత్య జీవితంలో మనం ఎన్నో ఫేస్ చేస్తూ ఉంటాము.

ఈ అసలు జీవితం అంటే అంటేనే హృదయం గుండె కొట్టుకోవడం శ్వాస తీసుకోవడం. ఈ రెండు ఒకటేనా ఈ రెండు పని చేస్తే మెదడు పని చేయకపోతే మనం బ్రతికున్నట్టేనా లేదు బ్రెయిన్ డెడ్ అంటాం. అప్పుడు ఆ దేహం ఉండి కూడా వేస్ట్ అయితే నిత్యం మన ప్రతి పని మెదడు తోటి ముడిపడి ఉంది మన ఆలోచనలతోటి ముడిపడి ఉంటాయి. మీరు ఇప్పుడు వింటున్నారు అంటే నా మాటల్ని మీ బ్రెయిన్ పనిచేస్తుంది. నేను మీకు చెప్తున్నాను నా మాటల్ని భావాల రూపంలో అంటే నా బ్రెయిన్ పనిచేస్తుంది అవునా కాదా. కాబట్టి ప్రతిదీ మెదడుతో ముడిపడి ఉన్నప్పుడు మెదడు నుంచి జనించే మన ఆలోచనల్ని కూడా మనం యాక్టివ్ గా ఉంచుకోవాలి. నిత్య నూతనంగా ఉంచుకోవాలి, నిత్య ఉల్లాసంగా ఉంచుకోవాలి, చాలా సానుకూల దృక్పదంతో ఉంచుకోవాలి, ఇలా ఉంచుకోవాలి అంటే ఇప్పుడు నేను మీకు చెప్పినటువంటి ఎగ్జాంపుల్ లో ఒక చెరువును కూడిక తీసినట్టుగా మన మెదడులో పేరుకొని పోయినటువంటి చెత్త చెదారాన్ని కలుపు మొక్కల్ని ఎప్పటికప్పుడు బయటికి తీసేస్తూ ఉండాలి.

మనం డస్ట్ బిన్ లో చెత్తను అలాగే వేస్తూ పోయాం ఏమవుతది చెప్పండి దుర్వాసన వస్తది అవునా కాదా డస్ట్ బిన్ దగ్గర ఎవరైనా ఆహ్లాదంగా కూర్చోగలుగుతామా లేదు కంపు కొడతది ఎప్పుడైతే ఆ చెత్తను బయట పడేసి ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతామో ఆ దుర్వాసన అనేది పోతది. అదేవిధంగా మన మెదడులో పేరుకొని పోయే ఈ చెత్త ఏంటిది ఆ చెత్త అంటే రకరకాల మాటలు వ్యతిరేక భావాలు ప్రతికూల ధోరణలు నెగిటివ్ ఆలోచనలు అవునా కాదా భయాలు అనవసర ఆందోళనలు అనవసర పంచాయతీలు అనవసరంగా పట్టింపులు అలకలు వ్యర్థ ప్రసంగాలు ఇలాంటి చెత్త అంతా మన బ్రెయిన్ లో వేరుకొని పోతుంటాయి చూసారా వీటన్నింటిని కూడా ఎప్పటికప్పుడు బ్రెయిన్ లో నుంచి తీసేయాలి మనకి ఏది అవసరమో దాన్నే స్టోర్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తూ ఉండాలి మనం మొబైల్ లో డిలీట్ చేయకపోతే ఏమవుతది చెప్పండి పేరుకొని పోయి డేటా అంతా అయిపోయి మొబైల్ పని చేయదు మన బ్రెయిన్ కూడా అంతే ఎప్పటికప్పుడు అనవసరమైనటువంటి వాటిని డిలీట్ చేస్తేనే అక్కడ స్పేస్ ఉండి వర్క్ అవుట్ అవుతుంది. మన బ్రెయిన్ లో కూడా ఎప్పటికప్పుడు వాటిని మనం డిలీట్ చేస్తేనే బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది కాబట్టి మిమ్మల్ని నొప్పించే విషయాలని మిమ్మల్ని బాధ పెట్టే విషయాలని మిమ్మల్ని వెనక్కి లాగే విషయాలని మీ టైం ని వేస్ట్ చేసే విషయాలని మీకు అనవసరమైనటువంటి విషయాలని అనవసరమైనటువంటి జ్ఞాపకాలని బాధించే జ్ఞాపకాలని చెడు ఆలోచనల్ని వీటన్నింటిని కూడా మెదడులో నుంచి తీసేసి ఎప్పుడూ కూడా దాన్ని సానుకూలంగా ఉంచుకోవడమే బ్రెయిన్ డిటాక్సిఫికేషన్. అంతేకాదు బ్రెయిన్ చురుకుగా ఉండాలి అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా వ్యర్థాన్ని ఎలా అయితే మన బ్రెయిన్ లో నుంచి తీసేస్తుంటే ఏ రోజుకి ఆ రోజు.

