అవమానాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి – How to face insult & criticism in telugu
ఇవాళ్టి టాపిక్ లో How to face insult & criticism in telugu గురించి తెలుసుకుందాం.
అవమానాన్ని ఎలా ఎదుర్కోవాలి
జీవితంలో ఎవరికైనా అవమానం ఎదురయ్యే అవకాశం ఉంది. మీరు ఎంత శ్రద్ధగా ఉన్నా ఎప్పుడో ఒకప్పుడు మీకు అవమానం ఎదురవుతుంది. అలాంటి సందర్భాల్లో మనం ఎలా స్పందిస్తాం అన్నది చాలా ముఖ్యము ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ కూడా అదే. ప్రతి ఒక్కరికి జీవితంలో అవమానాలు ఎదురవుతాయి అలా ఎదురయ్యే అవమానాలని ఎలా ఎదుర్కోవాలి అనేదే. ఇక డైరెక్ట్ గా పాయింట్ లోకి వస్తే ఫస్ట్ అఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అవమానాల్ని ఈ ప్రపంచంలో ఎవరైనా సరే అంగీకరించాలి. నేను చెప్పొచ్చేది ఏంటంటే యాక్సెప్ట్ ద ఇన్సల్ట్ మీరు ఇన్సల్ట్ ని యాక్సెప్ట్ చేసినప్పుడే మీకు ఒక కొత్త జీవితం స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా మీరు ఆర్గ్యూ చేశారనుకో మీ జీవితం అక్కడే ఆగిపోతుంది మొదట మనం అవమానాన్ని అంగీకరించడం నేర్చుకోవాలి. ఒక మనిషికి అవమానం అనేది ఎదురైంది అనుకోండి అది ఆ మనిషిని తక్కువ చేసో లేకపోతే తగ్గించేసో మనిషిని కూర్చోబెడుతుందని కాదు. నా విషయానికి వస్తే అవమానం అనేది అనేది మీ వ్యక్తిగత ఎదుగుదలకి చాలా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా అవమానం ఎప్పుడూ ఒక వ్యక్తిని తగ్గించదు అది ఆ మనిషిలో ఉన్న బలాన్ని బయటకు తీస్తుంది అది కూడా ఎప్పుడూ మీరు అవమానాల్ని యాక్సెప్ట్ చేసినప్పుడు. యాక్సెప్ట్ చేసి అవమానాల్ని అర్థం చేసుకుంటే మీ ఎదుగుదలకి మొట్టమొదటి మెట్టుగా అవమానాన్ని వాడుకోవచ్చు.
ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఏ మనిషి అయినా సరే అవమానాన్ని తీసుకోవడం అంత ఈజీ కాదు. నేను చెప్పొచ్చేది ఏంటంటే మనకి ఎదురయ్యే ప్రతి ఒక్క అవమానానికి మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ యువర్ రియాక్షన్స్ అంటే మీ రియాక్షన్లు కూడా మీరు కంట్రోల్ చేసుకోవాలి. మనకు అవమానం ఎదురయ్యే సమయంలో మన రియాక్షన్ ఎలా ఉంటుందో అది అత్యంత కీలకం. శాంతంగా ఉండండి మనసులో ఆవేశం రాకుండా చూసుకోండి మీరు దానిపై ఎలా స్పందిస్తారు అన్నది మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. కాబట్టి అవమానం ఎదురైనప్పుడు మీ రియాక్షన్ ని కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.
ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనలో ఉన్న టాలెంటెడ్ పర్సన్ ని బయటికి తీసుకొచ్చేది కూడా అవమానమే. ఎందుకంటే మనల్ని ఎవరో తక్కువ చేసి మాట్లాడతారు దాని వల్ల మన రియాక్షన్ అనేది మన జీవితానికి ఉపయోగపడేలా ఉండాలి. కానీ మనల్ని అవమానించిన వాడి మీద రివెంజ్ తీర్చుకునేలా అస్సలు ఉండకూడదు అంటే నీకు ఆ పని చేత కాదు నువ్వు జీవితంలో దేనికి పనికిరావు అని చెప్పి ఎవరైనా మనల్ని తక్కువ చేసి మాట్లాడారు అనుకోండి మనం అతని మీద రివెంజ్ తీర్చుకోవాలంటే అతన్ని కొడితే సరిపోతుంది అతన్ని తిడితే సరిపోతుంది మనం కూడా అతను ఏదైతే మాట్లాడు అన్నాడో సేమ్ అదే మాటలు మనం కూడా అంటే సరిపోతుంది. కానీ అలా కాకుండా మీ రియాక్షన్ ని మీరు కంట్రోల్ చేసుకొని ఆ అవమానాన్ని కొంచెం సీరియస్ గా కన్సిడర్ చేసి మీ జీవితానికి ఉపయోగపడేలాగా మీరు జీవితంలో కష్టపడ్డారు అనుకోండి ఈ రియాక్షన్ ఎలా ఉంటుంది. కాబట్టి మనల్ని ఎవరైతే అవమాన పరుస్తారో వాళ్ళకి మనం థాంక్స్ చెప్పాలి వాళ్ళ వల్లే మనకి ఒక మోటివేషన్ దొరుకుతుంది మన జీవితంలో మనం పని చేయడానికి ఒక మోటివ్ ఉంటుంది.
ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ మనిషి అయినా సరే అవమానం వెనుకున్న కారణాన్ని అర్థం చేసుకోరు. దాని వల్ల కూడా మనిషి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు. ఒక మనిషి మనల్ని అవమానించినప్పుడు ఆ వ్యక్తి అలా ఎందుకు అన్నాడో తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే మనల్ని చాలా మంది అవమానిస్తూ ఉంటారు వాళ్ళు మనల్ని కావాలని చెప్పి ఇబ్బంది పెడుతున్నారా లేకపోతే 10 మంది ముందు మనల్ని అవమానించి వాళ్ళు ఆనంద పడుతున్నారా లేకపోతే నిజంగా మనలో ఉన్న లోపాలు వాళ్ళు మనకి చెప్తున్నారా అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. కనుక మనం ఒక మనిషి మన మనల్ని అవమానించినప్పుడు దాని వెనుకున్న కారణం తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలా తెలుసుకోవడం వల్ల అవతల వ్యక్తి నిజంగానే మనలో ఉన్న మైనస్ లు మనకు చెప్తున్నాడా లేకపోతే వాడు పగ తీర్చుకోవడానికి మనల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాడా అని చెప్పేసి మీరు ప్రాపర్ గా అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకుంటేనే మిమ్మల్ని ఎవరైనా అవమానించినా కూడా వాటిని ఎదుర్కోవడానికి మీకు చాలా అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా వాడు వాంటెడ్ గా మనల్ని తక్కువ చేసి మాట్లాడాడు అనుకోండి మనం వాడికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాడు కావాలని మనం తక్కువ చేసి మాట్లాడుతున్నాడు వాడు అన్నంత మాత్రాన మనం తక్కువ వాళ్ళం అయిపోము అలా అని చెప్పేసి వాడు పొగిడినంత మాత్రాన మనం పెద్దవాళ్ళం అయిపోము. కానీ మనలో ఉన్న తప్పులు మనకి ఎవరన్నా వచ్చి చెప్పినప్పుడు వాటిని ప్రాపర్ గా అనాలసిస్ చేసుకొని వాటిని సరిదిద్దుకుంటే బాగుపడేది మన జీవితమే కదండీ. కాబట్టి ఎవరన్నా వచ్చి మనల్ని అవమానిస్తే ఆ కారణాలు ఏంటో తెలుసుకొని కొంచెం అనాలసిస్ చేసుకోండి.
ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనల్ని ఎవరైనా అవమాన పరిచినప్పుడు మనం ధైర్యంగా ఉండాలి. అవమానం ఎదుర్కోవడంలో ధైర్యం ఎంతో అవసరం దానిని స్వీకరించి మీలో శక్తిని అంచనా వేసి మీ లక్ష్యం వైపు ముందుకు సాగాలి. అంతేగాని మీరు మీలో ఉన్న ధైర్యాన్ని పోగొట్టుకొని మీరు ఎంతో బాధపడిపోయి పక్కన కూర్చొని బాధపడ్డారు అనుకో ఎవరికి నష్టం. కాబట్టి మీలో ఉన్న ధైర్యాన్ని అంగీకరిస్తే ఎవరు ఏం చెప్పినా మీరు నిర్దాక్షణంగా ముందుకు సాగుతారే తప్ప వాళ్ళు అన్న మాటలకి బాధపడిపోయి మీరు అక్కడే ఆగిపోరు. కాబట్టి ఎవరైనా మనల్ని అవమాన పరిచినప్పుడు ఫస్ట్ అఫ్ ఆల్ మనం ధైర్యంగా ఉండాలి.
