బుర్రను పాడుచేసే రోజువారీ అలవాట్లు – Brain Damage Chestunna Alavatlu
ఇవాళ్టి టాపిక్ లో Brain Damage Chestunna Alavatlu గురించి తెలుసుకుందాం.
మీ బుర్ర పాడుచేసే అలవాట్లు
ఈరోజు నేను మీకు చెప్పబోయే విషయం ఏంటంటే మీకు తెలియకుండా ఈ మూడు అలవాట్లు మీ బ్రెయిన్ ని డామేజ్ చేస్తున్నాయి అలా మీ బ్రెయిన్ డామేజ్ అవ్వడం వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని మీరు కోల్పోతున్నారు. అంతేకాకుండా మీ జీవితాన్ని మీరు నరకంగా మార్చుకుంటున్నారు అది కూడా మీకు తెలియకుండా ఇక్కడ అదే హైలైట్.
కాబట్టి డైరెక్ట్ గా పాయింట్ కి వెళ్ళే ముందు మీరు గనక మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే ఒకే ఒకసారి ఫాలో చేయండి.
POOR SLEEP
ఇంకా డైరెక్ట్ గా పాయింట్ కి వెళ్ళిపోతే మీకు తెలియకుండా మీ బ్రెయిన్ ని డామేజ్ చేస్తున్న మొట్టమొదటి అలవాటు పూర్ స్లీప్. మామూలుగా మనం రోజుకి ఏడు లేదా ఎనిమిది గంటలు పడుకోవాలి అది కూడా మామూలు స్లీప్ కాదు డీప్ స్లీప్ అన్నమాట అంటే గాఢ నిద్ర పోవాలి. అలా ఏం కాకుండా మనం చక్కగా రోజుకి ఒక నాలుగు గంటలు ఐదు గంటలు పడుకుంటున్నాము అది కూడా తెల్లారి గట్లు ఒక మూడు గంటలు పడుకొని ఒక ఏడు గంటలు లెగిసి హడావిడిగా మన పనికి మనం పరిగెడుతున్నాము. అలా పరిగెడుతూ వల్ల మీకు శాలరీ వస్తుంది అనుకుంటున్నారు కానీ మీకు తెలియకుండా మీ బ్రెయిన్ ని మీరే డామేజ్ చేసుకుంటున్నారు. అంతే కాకుండా మీ జీవితాన్ని మీరే పాడు చేసుకుంటున్నారు. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే రోజుకి ఏడు లేదా ఎనిమిది గంటలు ప్రాపర్ స్లీప్ ని గనక మీరు ప్లాన్ చేసుకోకపోతే ఫ్యూచర్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అంతేకాకుండా ప్రెసెంట్ లో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. సరిగ్గా ఏ విషయం గుర్తుపెట్టుకోలేకపోవడం చిన్న చిన్న విషయాలకి కోప్పడటం ఇలాగ మీ ఆలోచనలు మీ కంట్రోల్ లో ఉండవు అంతే కాకుండా మీ కోపం మీకు అస్సలు కంట్రోల్ ఉండదు. కాబట్టి ప్రాపర్ స్లీప్ వేయటం వల్ల మీరు ప్రతి ఒక్క విషయాన్ని చాలా క్లీన్ గా ఆలోచిస్తూ ఉంటారు. అంతే కాకుండా బాడీని మళ్ళీ మీరు రీచార్జ్ చేసినట్టు ఉంటుంది,హెల్తీగా ఉంటారన్నమాట.
