బ్రతికితే సింహంలా బ్రతకాలి – Lion Story in Telugu
ఇవాళ్టి టాపిక్ లో Lion Story in Telugu గురించి తెలుసుకుందాం
మామూలుగా సింహం అనే పేరుని సినిమాలో ఎక్కువగా వాడినప్పుడు నాకు ఇంతకు ముందు ఏమనిపించేది అంటే సింహం అనేది అడవికి రాజు కాబట్టి ఆ సింహంతో సినిమా హీరోని పోలుస్తున్నారు ఆ క్యారెక్టర్ ని పోలుస్తున్నారు అని చెప్పి అనుకునే వాడిని కానీ నాకు తర్వాత తెలిసింది ఏంటంటే లయన్ మెంటాలిటీ తో హీరో క్యారెక్టర్ ని డిజైన్ చేస్తారు. అంతే కాకుండా లయన్ మెంటాలిటీని బేస్ చేసుకొని ఆ కథలో హీరో క్యారెక్టర్ ఉంటుందని చెప్పేసి. లయన్ మెంటాలిటీ అంటే ఏంటి అని చాలా మందికి డౌట్ రావచ్చు. అంతే కాకుండా లయన్ మెంటాలిటీని మనం గనక కొంచెం కాపీ చేసి మన జీవితంలో కూడా కొంచెం పేస్ట్ చేసాం అనుకోండి మన జీవితంలో కొన్ని భయంకరమైన మార్పులు వస్తాయి ఇది మాత్రం గ్యారెంటీ. బేసికల్ గా అడవిలో సింహాన్ని రాజుగా పిలుస్తారు దీని వెనకాల ప్రధాన కారణం ఆ సింహానికి ఉండే బలం అయితే కాదు దాని యొక్క బిహేవియర్ అలాగే దాని యొక్క ధోరణి. మన జీవితంలో విజయం సాధించడానికి ఆ బిహేవియర్ ఆ ధోరణి ఎలా ఉపయోగపడుతుందో కొంచెం తెలుసుకుందాము.
ఫస్ట్ అఫ్ ఆల్ సింహానికి ఉండే మొట్టమొదటి గొప్ప లక్షణం ఏంటంటే భయం లేని ధైర్యం మామూలుగా బయట చాలా మందికి కొంచెం ధైర్యం ఎక్కువే ఉంటుంది. కాకపోతే వాళ్ళ ధైర్యం వెనకాల కొంచెం భయం కూడా ఉంటుంది కానీ సింహం అలా కాదు భయం లేని ధైర్యం అనేది సింహానికి ఎక్కువే ఉంటుంది. అంతే కాకుండా సింహం ఎప్పుడూ భయపడదు ఎంత పెద్ద ప్రాణం ఎదురైనా సరే వెనక్కి తగ్గదు. అలాగా మన జీవితంలో కూడా ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ఎంత పెద్ద కఠినమైన పరిస్థితులు వచ్చినా సరే భయపడకుండా ధైర్యంగా వాటిని ఎదుర్కొనాలి. భయం అనేది ఎప్పుడైనా సరే మనిషికి ఓటమిని కొంచెం దగ్గరికి తీసుకురావడానికి సహకరిస్తుంది. కాబట్టి మనం భయపడకూడదు ధైర్యం మాత్రం మనిషిని విజయం వైపు నడిపిస్తుంది ఎందుకంటే ధైర్యం ఇచ్చే కిక్కు ధైర్యం ఇచ్చే బలం అంతా ఇంత కాదు. కాబట్టి ప్రతి ఒక్క మనిషికి భయం లేని ధైర్యం కావాలి.
అంతే కాకుండా సింహంలో ఉండే రెండో గొప్ప విషయం ఏంటంటే సంకల్ప బలం అనేది సింహానికి చాలా ఎక్కువగా ఉంటుంది. లక్ష్యం దగ్గరకు వచ్చినప్పుడల్లా సింహం ఏంటంటే చాలా సంకల్పంతో ఉంటుంది గట్టిగా నిలబడుతుంది. తను ఏ విషయం మీద అయితే నిలబడిందో దాన్ని సాధించేంత వరకు వెనకడుగు వేయదు. మన జీవితంలోనూ ఇటువంటి లక్షణం అనేది చాలా ముఖ్యమైనది. మనకి ఏ లక్ష్యం ఉన్నా సరే దాన్ని పూర్తి చేసేంత వరకు కష్టపడాలి ఏ మనిషికైనా అయితే తను ఖచ్చితంగా సాధించగలడు అనే సంకల్పం ఉంటుందో అస్సలు విజయం సాధించకుండా ఉండడు. కాబట్టి మీరు కూడా సంకల్ప బలాన్ని పెంచుకోండి.
ఇంకా సింహంలో ఉండే మూడో గొప్ప లక్షణం ఏంటంటే అనువర్తనం అంటే సింహం తన చుట్టూ ఉండే పరిస్థితులకి అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటుంది. అది ప్రతిసారి సమర్ధంగా మారుతుంది మనం కూడా పరిస్థితులకి అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవాలి కానీ మన లక్ష్యాలని కాదు. కాబట్టి అనువర్తనం అనేది ప్రతి ఒక్క మనిషికి చాలా అవసరం. చాలా మంది ఏమనుకుంటారంటే పరిస్థితులు వచ్చినప్పుడు కొంచెం కృంగిపోతూ ఉంటారు భయపడిపోతూ ఉంటారు బాధపడిపోతూ ఉంటారు ఇక చెప్పాలంటే వాళ్ళ జీవిత లక్ష్యాన్ని వాళ్ళు అక్కడే వదిలేసి వేరే చోటకి వెళ్ళిపోతారు. కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే అనువర్తనం అనేది ప్రతి ఒక్క మనిషికి చాలా అవసరం.
