మనలో మనం మార్చుకోవాల్సినవి ఇవే – How to overcome competition in Telugu
ఇవాళ్టి టాపిక్ లో How to overcome competition in Telugu గురించి తెలుసుకుందాం.
మనకి తెలిసి చేస్తున్న పెద్ద తప్పులు
మామూలుగా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషి పోటీ పడుతూనే వాడి వాడి జీవితంలో వాడు సక్సెస్ అవుతూ ఉంటాడు. ఉదాహరణకి వాడు ఉద్యోగంలో పోటీ పడి మరి ప్రమోషన్ తెచ్చుకుంటాడు. ఇంకో ఉదాహరణ వాడు మామూలుగా ఒక క్రికెట్ మ్యాచ్ ఆడితేనే కచ్చితంగా నేను అందులో గెలిచి తీరాలి అని చెప్పేసి తన ఆపోజిట్ టీమ్ అయిన 11 మందితో పోటీ పడి మరి ఆడతాడు. బేసికల్ గా మనం ప్రపంచంతో పోటీ పడే ముందు మనం ఖచ్చితంగా పోటీ పడవలసిన వ్యక్తి ఇంకొకళ్ళు ఉన్నారు అది ఎవరో కాదు మనమే. మనతో మనం పోటీ పడవలసిన పాయింట్లు కొన్ని ఉన్నాయి అన్నమాట వాటిని నేను ఈరోజు మీకు చెప్తాను.
BAD HABITS
ఇంకా డైరెక్ట్ గా పాయింట్ లోకి వెళ్తే ఫస్ట్ అఫ్ ఆల్ మనతో మనం పోటీ పడవలసిన మొట్టమొదటి పాయింట్ ఏంటంటే బ్యాడ్ హ్యాబిట్స్. ప్రతి ఒక్కళ్ళకే బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి చాలా మంది ఏమనుకుంటారంటే మందు తాగటం సిగరెట్లు తాగటం లేకపోతే మిగతావి ఏవో అనుకుంటారు కానీ బ్యాడ్ హ్యాబిట్స్ అంటే మీరు టైం కి నిద్ర పోకపోవడం కూడా బ్యాడ్ హ్యాబిట్. అంతేకాకుండా సరైన సమయంలో సరైన ఆహారం తీసుకోకపోవడం కూడా బ్యాడ్ హ్యాబిట్. నన్ను అడిగితే ఒక 100 సంవత్సరాల క్రితం మంచికి చెడుకి తేడా తెలుసుకోవడం కొంచెం కష్టమేమో కానీ ఇప్పుడున్న టెక్నాలజీకి మనకి మనం మంచి చెడు తేడాలు తెలుసుకోవడం పెద్ద విషయం ఏం కాదు. కాకపోతే మనకి అన్ని తెలిసి కూడా మనం బ్యాడ్ హ్యాబిట్స్ కి చాలా దగ్గరగా ఉంటున్నాము. అంతేకాకుండా ఒక 100 సంవత్సరాల క్రితం సరిగా చదువుకోని వ్యక్తి కూడా ఆరోగ్యం పట్ల ఒక అవగాహనతో 100 సంవత్సరాలు బతికి చూపించారు. కాకపోతే ఇప్పుడు ఏంట్రా మనం అంటే చేతిలో టెక్నాలజీ పెట్టుకొని మనకి ఏది మంచో మనకి ఏది చెడో తెలుసుకొని కూడా మన అలవాట్లు మనం మార్చుకోలేకపోతున్నాము. నిజం చెప్పాలంటే రోజుకో బ్యాడ్ హ్యాబిట్ మనం పెంచుకుంటూ పోతున్నాము. కాబట్టి మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ ని మనం తప్పకుండా కంట్రోల్ చేసుకోవాలి అలా చేసుకోకపోతే మనమే నష్టపోయేది.
