Malai Kofta Recipe Restaurant Style – రెస్టారెంట్ స్టైల్ లో మలై కోఫ్తా కర్రీ
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Malai Kofta Recipe Restaurant Style – రెస్టారెంట్ స్టైల్ లో మలై కోఫ్తా కర్రీ గురుంచి తెలుసుకుందాం రండి. ఆరోగ్యం ఆహరం మీద ఆధారపడి ఉంటుందని అందరికి తెలిసిన విషయమే, అయితే చాలా మంది ఆహార నియమాలు పాటించడం కష్టంగా భావిస్తారు. అలాంటి వారికి రుచికరంగా ఉండి ఆరోగ్యాన్ని ఇచ్చే ‘మలై కోఫ్తా’ ఎలా చేయాలో చూద్దాం.
మలై కోఫ్తా తయారీకి కావలసిన పదార్థాలు
- ఉడకపెట్టిన బంగాళదుంపలు – 5
- పన్నీరు తురుము – 1/2 కప్పు
- వేయించిన పుట్నాల పప్పు పొడి – 1/2 కప్పు
- పెరుగు – 1/2 కప్పు
- కొబ్బరి తురుము – 1/2 కప్పు
- ఉల్లిపాయ ముక్కలు – 1/2 కప్పు
- పచ్చిమిర్చి ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్
- మొక్కజొన్న పిండి – 2 టేబుల్ స్పూన్స్
- ఖర్బూజ గింజలు – 2 టేబుల్ స్పూన్స్
- జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్స్
- కిస్మిస్ – 1 టేబుల్ స్పూన్
- అల్లంతురుము – 1 టేబుల్ స్పూన్
- మీగడ – 1 టేబుల్ స్పూన్
- అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
- జీలకర్ర – 1 టీ స్పూన్
- మిరియాలపొడి – 1 టీ స్పూన్
- జీలకర్ర పొడి – 1 టీ స్పూన్
- లెమన్ జ్యూస్ – 1 టేబుల్ స్పూన్
- దాల్చిన చక్క – 2 చిన్న ముక్కలు
- యాలకులు – 2
- లవంగాలు – 3
- కరివేపాకు – కొద్దిగా
- ఉడికించిన బంగాళా దుంప ముక్కల్ని బౌల్లో వేసి చిదమాలి.
- దీనిలో మిరియాల పొడి, జీలకర్ర పొడి, పచ్చిమిర్చి, కిస్మిస్, జీడిపప్పు ముక్కలు, వేసి కలపాలి.
- పుట్నాల పప్పు పొడి కూడా వేయాలి.
- ఇవి ఒక బౌల్లో లడ్డులా చేసి పెట్టాలి.
- మొక్కజొన్న పిండి కాస్త పలుచగా చేసి వాటిలో ఈ బాల్స్ ముంచి మీగడ రాసిన నాన్సిక్ పాత్రలో అమర్చాలి.
- ఒకవైపు బాల్స్ కాలిన తర్వాత, తిప్పి మరోవైపు కూడా కాలనివ్వాలి.
- ఇవి కాల్చి పక్కన పెట్టుకోవాలి.
- ఒక నాన్ స్టిక్ పాత్ర స్టవ్ మీద ఉంచి, అందులో
- యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ముక్కలు, జీడిపప్పు ముక్కలు వేయాలి.
- ఖర్బూజ గింజలు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి.
- మిక్సీజార్ లో ఇవన్నీ వేసి, పెరుగు వేసి గ్రైండ్ చేయాలి.
- దీనిలో కొబ్బరి తురుము వేసి మరోసారి మెత్తగా తిప్పి పక్కన పెట్టుకోవాలి.
- మరొక నాన్ స్టిక్ పాత్ర స్టవ్ మీద పెట్టి మీగడ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర వేసి వేగిన తర్వాత మిక్సీ చేసిన పేస్ట్ దీనిలో పొయ్యాలి.
- తర్వాత ఎనిమిది నిమిషాలు ఉడకనిచ్చి నిమ్మ రసం వేయాలి.
- ఇప్పుడు బంగాళా దుంప బాల్స్ దీనిలో వేసి పైన కొత్తిమీర డ్రెస్సింగ్ చేయాలి.
బయట తినే ఆహారాలు కంటే ఇలా ఇంట్లోనే చేసుకోవడం ఆరోగ్యం. ఇలాంటి రెసిపీలు ఆదివారం లాంటి స్పెషల్ డేస్ లో తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.