Mind Detox in Telugu

నేను ఒక మాట చెప్తాను ఎప్పుడు కూడా నా స్టూడెంట్స్ కి నైట్ మరణించి పొద్దున్నే మళ్ళీ పుట్టినట్టుగా ఉండాలి. మన జీవితం అంటే మనం పడుకునేటప్పటికే మన బ్రెయిన్ లో నుంచి కొన్ని ఆలోచనలు తీసేసేయాలి. ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టారా వాళ్ళని క్షమించేసేయండి. పడుకునేటప్పుడు ఎన్నాళ్ళు పట్టించుకుంటాం పట్టించుకుంటే మన మీదనే భారం పెరిగిపోతది. ఎప్పటికప్పుడు భారాన్ని దించుకోకపోతే ఆ భారాన్ని మన గుండె మోయాలి, మన మెదడు మోయాలి. అవసరమా మనకి లేదు కదా ఎవరైనా బాధ పెడితే క్షమించేసేయండి మీరు ఎవరినైనా బాధ పెడితే వాళ్ళని క్షమించమని అడగండి తప్పు లేదు ప్రణమిల్లండి తప్పు లేదు మనసు తేలిక అయిపోతది పడుకునేటప్పటికి ఆ రోజు చేసిన తప్పులన్నిటిని మైండ్ లో నుంచి తీసేసేయండి సరేనా. ఈరోజు నేను ఈ తప్పు చేశాను రేపు నేను చేయకూడదు ఈరోజు నేను చేసిన నిర్ణయం కరెక్ట్ కాదు నేను నన్ను నేను మార్చుకోవాలి. నేను ఫలానా వాళ్ళని నేను ఒప్పించాను రేపటి నుంచి నేను ఆ పని చేయకూడదు ఎప్పటికప్పుడు పడుకునేటప్పుడే మన బ్రెయిన్ క్లీన్ చేసుకొని నెక్స్ట్ డే మళ్ళీ రీబర్త్ అనుకోని ఫ్రెష్ గా ఆలోచనని స్టార్ట్ చేస్తే ఒక్కసారి లైఫ్ ని ఇమాజిన్ చేసుకోండి ఎంత అద్భుతంగా ఉంటుంది. మీరు ఎంత అద్భుతమైనటువంటి మనుషులుగా బయట వాళ్ళకి కనిపిస్తారు అవునా కాదా అదేవిధంగా కేవలం మన బ్రెయిన్ లో ఉన్నటువంటి ఈ చెత్త ఆలోచనలు తీసేసినప్పుడు మాత్రమే మన బ్రెయిన్ లో మంచి సానుకూల ఆలోచనలు జనించడానికి అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని మీరు మర్చిపోకండి.

చెరువులో కొత్త నీరు ఊరినట్టుగా చెలిమిలో కొత్త నీరు ఊరినట్టుగా బావిలో కొత్త నీరు ఊరినట్టుగా పాతది తీసేస్తేనే కొత్తది వచ్చి చేరుతుంది. ఆహా ఎంత హాయిగా అనిపిస్తుంది కదా ఒక్కసారి మైండ్ లో ఉన్నటువంటి బాధించే విషయాలన్నిటిని తీసి పడేసేయండి. దట్ ఇస్ ద బెస్ట్ డిటాక్సిఫికేషన్ టు బ్రెయిన్ ఓకేనా.

