ధనవంతులికి పేదవాళ్ళకి మధ్య అసలైన తేడా – danavathulaki pedavadiki madya teda
ఇవాళ్టి టాపిక్ లో danavathulaki pedavadiki madya teda గురించి తెలుసుకుందాం.
ధనవంతులికి పేదవాళ్ళకి మధ్య అసలైన తేడా
మనమందరం ఒకే లోకంలో పుట్టాము కానీ ఎందుకు కొంతమంది ధనవంతులు అవుతున్నారు మరి కొంతమంది పేదవాళ్ళుగా మిగిలిపోతున్నారు దానికి కారణం చాలా మంది ఏమంటారంటే అదృష్టం అని చెప్పి అంటారు. నాకు తెలిసినంత వరకు అదృష్టం అయితే కాదు మన ఆలోచన విధానం. ఈరోజు మన టాపిక్ కూడా అదే ధనికులకి పేదవాళ్ళకి మధ్య తేడా ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాము.
ఇంకా డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్ళే ముందు మీరు కూడా అందరిలాగే అదృష్టం అనేది కలిసి రావాలి కలిసి వస్తేనే మనం ధనవంతులు అవుకుంటాం అనుకున్న వాళ్ళు మాత్రం ఈ టాపిక్ ని చివరిదాకా చదవండి ఎందుకంటే ఈ టాపిక్ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది.
ధనవంతుల ఆలోచన విధానం ఎలా ఉంటుంది
ఇంకా డైరెక్ట్ గా పాయింట్ లోకి వెళ్తే అసలు ధనవంతుల ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనే పాయింట్ మనం ఫస్ట్ తెలుసుకుందాము. ధనికులు ఎలా ఆలోచిస్తారు. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు ఎదుగుదలపై మాత్రమే దృష్టి పెడతారు అవకాశాలను గమనిస్తారు అవకాశాల్ని సృష్టించుకుంటారు. అంతేకాకుండా వారికి నమ్మకం ఎక్కువ. ధనికులు వాళ్ళపై వాళ్ళు నమ్మకం ఉంచుకుంటారు ముందుకు సాగుతారు ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా వాటిని ఒక లెసన్ లాగా ట్రీట్ చేసి మరింత స్ట్రాంగ్ అవుతారే తప్ప వాళ్ళ మీద వాళ్లకున్న నమ్మకం మాత్రం అస్సలు కోల్పోరు గెలుపు పై ఫోకస్ గా ఉంటారు వారికి ఒకే ఆలోచన ఉంటుంది నేను ఎలా గెలుస్తాను అన్నదే వాళ్ళు ఇబ్బందులు ఉన్నా అది ఎలా క్లియర్ చేయాలని చూసుకుంటారే కానీ వాటికి భయపడిపోయి వెనకడుగు మాత్రం అస్సలు వేయరు. వారికి ఎన్నో అడ్డంకులు ఎదురైనా సరే వాటిని ఒక ఛాలెంజ్ లో తీసుకుంటారే తప్ప ఓటమని మాత్రం అస్సలు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ ఎప్పుడూ వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం మాత్రమే. ఈ మధ్యలో ఎదురయ్యే చిన్న చిన్న కష్టాలను చూసి భయపడిపోయి అలా వెనకడుగేస్తే జీవితం లో ఏమీ సాధించలేము అన్న సంగతి వాళ్ళకి క్లియర్ కట్ గా తెలుసు.
పేదవాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది
ఇంకా పేదవాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందో తెలుసుకుందాము. పేదవాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే వాళ్ళకి ఎన్ని ఛాన్సులు వచ్చినా సరే అక్కడ మనం సేఫ్ గా ఉండలేమేమో ఒకవేళ మనం గెలవలేమేమో ఉన్న ఈ కాస్త ఫెసిలిటీస్ కూడా మన జీవితంలో నుంచి మనకి దూరమైపోతాయేమో అని చెప్పేసి వాళ్ళు నిరంతరం భయపడుతూనే ఉంటారు. కొత్త దారులు ప్రయత్నించడానికి భయపడతారు లైఫ్ లో రిస్క్ తీసుకోవడానికి భయపడతారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒక పనిని స్టార్ట్ చేయకముందే అందులో వాళ్ళు ఓడిపోయినట్లు వాళ్లకు వాళ్లే ఊహించుకొని నిరంతరం భయపడుతూనే ఉంటారు. అంతేకాకుండా జీవితంలో వచ్చే చిన్న చిన్న సమస్యలకి కూర్చొని బాధపడుతూ ఉంటారు తప్ప అసలు ఆ సమస్యలు ఎందుకు వస్తున్నాయి ఒకవేళ వస్తే మనం ఏం చేయాలని చెప్పేసి వాటి గురించి అస్సలు ఆలోచించరు. ఎప్పుడూ జరగబోయే విషయాల గురించి నెగిటివ్ గా ఆలోచిస్తూ ఉంటారు అదృష్టం బాగోలేదు అంటారు పరిస్థితులు సహకరించట్లేదు అంటారు నా టైం కాదని చెప్పేసి రకరకాల సాకులు చెప్పుకుంటూ వాళ్ళ జీవిత లక్ష్యాలకి వాళ్ళని వాళ్ళు దూరం చేసుకొని కేవలం అదృష్టం మీదే జీవితం ఆధారపడి ఉంటుందని చెప్పేసి వాళ్లకు వాళ్ళు భావిస్తూ ఉంటారు.