DISTRACTION
ఇంకా మనతో మనం పోటీ పడవలసిన రెండో పాయింట్ ఏంటంటే డిస్ట్రాక్షన్స్. మామూలుగా మన జేబులో ఉండే మన సెల్ ఫోను మనకి తెలియకుండా మనల్ని ఎంత డిస్ట్రాక్ట్ చేస్తుందో మనందరికీ తెలుసు. అయినా సరే మనం మాత్రం అదేదో కొంచెం రిలాక్స్ అవ్వడానికి బ్రెయిన్ కొంచెం రిలీఫ్ అవ్వడానికి అని చెప్పేసి మనకు మనం కొన్ని అబద్ధాలు చెప్పుకొని మనకు తెలియకుండా మన జీవితాన్ని మనం పూర్తిగా నాశనం చేసుకుంటున్నాం. నేను చెప్పవచ్చేది ఏంటంటే మామూలుగా మనం ఒక అద్భుతమైన సినిమా చూసేటప్పుడు ఎవడైనా వచ్చి మనల్ని డిస్టర్బ్ చేస్తే ఎలా ఫీల్ అవుతామో అలాగే మనం ఒక పని చేసుకునేటప్పుడు మన జేబులో ఉండే సెల్ ఫోన్ నోటిఫికేషన్స్ మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తున్నాయి అనుకోండి ఎలా ఉంటుంది ఒకవేళ చేస్తే చేశాయి వాటిని మనం టర్న్ ఆఫ్ చేసుకున్నాం అనుకోండి ఓకే అలా కాకుండా అది నోటిఫికేషన్ మోగినప్పుడల్లా మనం ఫోన్ తీసుకొని చూసుకుంటూ వాటిలో ఎంత సమయం గడుపుతామో మనకు తెలియదు అందులో నుంచి మనం ఎప్పుడు బయటికి వస్తామో మనకి అస్సలు తెలియదు. అలాగా మన పనిని డిస్ట్రాక్ట్ చేసే సెల్ ఫోన్ అవ్వచ్చు, కొంతమంది మనుషులు అవ్వచ్చు వీటన్నిటితో మనం కొంచెం జాగ్రత్తగా ఉండి మనం మన పని నుంచి డిస్ట్రాక్ట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి పని నుంచి డిస్ట్రాక్ట్ అవ్వకుండా మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి. అలా కనక తీసుకోకపోతే మిమ్మల్ని ఎవడు బాగు చేయలేడు.
INSECURITIES
ఇంకా మనతో మనం పోటీ పడవలసిన మూడో పాయింట్ ఏంటంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. బేసికల్ గా ప్రతి ఒక్క మనిషిలో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది. ఒక పని చేసేటప్పుడు లేకపోతే ఒక వ్యాపారం చేసేటప్పుడు లేదా ఒక కొత్త ఊరికి వచ్చి జీవితాన్ని ప్రారంభించేటప్పుడు ప్రతి ఒక్కరికి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది ఎందుకంటే మనందరం మనుషులం. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ని మనం అధిగమించాలంటే పెద్ద పెద్ద విషయాలు ఏం చేయాల్సిన అవసరం లేదు మనం కొంచెం ప్రాక్టికల్ గా ఉంటే చాలు మన పొజిషన్ లో ఉన్నప్పుడు ఎవరెవరు ఏం చేశారు అని తెలుసుకుంటే చాలు. అంతకు మించి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క పని మనం ఇప్పుడు చేస్తున్నది ఇంతకు ముందు ఎవరో ఒకళ్ళు చేసి ఉంటారు అది ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు లేకపోతే బయట వాళ్ళు అవ్వచ్చు. మనం ప్రాక్టికల్ గా ఉండటం వల్ల ఏమైద్ది అంటే గెలుస్తాం లేకపోతే ఓడిపోతాం అంతకు మించి ఏమైద్ది అనే ఒక నిర్ణయానికి వచ్చేస్తాము. దాని వల్ల ఆల్మోస్ట్ మనం గెలిచాము అనే ఫీలింగ్ వస్తుంది అసలు సెక్యూరిటీ ఫీలింగ్ అనేది మనకు ఉండదు. కాబట్టి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వస్తున్నప్పుడు కొంచెం ప్రాక్టికల్ గా ఉండండి మీతో మీరు మీలా ఉండండి అంతేగాని నేను తప్పకుండా గెలిచి తీరాలి అనుకుంటే మాత్రం ఈ ప్రపంచంలో ఓడిపోయిన మనిషి ఎవరున్నారు. కాబట్టి కొంచెం ప్రాక్టికల్ గా ఉండండి.