నెక్స్ట్ అంతేకాదు మనల్ని మనం చురుకుగా ఉంచుకోవడానికి ఇంకొన్ని చేయాలబ్బా ఏంటివి అవి అంటే మంచి మనుషులతోటి సాంగత్యం సజ్జన సాంగత్యం అంటారు చూసారా నెగిటివ్ పీపుల్ తో మనం మాట్లాడుతున్నంత సేపు మన ఆలోచనలు కూడా నెగిటివ్ అయిపోయి వాళ్ళ ప్రభావం మన మీద పడి మనం అనవసరంగా బాధపడిపోతుంటాం మాక్సిమం పాజిటివ్ పీపుల్ కి దగ్గరగా ఉండి నెగిటివ్ పీపుల్ కి దూరంగా ఉండండి ఈ దేవుడు రెండు చెవులు ఇచ్చాడు ఎందుకు అంటే ఈ చెవిలో విని ఆ చెవిలో వదిలేయమని మంచిని మాత్రమే గుండెలోకి దించేసుకోండి మిగతా వాటిని ఒక చెవితో విని ఇంకొక చెవి తోటి బయటకు వదిలేసేయండి.

ధనవంతులయ్యే వాళ్ళకి ఉండే లక్షణాలు | Rich Habits in Telugu
ధనవంతులయ్యే వాళ్ళకి ఉండే లక్షణాలు | Rich Habits in Telugu

అంతేకాకుండా నెక్స్ట్ మనం బ్రెయిన్ ని డిటాక్స్ చేసుకుంటూ ఉండాలి అంటే సజ్జన సజ్జనుల తోటి సాంగత్యం ఎంత అవసరమో మంచి మంచి పుస్తకాలు చదవడం కూడా అంతే అవసరం. మంచి మోటివేషన్ ఇచ్చే విధంగా మీకు ప్రేరణ ఇచ్చే మంచి మంచి కొటేషన్స్ ని చదువుతూ ఉండండి మధ్య మధ్యలో మీకు ప్రేరణ ఇచ్చేటటువంటి పుస్తకాలు చదవండి ప్రేరణ ఇచ్చే వాళ్ళు యొక్క మాటలు వినండి మోటివేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో. ఒక్కొక్కసారి అబ్బా నాకు ఏం చేయబుద్ది కావట్లేదు అనిపిస్తది కానీ మంచి మోటివేషనల్ స్పీచ్ వినగానే మీరు లేచి నిలబడతారు అది చాలా ఇంపార్టెంట్ కూడా ఓకేనా. అయితే కొంతమంది వింటూనే కూర్చుంటారు దాన్ని ఆచరించరు ఆచరణ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు మంచి పుస్తకం చదివిన మంచి పుస్తకంలో ఉన్నటువంటి సారాంశాన్ని మీరు ఆచరించగలగాలి మంచి మోటివేషనల్ స్పీచ్ ఉన్నా కూడా వాళ్ళు చెప్పినవి మీరు ఆచరించగలగాలి మిమ్మల్ని ప్రేరేపించినటువంటి వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలో వాళ్ళు చేసిన పనుల్ని మీరు ఆచరించగలగాలి అప్పుడే మన జీవితం మారుతుంది. కాబట్టి మోటివేషన్ ఇన్స్పిరేషన్ కలిగించేటటువంటి విషయాలని మోటివేషన్ ఇచ్చేటువంటి విషయాలను చర్చించుకోవడము చదవడము లేదా వినడం ద్వారా కూడా మీకు బ్రెయిన్ అనేది యాక్టివేట్ అవుతుంటది.

ఒక్కొక్కసారి పనిలో మనకి మొనాటనీ అనిపిస్తది అబ్బా రోజు అదే పని రోజు అదే పని బోర్ అనిపిస్తది లైఫ్ అప్పుడు కూడా బ్రెయిన్ అనేది నిస్తేజం అవుతది కాబట్టి అప్పుడప్పుడు బయటికి వెళ్తుండండి మీకు నచ్చిన వాళ్ళతోటి ఒక సినిమాకో, ఒక షికారుకో, లేకపోతే ఒక విండో షాపింగ్ కో వెళ్ళండి. విండో షాపింగ్ అనేది కూడా బ్రెయిన్ లో ఉన్నటువంటి స్ట్రెస్ ని తీసేస్తది అనవసరమైన వాటిని కొని ఖర్చులు పెంచుకోకండి. అందుకే నేను విండో షాపింగ్ అన్నాను విండో షాపింగ్ కి వెళ్ళడం వల్ల అప్డేట్ అవుతారు ఏం వస్తున్నాయి మార్కెట్ లోకైనా తెలుస్తది కాస్త బయట జనాలను చూడటం వల్ల కూడా మనం అప్డేట్ అవుతుంటాం. కాబట్టి విండో షాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్రెయిన్ చాలా రిలాక్స్ అవుతది.

