స్టాక్ మార్కెట్‌లో ఎలా పెట్టుబడి పెట్టాలి – How to Invest in Share Market Telugu
ఇవాళ్టి టాపిక్ లో How to Invest in Share Market Telugu గురించి తెలుసుకుందాం.
స్టాక్ మార్కెట్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి?
అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? ఐపిఓ అంటే ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? మరియు ఇందులో ఎవరెవరు ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది ఒక బిగినర్ కి అర్థమయ్యేలా ఈ టాపిక్ లో చెప్పబోతున్నాను.
స్టాక్ మార్కెట్ అంటే ఏంటి
ఫర్ సపోజ్ నాకు ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉంది. ఎగ్జాంపుల్ అదొక క్లాత్ స్టోర్ అనుకుందాం, అది చాలా బాగా రన్ అవుతుంది కదా అని నేను వేరే ప్లేసెస్ లో కూడా నా క్లాత్ స్టోర్ ని లాంచ్ చేయాలనుకున్నాను కానీ దాని కోసం చాలా మనీ కావాలని అర్థమైంది. తర్వాత అప్పు తీసుకుందామని బ్యాంకు వెళ్తే వాళ్ళు అడిగినంత ఇవ్వట్లేదు అండ్ ఇచ్చే మనీకి కూడా ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ అనిపించింది. తర్వాత నాకు వచ్చిన ఆలోచన స్టాక్ మార్కెట్. నాకు కావాల్సిన మనీని స్టాక్ మార్కెట్ ద్వారా రైస్ చేసి నా కంపెనీని స్టాక్ మార్కెట్ లో లిస్ట్ చేశా. ఇప్పుడు ఏంటంటే సెబి రూల్స్ ప్రకారం నేను ప్రతి క్వార్టర్ నా కంపెనీలో జరిగే ప్రాఫిట్స్ అండ్ లాస్ అనేవి స్టేక్ హోల్డర్స్ కి కూడా తెలియజేయాలి. కాబట్టి ఈ నెంబర్స్ ని బట్టి స్టాక్ ప్రైస్ లో పెరగడం కానీ తగ్గడం కానీ అవుతుంటుంది.
IPO అంటే ఏంటి
ఐపిఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ అంటే నేను ఇంతకుముందు చెప్పిన దాంట్లో నా కంపెనీని గ్రో చేయడానికి మనీ రేస్ చేశా అన్నాను కదా దాన్నే ఐపిఓ అంటారు. ఈ ఐపిఓ వల్లే ఇన్వెస్టర్స్ షేర్స్ కొని నాకు కావాల్సిన మనీని ఇచ్చారు. ఇక మార్కెట్ లో లిస్ట్ అయ్యాక ఆ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ గ్రోత్ ని బట్టి స్టాక్ ప్రైస్ మూమెంటమ్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాది క్లాత్ స్టోర్ కాబట్టి యూజువల్ గా మనమంతా డ్రెస్సెస్ ఎప్పుడు కొంటుంటాం ఏదైనా ఫెస్టివల్స్ లేదా మ్యారేజ్ సీజన్ అప్పుడు కొంటుంటాం కదా. ఇంకో 2 మంత్స్ లో మ్యారేజ్ సీజన్ వస్తుంది అండ్ డ్రెస్సింగ్ సేల్స్ పెరిగే ఛాన్స్ ఉంది అన్నప్పుడు మనం ఆ స్టాక్స్ ని కొనిపెట్టుకుంటాం. ఎప్పుడైతే సేల్స్ పెరగడం మొదలైందో ఆటోమేటిక్ గా ప్రాఫిట్స్ కూడా పెరుగుతాయి కంపెనీకి ప్రాఫిట్స్ పెరిగితే స్టాక్ ప్రైస్ కూడా పెరుగుతుంది. ప్రైస్ పెరిగినప్పుడు మనం వాటిని అమ్మేసి ప్రాఫిట్ ని బుక్ చేసుకోవచ్చు ఇది జస్ట్ ఫర్ మీ అండర్స్టాండింగ్ పర్పస్ మాత్రమే. ఇలా చాలా ఫ్యూచర్ గ్రోయింగ్ కంపెనీస్ మార్కెట్ లో లిస్ట్ అయ్యి ఉన్నాయి. అవి మనం అనాలసిస్ చేసి కరెక్ట్ టైం లో స్టాక్స్ బై చేసినట్లయితే మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ని ఈజీగా పొందొచ్చు.