ఇంకా సింహంలో ఉండే మరో గొప్ప లక్షణం ఏంటంటే నిరంతర శక్తి వినియోగం. మామూలుగా సింహం ఏంటంటే అనవసరంగా శక్తిని వృధా చేయదు గాని అవసరమైన సమయంలో శక్తిని పూర్తిగా ఉపయోగిస్తుంది. మనం కూడా మన సమయాన్ని మన శ్రామికతని అంటే మనం కష్టపడే తత్వాన్ని మనం ఖచ్చితంగా ఒక సమయంలో దాన్ని యూస్ చేసి తీరాలి. ఇలాంటి ఒక గొప్ప లక్షణం ఉండబట్టే సింహం అనేది అడవికి రాజు అయింది. పని చేయడానికి మనలోనే మనకి తెలియని ఒక కొత్త శక్తిని కనుగొనటం అనేది సింహం నుంచి మనం నేర్చుకోవాల్సిన అత్యంత గొప్ప విషయం. చాలా మంది ఏంటంటే వాళ్ళకి పని చేసే అంత శక్తి ఉన్నా కూడా ఆ శక్తిని ఉపయోగించడానికి వాళ్ళకి ఏదో ఒక శక్తి అడ్డు వస్తుంది. అది బద్ధకం అవ్వచ్చు లేకపోతే ప్రోక్రాస్టినేషన్ అవ్వచ్చు అది కూడా కాకపోతే వాళ్ళని వాళ్ళు తక్కువ అంచనా వేసుకోవడం అవ్వచ్చు. ఏది ఏమైనా సరే ఆ క్షణం ఆ సమయం నేను ఈ పని చేయడానికే పుట్టాను ఈ పని చేయకపోతే నేను చచ్చిపోతాను అనే రేంజ్ లో మనం మన లక్ష్యం కోసం సమయం వచ్చినప్పుడు మనం కష్టపడకపోతే నాకు తెలిసినంత వరకు మన పుట్టుకకే ఒక అర్థం ఉండదు.
అంతే కాకుండా సింహంలో మనకి ఉపయోగపడే ఇంకో గొప్ప లక్షణం ఏంటంటే నమ్మకం. సింహం తన సామర్థ్యం పై పూర్తి నమ్మకం కలిగి ఉంటుంది అది మనకు ఒక గొప్ప పాఠం మన జీవితంలో మనం కూడా ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ చేసేటప్పుడు ఫస్ట్ అఫ్ ఆల్ మన మీద మనకి నమ్మకం ఉండాలి. నేను చేయగలను అనే ఆలోచన కలిగి ఉంటే మీరు ఆల్మోస్ట్ ఆ పనిలో సక్సెస్ సాధించినట్లే. అలా కాకుండా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకున్న మీకు 1% అందులో డౌట్ ఉన్నా సరే మీరు ఓటమిని ముందుగానే అంగీకరించినట్లు అవుతుంది. కాబట్టి సింహం ఎలాగైతే తన సామర్థ్యం పై పూర్తి నమ్మకాన్ని ఉంచుతుందో మీరు కూడా మీ సామర్థ్యం పై అంతే నమ్మకాన్ని ఉంచాలి.
ఇంకా ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే మన జీవితంలో మనకంటూ ఒక లక్ష్యం ఉన్నప్పుడు మనం లయన్ మెంటాలిటీని కలిగి ఉంటే మనం కచ్చితంగా మన జీవిత లక్ష్యాన్ని సాధించే తీరుతాము అది ఎంత పెద్ద లక్ష్యం అయినా సరే. సింహం లాగా ధైర్యం సంకల్పం నిబద్ధత మరియు నమ్మకంతో ముందుకు సాగితే జీవితంలో ఎంత పెద్ద శిఖరాన్ని అయినా సరే మనం అధిరోహించగలం. మన జీవితాన్ని అలాగే మన మైండ్ సెట్ ని లయన్ లాగా బిల్డ్ చేసుకుంటూ ఉంటే మనం కచ్చితంగా మన జీవితంలో ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకుంటామో ఆ లక్ష్యాన్ని మాత్రం అచీవ్ చేస్తాము ఇది మాత్రం గ్యారెంటీ. కాబట్టి లైన్ మెంటాలిటీ తో ఉండండి మామూలు మనుషుల్లాగా ప్రతి చిన్న విషయానికి భయపడుతూ మిమ్మల్ని మీరు అనుమానించుకుంటూ ఉంటే మాత్రం మీ లక్ష్యాన్ని చేరుకోవడం చాలా కష్టమైపోతుంది. కాబట్టి లైన్ మెంటాలిటీని అలవాటు చేసుకోండి మీ జీవితం ఖచ్చితంగా మారిపోతుంది. ఈ టాపిక్ మీకు ఉపయోగపడింది అనుకుంటేనే షేర్ చేయండి, అంతే కాకుండా కామెంట్ చేయండి.