అదేవిధంగా ఒక మంచి దేవాలయానికి మీకు నచ్చిన దైవం ఒక టెంపుల్ కి వెళ్లి కాస్త ప్రశాంతంగా కూర్చోండి ఒక గార్డెన్ ని ఒక తోటను చూస్తూ కూర్చోండి. పూల మొక్కల్ని పరిశీలించండి చల్లటి వాతావరణంలో సేద తీరండి చల్లటి గాలికి కాస్త కూర్చోండి ఎప్పుడు మొబైల్ కాకుండా చల్లటి గాలి లేదా మీకు నచ్చిన పాటలు వినండి మంచి మ్యూజిక్ అదేవిధంగా మీ చిన్నప్పటి ఆల్బమ్స్ ఉంటాయి చూసారా మీ చిన్ననాటి ఫుడ్ ఫోటోలను తిరిగేయండి. మీ చిన్ననాటి ఫోటోస్ తీసుకున్నప్పుడు కొన్ని మంచి జ్ఞాపకాలను మిమ్మల్ని స్పృశిస్తాయి అప్పుడప్పుడు జ్ఞాపకాల పెట్టె తెరవడం కూడా చాలా ఇంపార్టెంట్ మన మనసు ఉత్తేజం అవుతది. మనకి ఇష్టమైన వాళ్ళు మన మనసులో మెదులుతారు చూసారా మనకి ఇష్టమైన రోజులు మనం ఆడిన ఆటలు, విన్న పాటలు ఇవన్నీ కూడా మనకి బ్రెయిన్ ని యాక్టివేట్ చేసేటివే. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మనల్ని మళ్ళీ మనం పునరుత్తేజం చెందిస్తాయి. మంచి మ్యూజిక్ వినండి మీకు ఇష్టమైన నాకు చాలా ఇష్టం నేను అప్పుడు అప్పుడప్పుడు మనసు బాలేకపోతే నేను పాటలు వింటాను. అసలు పాటలు ఉంటే చాలు ఆ పాటలు మోగుతూనే ఉంటాయి నా పనులు నేను చేసుకుంటూనే ఉంటాను. సో నాకు చాలా ఇష్టం అదే విధంగా మంచి బుక్స్ చదువుతుంటాను మంచి మంచి కొటేషన్స్ చదవడం సో ఇలా బ్రెయిన్ యాక్టివేట్ యాక్టివేట్ చేసుకోవచ్చు. మనం అది కూడా బ్రెయిన్ డిటాక్సిఫికేషన్.


అదే విధంగా కంపల్సరీగా క్రమం తప్పని వ్యాయామం ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే బాడీలో ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి డోపమైన్ రిలీజ్ అవుతుంది.
పాజిటివ్ కెమికల్స్ రిలీజ్ అయ్యి శరీరాన్ని ఎప్పుడు కూడా యాక్టివ్ గా ఉంచుతుంది. బ్రెయిన్ ని యాక్టివ్ గా ఉంచుతది నిజంగా చెప్పాలంటే కార్డియో ఎక్సర్సైజెస్ వల్ల స్ట్రెస్ నుంచి మనం బయట పడతాం. బ్రెయిన్ నుంచి స్ట్రెస్ అంతా వెళ్ళిపోతది కాబట్టి ఎక్సర్సైజ్ చేయడం, మెడిటేషన్ చేయడం. కాబట్టి వీటన్నిటిని ఆదరిస్తూ మీరు కూడా మీ బ్రెయిన్ ని ఎప్పటికప్పుడు దుమ్ము దులిపేసుకుంటూ డిటాక్స్ చేసుకుంటారని ఆశిస్తున్నాను.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Deepu, I am the Writer and Founder of this blog and share all the information related to Blogging, SEO, Internet, Review, WordPress, Make Money Online, News and Technology through this website.

Sharing Is Caring:

1 thought on “మీ మనస్సు ని డిటాక్స్ ఎలా చేస్తారు | Mind Detox in Telugu”

Leave a Comment