ఓవరాల్ గా ఇలాంటి వాళ్ళకి నేను చెప్పవచ్చేది ఏంటంటే ధనికులు పేదవాళ్ళు అనేది బ్యాంక్ బ్యాలెన్స్ మీద ఆధారపడి ఉండదు అది మీ మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. రిస్క్ తీసుకోండి పెద్దవాళ్ళు ఎన్నో సార్లు ఫెయిల్ అయ్యి చివరికి జీవితంలో విజయం సాధిస్తారు. ఎలాన్ మస్క్ అవ్వచ్చు, అంబాని అవ్వచ్చు వీళ్ళందరూ మొదట్లో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు కానీ వీళ్ళల్లో ఉన్న ఒక ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు రిస్క్ తీసుకున్నారు కొని వాళ్ళ జీవితంలో వాళ్ళు ముందుకు సాగుతారే తప్ప ఓటమిని చూసి భయపడిపోరు. అలా అని చెప్పేసి మనకు టైం కలిసి రావట్లేదు మన అదృష్టం బాగోలేదు మన పరిస్థితులు మనకు సహకరించట్లేదు అని చెప్పేసి సాకులు చెప్పుకుంటూ వాళ్ళ పనిని అక్కడే ఆపేసి అస్సలు కూర్చోరు. కాబట్టి లైఫ్ లో రిస్క్ అనేది తీసుకోవాలి. అది కూడా బ్లైండ్ గా తీసుకునే రిస్క్ వేరు క్యాలిక్యులేటెడ్ గా తీసుకునే రిస్క్ వేరు ఒక రిస్క్ ని మనం క్యాలిక్యులేటర్ గా తీసుకోవడం వల్ల ఆ రిస్క్ వల్ల మనకు జరిగే నష్టాన్ని ముందుగానే క్యాలిక్యులేట్ చేయొచ్చు. అలా కాకుండా మనం సక్సెస్ అయ్యాము అనుకోండి ఇంకా హ్యాపీ. కాబట్టి లైఫ్ లో ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా రిస్క్ ని తీసుకోవాలి. రిస్క్ తీసుకున్నా కూడా అనుకోకుండా మీకు ఫెయిల్యూర్ ఎదురైంది అనుకోండి దాన్ని ఒక లెసన్ లా తీసుకొని ఇంకొకసారి మీ జీవితంలోకి ఆ ఫెయిల్యూర్ రాకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప రిస్క్ తీసుకోకుండా ఉంటాను అంటే మాత్రం అస్సలు కుదరదు. కాబట్టి నేను ఇంకొంచెం క్లియర్ గా మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ధనవంతులుగా ధనికులుగా జీవితంలో సక్సెస్ఫుల్ గా ఉన్నారో వీళ్ళందరూ ఒకప్పుడు పేదవాళ్లే. కాకపోతే వాళ్ళకి ఇప్పుడు పేదవాళ్ళుగా ఉన్న వాళ్ళకి తేడా ఏంటంటే వాళ్ళ ఆలోచన విధానం. రిస్క్ తీసుకునే విధానం మరీ ముఖ్యంగా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దాని కోసం పోరాడే తత్వం ఈ లక్ష్యాలు పెట్టుకోకుండా ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది చివరికి పేదవారుగా మిగిలిపోతారు.
కాబట్టి ఇంకోసారి నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కేవలం మీ లక్ష్యం కోసం మాత్రమే పని చేయగలిగితే మీరు కూడా ధనవంతులు అవుతారు. అసలు ధనవంతులు అనే పాయింట్ తీసేయండి మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు లైఫ్ లో మీకంటూ ఒక సంతృప్తి అనేది మిగులుతుంది. నేను ఇది అవ్వాలనుకున్నాను అయ్యాను చాలు అనే ఒక సంతృప్తి అనేది అందరికీ దక్కదు జీవితంలో లక్ష్యం కోసం పోరాడిన కొందరికి మాత్రమే దగ్గే ఒక అద్భుతమైన అనుభూతి అది. కాబట్టి నేను ఏమంటానంటే మీ ఆలోచన విధానం మార్చుకోండి మీ లక్ష్యం కోసం మీరు రిస్క్ తీసుకోండి. ఒకవేళ ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా వాటిని అర్థం చేసుకొని వాటిని పాఠాలుగా నేర్చుకొని మళ్ళీ అటువంటి ఫెయిల్యూర్ మీ జీవితంలోకి రాకుండా చూసుకోండి. ఎందుకంటే ఫెయిల్యూర్స్ అనేవి ప్రతి ఒక్క మనిషికి వస్తూనే ఉంటాయి వాటిని దాటుకొని వెళ్ళినప్పుడే మన లక్ష్యాన్ని మనం చేరుకుంటాము. కాబట్టి మీరు పేదవాళ్ళుగా మిగిలిపోతారా లేకపోతే మీ లక్ష్యాన్ని రీచ్ అయ్యి మీరు ధనవంతులుగా ఉంటారా అనేది కేవలం మీ చేతుల్లోనే ఉంది. అందుకే మీ జీవిత లక్ష్యాన్ని రీచ్ అవ్వడం కోసం ఈరోజే మీ లక్ష్యం కోసం కష్టపడి పని చేయడాన్ని ప్రారంభించండి. ఏదో ఒక రోజు మీరు అనుకున్న ఆ లక్ష్యాన్ని మీరు తప్పకుండా రీచ్ అవుతారు.
ఈ టాపిక్ మీకు నిజంగా నచ్చితే షేర్ చేయండి అంతేకాకుండా మన బ్లాగ్ లో ఎలాంటి టాపిక్ కవాలిఅనుకుటున్నారో ఆ టాపిక్ ని కూడా కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.