అంతే కాకుండా ఎవరైనా సరే మనల్ని అవమానించినప్పుడు మనం తీసుకోవాల్సిన ఇంకొక జాగ్రత్త ఏంటంటే అవాయిడ్ సీకింగ్ రివెంజ్ ప్రతీకారం కోసం పరిగెత్తడం అనవసరం అది మీకు మరింత నష్టాన్ని కలిగిస్తుంది. ప్రతీకారం అనేది జీవితంలో ఉన్న మనశ్శాంతిని దూరం చేస్తుంది అందులోనూ కొత్త సమస్యల్ని సృష్టిస్తుంది. కాబట్టి మనల్ని ఎవరైనా అవమాన పరిచారు అనుకోండి మీరు వెంటనే వాళ్ళ మీద రెవెన్యూ తీర్చుకునే ప్లాన్ ని వేయకండి వాళ్ళతో గొడవ పడిపోయి అందరి ముందు నేనే గొప్ప అని చెప్పేసి మీకు మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు సైలెంట్ గా ఉండి మీ విజయంతోనే వాళ్ళకి సమాధానం చెప్పాలి తప్ప హడావుడిగా వాళ్ళ మీద మీరు దుమ్మెత్తి పోసి నువ్వు ఎంత అంటే నువ్వు ఎంత అని వాళ్ళని మీరు అవమానించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవతలి వాళ్ళు మనల్ని తక్కువ చేసి మాట్లాడటంలో రెండు పాయింట్లు ఉంటాయి అని చెప్పి ఇందాకే మనం అనుకున్నాం. ఒకటి మనలో తప్పులు చెప్పడం లేదు, రెండోది మనల్ని బ్లేమ్ చేయడం అలా బ్లేమ్ చేసే వాళ్ళకి మీరు సమాధానం ఇచ్చుకుంటూ పోతే మీ కోసం మీరు బతకడం మానేస్తారు. మీ జీవితంలో అశాంతి అనేది మిగులుతుంది మీ జీవితంలో ఉన్న శాంతి పూర్తిగా పోతుంది అంతేగా కాకుండా కొత్త సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి అవాయిడ్ సీకింగ్ రివెంజెస్ ప్రతీకారం కోసం పరిగెత్తడం మానేయండి.
ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తే ఫోకస్ ఆన్ యువర్ గోల్స్. మిమ్మల్ని ఎవరైనా అవమానిస్తున్నారు అంటే మీరు వాళ్ళకి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని ఇందాక చెప్పాను కదా మీకు ఎదురయ్యే ప్రతి ఒక్క అవమానం మిమ్మల్ని కింద పడేయడానికి కాదు. మరింత ఎత్తుకు ఎదిగేందుకు మిమ్మల్ని ప్రేరేపించే ఒక టూల్ మాత్రమే. కాబట్టి మిమ్మల్ని ఎవరైనా అవమాన పరిస్థితే మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి అవమానాన్ని ఎదుర్కోవడం అంటే ఆగిపోవడం కాదు అది మరింత బలంగా ముందుకు సాగటమే. అలా చేస్తేనే మనం మన జీవితంలో విజయవంతంగా మిగిలిపోతాము లేకపోతే మిమ్మల్ని అవమానించిన ప్రతి ఒక్కరికి సమాధానాలు చెప్పుకుంటూ మీ జీవితాన్ని వృధా చేసుకున్న వాళ్ళు అయిపోతారు. కాబట్టి జీవితంలో ఎవరికైనా అవమానాలు ఎదురవుతాయి కానీ వాటిని ఎలా ఎదుర్కోవాలో ఎలా మన వ్యక్తిత్వాన్ని నిలుపుకోవాలో నేర్చుకోవడం ముఖ్యం.
మీరు ఈ ఆరు సూత్రాలను పాటిస్తే మీ జీవితంలో ఎలాంటి అవమానాన్ని అయినా సరే ఎదుర్కొంటారు. ఈ టాపిక్ మీకు నచ్చితే షేర్ చేయండి అంతేకాకుండా మీరు గనుక ఇప్పటికి మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి..
ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.