POOR DIET
ఇంకా మీ బ్రెయిన్ ని మీకు తెలియకుండా డామేజ్ చేస్తున్న రెండో అలవాటు పూర్ డైట్. మామూలుగా ప్రతి ఒక్క మనిషి శరీరానికి చక్కటి ఆహారం కావాలి అంతేకాకుండా ఒక మంచి డైట్ ని మనం ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని క్రమబద్ధంగా ఆ శరీరానికి కావలసిన ఆ పోషకాలు ఏవో వాటికి అందిస్తూ ఉండాలి. కానీ మనం ఏం చేస్తాం అవేవి కాకుండా మన శరీరానికి ఏవైతే డామేజ్ చేస్తాయో వాటన్నిటిని ఏరి కోరి డబ్బులు ఇచ్చి మరి కొనుక్కొని తింటూ ఉంటాం. కాబట్టి నేను చెప్పవచ్చేది ఏంటంటే శరీరానికి ఏవైతే ఉపయోగకరంగా ఉంటాయో వాటిని ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని తినాలి అలా కాకుండా జంక్ ఫుడ్ తినటం వల్ల ఫస్ట్ అఫ్ ఆల్ మన శరీరానికి డామేజ్ అవుతుంది ఆ తర్వాత మనం ఇంకా ఫుల్ గా తినటం వల్ల మన బ్రెయిన్ కూడా పని చేయకుండా పోతుంది. అంత ఎందుకండీ కడుపు నిండా ఫుల్ గా తిని మనం ఏదైనా పనికి వెళ్ళాం అనుకో ఎలా ఉంటుంది మన పరిస్థితి అక్కడ మనం పని చేయలేము. అంతేకాకుండా కనీసం మన బ్రెయిన్ ని మనం కంట్రోల్ కూడా చేసుకోలేం. ఎందుకంటే పుల్లంతా మత్తు మత్తుగా ఉంటుంది నిజం చెప్పాలంటే అవసరానికి మించి ఎక్కువ తింటే ఏదైనా సరే మన శరీరానికి హానికరమే అందులోనూ అవసరానికి మించి జంక్ ఫుడ్ తింటే దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రాపర్ డైట్ ని మెయింటైన్ చేయండి ఏది మన శరీరానికి అవసరమో ఏది మన శరీరానికి అనవసరమో తెలుసుకొని మీ శరీరాన్ని మీరు అద్భుతంగా చూసుకోండి.
CHRONIC STRESS
ఇంకా మీకు తెలియకుండా మీ బ్రెయిన్ ని డామేజ్ చేసే మూడో అలవాటు చాలా ఇంపార్టెంట్ అయిన అలవాటు క్రానిక్ స్ట్రెస్ దీర్ఘకాలిక ఒత్తిడి. ఫిజికల్ గా మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి ఆ పని అవుతుందో లేదో ఒకవేళ ఆ పని వల్ల మనకు ఏదైనా అవుతుందా అని చెప్పేసి అసలు ఆ పని స్టార్ట్ చేయకముందే మనం ఓవర్ గా థింక్ చేసి మనల్ని మనం ఒత్తిడికి గురి చేసుకుంటాం. ఇది ప్రతి ఒక్క మనిషికి ఉండే భయంకరమైన అలవాటు. దయచేసి నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు మీ జీవితంలో చక్కగా నిద్రపోయి లేచిన తర్వాత మంచి ఆహారం తీసుకొని ఆ తర్వాత యోగా గాని ధ్యానం గాని ఇలాంటి వాటిని మీ శరీరానికి అలవాటు చేస్తే గనుక ఫస్ట్ అఫ్ ఆల్ మీకు ఈ దీర్ఘకాలిక ఒత్తిళ్లు లేకపోతే ఓవర్ థింకింగ్లు అసలు జరగని దాన్ని జరిగినట్టు ఊహించుకునే హాజినేషన్లు(HOLGINATION) ఇవన్నీ మీకు దూరంగా ఉంటాయి. దీనివల్ల మీ బ్రెయిన్ అనేది చాలా కంఫర్ట్ గా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలా కాకుండా మీ బ్రెయిన్ ని మీరే బెజాఫై చేసుకుంటే ఎలా చెప్పండి.
కాబట్టి ఈ మూడు అలవాట్లు గనుక మీకు ఉంటే వాటిని కొంచెం కంట్రోల్ లో పెట్టుకొని వాటికి తగిన విధంగా నడుచుకోండి చక్కగా నిద్రపోండి. ఇంకా ముఖ్యంగా మంచి ఆహారం తినండి ఆ తర్వాత యోగా ధ్యానం ఇలాంటివి కొంచెం ప్రాక్టీస్ చేయండి. చాలా అద్భుతమైన జీవితాన్ని గడపండి.
ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.