ముచ్యువల్ ఫండ్ అంటే ఏంటి
మ్యూచువల్ ఫండ్ విషయానికి వస్తే వీళ్ళు చేసేది కూడా సేమ్ స్టాక్స్ కొంటారు అండ్ ప్రాఫిట్స్ లేదా లాస్ వచ్చినప్పుడు అమ్మేస్తుంటారు. ఫర్ సపోజ్ ఒక 1000 మెంబెర్స్ కి స్టాక్ మార్కెట్ పైన ఎలాంటి నాలెడ్జ్ లేదు అండ్ ఎలా అనాలసిస్ చేయాలో కూడా తెలియదు అలాంటి వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ లో మనీని ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఫండ్ మేనేజర్స్ ఉంటారు వాళ్ళు అనాలసిస్ చేసి స్టాక్స్ కొంటూంటారు అండ్ అందులో వచ్చే ప్రాఫిట్స్ లో 1% వాళ్ళు కమిషన్ తీసుకొని మిగతావి మనకి ఇస్తారు. మ్యూచువల్ ఫండ్స్ లో SIP మోడ్ ఇంకా Lumsum మోడ్ ఉంటాయి. మనం శాలరీడ్ ఎంప్లాయ్ అయితే ప్రతి మంత్ సేమ్ డేట్ కి మనీ ఇన్వెస్ట్ చేసేలా చేయాలంటే SIP మోడ్ లో చేయాలి అండ్ మనకు నచ్చిన డేట్ లో అంటే Lumsum లో ఇన్వెస్ట్ చేయొచ్చు. యూజువల్ గా మనం ఏదైనా వస్తువు ప్రైస్ చూస్తే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎంత ప్రైస్ ఉందో ఇప్పుడు దానికన్నా ఎక్కువే ఉంటుంది అంటే మనం కొనే ప్రతి వస్తువు ప్రైస్ ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటాయి. దానికి తగినట్టు మన సేవింగ్స్ కూడా పెరగాలంటే ఇన్వెస్ట్మెంట్ అనేది బెటర్ ఆప్షన్. మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మనకి 6 నుంచి 8% సంవత్సరానికి రిటర్న్స్ వస్తాయి. అదే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే యావరేజ్ గా మోర్ దెన్ 15% రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు మార్కెట్ అనేది చాలా పడిపోయింది.
ఇప్పుడు నువ్వు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడానికి సరైన సమయం అదేంటి మార్కెట్ పడుతుంటే ఇన్వెస్ట్ చేయమంటున్నా అనుకుంటున్నారా, ఫర్ సపోజ్ యూజువల్ గా రైస్ బ్యాగ్ ప్రైస్ అనేది 1500 కి 25 kg ఉంటుంది ఒక్కసారిగా ₹1000 కి ఉంచితే చాలా మంది వెళ్లి కొంటారు కదా ఎందుకంటే ₹500 డిస్కౌంట్ లో వస్తుంది. కాబట్టి మళ్ళీ పెరిగితే కొనలేము కావచ్చు అని కొంటుంటారు సేమ్ అలానే స్టాక్ మార్కెట్ లో కూడా ఏదో రీజన్ వల్ల మనకి ఇప్పుడు చాలా స్టాక్స్ అనేవి డిస్కౌంట్ లో ఉన్నాయి.
ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్ లో చాలా వెల్త్ క్రియేట్ చేయొచ్చు అండ్ నువ్వు స్టాక్స్ లో గాని మ్యూచువల్ ఫండ్స్ లో గాని ఇన్వెస్ట్ చేయాలంటే నీకు తప్పకుండా డిమాట్ అకౌంట్ అనేది ఉండాలి. మనకి ఎలాంటి యాన్యువల్ చార్జెస్ లేకుండా మనకి చాలా ట్రస్టెడ్ అయిన ఏంజెల్ వన్ (Angel One)డీమాట్ అకౌంట్ ఓపెనింగ్ లింక్ ని కింద ప్రొవైడ్ చేశాను. కావున వెళ్లి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి మీ ఇన్వెస్ట్మెంట్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి ఇలాంటి కంటెంట్ మీకు ఇంకా కావాలంటే మన బ్లాగ్ ని ఫాలో చేసుకోండి..
ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.
1 thought on “స్టాక్ మార్కెట్‌లో ఎలా పెట్టుబడి పెట్టాలి | How to Invest in Share Market Telugu”