EGO
ఇంకా మీతో మీరు పోటీ పడవలసిన నాలుగో పాయింట్ ఏంటంటే ఈగో మామూలుగా ప్రతి ఒక్క మనిషిలో కొంచెం ఈగో ఉంటుంది అవునన్నా కాదన్నా దాన్ని మీరు కొంచెం పక్కన పెట్టండి. కాకపోతే కొంతమందికి ఈగో ఎలా ఉంటుంది అని డౌట్ రావచ్చు. ఎందుకంటే మనలో ఉన్న కూడా మనకు తెలియదు ఆ ఈగో ఎలా ఎలా ఉంటుందంటే పాపం జీవితంలో కొంచెం కష్టపడే వాళ్ళని చూస్తే సక్సెస్ అయినోడికి కొంచెం చిన్న చూపు ఉంటుంది దాన్నే ఈగో అంటారు. ఎందుకంటే ఈ భూమి మీద ఎప్పుడు ఎవడు ధనవంతుడు అవుతాడు ఎప్పుడు ఎవడు పేదవాడు అవుతాడు అని ఎవడు చెప్పలేవు. ఎందుకంటే డిపెండింగ్ ఆన్ పరిస్థితులు ఉదాహరణకి కరోనాలో ఎంతమంది డబ్బు ఉన్నోళ్ళు అయ్యారో మనకు తెలుసు కరోనాలో ఎంతమంది పేదవాళ్ళు అయ్యారో కూడా మనకు తెలుసు అసలు రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు మనం ఎంత నష్టపోతామో తెలియదు ఎంత సంపాదిస్తామో అసలు తెలియదు. అలాంటిది మనకన్నా ఒక మెట్టు తక్కువ ఉన్నవాడిని చిన్న చూపు చూడటం ఎందుకు మనకన్నా ఒక మెట్టు పైన ఉన్నవాడిని వీడు మనకంటే గొప్పోడురా అనే ఫీలింగ్ తో చూడటం ఎందుకు. నేను ఏమంటానంటే ఈ ఈగోలు కొంచెం పక్కన పెట్టండి వీడు గొప్పోడు కాబట్టి గౌరవించాలి వీడు వాడి కన్నా తక్కువోడు కాబట్టి మనం అంతగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి కొంచెం తారతమ్యంగా ఉండకుండా ప్రతి ఒక్కరిని మనిషిలా ట్రీట్ చేయండి అలా చేయటం వల్ల కచ్చితంగా మీకు మీ జీవితంలో వాళ్ళు ఉపయోగపడతారు. ఎందుకంటే మీరు ఈగో తో ఉండటం వల్ల మీకు నష్టం తప్ప వేరే వాళ్ళకి అస్సలు నష్టం అయితే లేదు.
DISCIPLINE
ఇంకా మనతో మనం పోటీ పడవలసిన ఐదో పాయింట్ లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ డిసిప్లిన్. మీరు ఈ లైఫ్ లో ఎంత సక్సెస్ అయినా సరే మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే మీకు డిసిప్లిన్ లేకపోతే మీ జీవితంలో ఆ సక్సెస్ ఆ డబ్బు మరి కొన్ని రోజుల్లో మీ నుంచి దూరమైపోతాయి. నేనేమంటున్నానంటే డిసిప్లిన్ అనేది కచ్చితంగా ఒక మనిషికి అవసరం అది పని పట్ల అవ్వచ్చు డబ్బు పట్ల అవ్వచ్చు లేకపోతే జీవితం పట్ల అవ్వచ్చు ఆ డిసిప్లిన్ అనేది లేకపోతే మనం ఎంత సాధించినా ఎంత సక్సెస్ అయినా సరే వృధానే. కాబట్టి డిసిప్లిన్ అనేది ప్రతి ఒక్క మనిషికి చాలా అవసరము అలా గనక లేకపోతే బహుశా మీ రోజు ఈరోజు సక్సెస్ అయి ఉండొచ్చు కానీ కొన్ని రోజుల్లో మీ సక్సెస్ పోతుంది ఎందుకంటే మీరు డిసిప్లిన్ గా లేరు కాబట్టి. ఒకవేళ మీరు మీ జీవితంలో డిసిప్లిన్ గా ఉన్నా కూడా ప్రస్తుతానికి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు అనుకోండి మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు మీకున్న డిసిప్లిన్ వల్ల మీరు మీ జీవితంలో తప్పకుండా సక్సెస్ అవుతారు అది డిసిప్లిన్ కి ఉన్న పవర్ అదండి సంగతి. మనతో మనం ఫస్ట్ పోటీ పడదాం ఆ తర్వాత ప్రపంచంతో పోటీ పడదాం.
ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.
1 thought on “మనలో మనం మార్చుకోవాల్సినవి ఇవే | How to overcome competition in Telugu”